విజయవాడ: చంద్రబాబు హోల్‌సేల్‌గా అవినీతి, దోపిడీ చేశాడు కాబట్టే 2019 ఎన్నికల్లో ప్రజలు కూడా హోల్‌సేల్‌గా ఇంటికి పంపించారని, రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీని ఇంటికే పరిమితం చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హోల్‌సేల్ ఎవరో, రిటైల్ ఎవరో ప్రజలకు బాగా తెలుసు అని చురకలంటించారు. చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులే వైయస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని, అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. లోకేష్ పాదయాత్రను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.