విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేనీ వంశీ వ్యవహారంలో జైలు సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తతున్నాయి. శుక్రవారం విజయవాడ జిల్లా జైల్లో ఉన్న వల్లభనేనీ వంశీతో మూలఖత్ అయ్యేందుకు జైలు వద్దకు ఆయన సతీమణి పంకజ శ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని, వైయస్ఆర్‌సీపీ డాక్టర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివ భారత్ రెడ్డిలు వచ్చారు. అయితే, వంశీతో ములాకత్ అయ్యేందుకు వచ్చిన వంశీ సతీమణితో పాటు వైయస్ఆర్‌సీపీ నేతల్ని జైలు సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తాము నిబందనల ప్రకారం ములాఖాత్ కోసం వస్తే ఎందుకు అడ్డుకున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు జైలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సమయం ముగుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేయడంతో జైలు సిబ్బంది అరగంట తరువాత ములాఖాత్ కోసం లోపలికి పంపించారు.