తూర్పుగోదావరి : ‘మూడు రాజధానులు మా విధానం. న్యాయస్థానాన్ని ఒప్పించి రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని, ఆ ప్రక్రియలోనే ప్రభుత్వం ఉంది’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మిగిలిన 32 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లకు త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విలీన గ్రామాలను కలుపుకునే రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతాయన్నారు. రాజమహేంద్రవరాన్ని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.