విద్య‌తోనే స‌మున్న‌తి

రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్ర‌సాద‌రావు

మెరిట్ విద్యార్థుల‌కు జ‌గ‌న్న‌న్న ఆణిముత్యాలు పేరిట స‌త్కారం

శ్రీ‌కాకుళం:  విద్య‌తోనే స‌మున్న‌తి,సామాజిక ఉన్న‌తి సాధ్య‌మ‌ని రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద రావు అన్నారు. స్థానిక బాపూజీ క‌ళామందిరంలో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఫ‌లితాల్లో నియోజ‌క వ‌ర్గ ప‌రిధిలో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థులను జ‌గ‌న్న‌న్న ఆణిముత్యాలు పేరిట స‌త్క‌రించారు. వారికి మెడ‌ల్స్ ప్ర‌దానం చేశారు. న‌గ‌దు బ‌హుమ‌తి అందజేసి, దీవించారు. ఇదే విధంగా రానున్న కాలాన కూడా రాణించాల‌ని పేర్కొంటూ శుభాకాంక్ష‌లు తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి ధ‌ర్మాన మాట్లాడుతూ..  విద్యార్థులకు, వారి త‌ల్లిదండ్రుల‌కు, అలానే వారిని ఉన్న‌తంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల‌కు అభినంద‌న‌లు. ఇలా మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకుని రావ‌డం ఎంతో ఆనంద‌దాయ‌కం. ఇండియన్ అడ్మనిస్ట్రేటివ్ సర్వీసెస్ కి చల్లా కల్యాణి కూడా ఇదే విధంగా రాణించి, ఆరు సార్లు యూపీపీఎస్సీ కి ఎంటెన్డ్ స‌క్సెస్ అయిన వైనం, 285 వ ర్యాంకు సాధించిన వైనం మ‌నందరికీ స్ఫూర్తిదాయ‌కం. అలానే మీలాంటి ప్ర‌తిభ ఉన్న‌వారిని ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్రోత్సహించడం ఇవాళ చాలా అవసరం. 

సామాజిక‌ స్థితి గ‌తులు మరాలి అంటే ఒక్క విద్య తోనే సాధ్యం. సామాజిక మార్పు అన్న‌ది విద్య‌తోనే సాధ్యం అని న‌మ్మిన ప్ర‌భుత్వం వైయ‌స్ఆర్‌సీపీ . అందుకే విద్యా రంగంలో అనేక మార్పులు చేశాం. విద్యా విధానంలో మార్పులు తీసుకువ‌స్తున్న క్ర‌మాన మొదట్లో విమర్శలు చేశారు. నాడు నేడు తో స్కూల్స్ బాగు పడ్డాయి. సిల‌బ‌స్ లు మారాయి .విద్యార్థుల్లో అత్మ విశ్వాసం పెరిగింది. విద్య ద్వారానే వ్యక్తులు, సమాజం సంస్క‌రించవ‌చ్చు అన్న భావ‌నతో ఇవాళ ఈ ప్ర‌భుత్వం మ‌రింత ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేస్తోంది.

ప్రపంచం తో పోటీ పడాలి అంటే ఇంగ్లీష్ విద్యతోనే సాధ్యం.. అది గుర్తించి ఇంగ్లీష్ మీడియం తీసుకు వచ్చాము. ప్రభుత్వం బడుల్లో చద్వుతున్న విద్యార్థులను చూస్తుంటే గర్వంగా ఉంది. జగనన్న విద్య కానుక ద్వారా తొమ్మిది ర‌కాల వ‌స్తువులు అందించాం. అలానే ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్థులకు టాబ్స్ అందించాం. ఇలా ప్రపంచం తో పోటీ పదాలని తపన మాది. పౌర స‌మాజం అంటే బాధ్యత లేకుండా మాట్లాడుతున్న వారికి  పిల్లల తల్లిదండ్రులు సమాధానం చెప్పాలి. గతంలో విద్యా సంవత్సరం మొదలు అవ్వగానే బుక్స్ కోసం,ఇతర వస్తువుల కోసం  ఇంట్లో కొంత ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ చింతన లేదు. మొదటి రోజునే అని ఇచ్చేశాం. ఇవాళ వైయ‌స్  జగన్ అనేక సంస్కరణలు తీసుకు వచ్చి.. సమాజం మార్పున‌కు కార‌ణం అవుతున్నారు.  వస్తున్నారు.ఎన్నికల ముందు ప‌సుపు కుంకుమ‌ల పేరిట 10 వేలు ఇచ్చిన నాటి ముఖ్య‌మంత్రి చంద్రబాబు గొప్పా..ఎన్నికైన 10వ రోజునే విద్యార్థుల కోసం ఆలోచన చేసిన వైయ‌స్ జగన్ గొప్పా .. అన్న‌ది అంతా గుర్తించాలి. మేలు చేసే ప్ర‌భుత్వానికి మ‌రోసారి అంతా మద్ద‌తుగా నిల‌వాలి అని మంత్రి ధర్మాన పేర్కోన్నారు

కార్య‌క్ర‌మంలో రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, ఎంఈఓ జీ కృష్ణారావు, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, డాక్టర్ ధానేటి శ్రీధర్, జడ్పీటిసి రుప్పా దివ్య,  గురుగుబిల్లి లోకనాథం, మండవిల్లి రవి కుమార్, మార్పు పృథ్వి, పీస శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Back to Top