శ్రీకాకుళం: అన్యాయాలకు చిరునామా తెలుగు దేశం పార్టీ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. మంగళవారం మంత్రి ధర్మాన ప్రసాదరావు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఇప్పిలి గ్రామంలో నిర్వహించారు. మండల పరిషత్ నిధులు నుంచి రు.5 లక్షలు కేటాయిస్తూ కనుగుల వాని పేట నుంచి ఇప్పిలికి రోడ్డు వేసేందుకు అనుమతులు మంత్రి ధర్మాన మంజూరు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తూ ఉన్న మంచి పనుల వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. ఓ రాజకీయ పార్టీ కార్యకర్తగా ఉన్న వారు ఇటువంటి విష ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే.. మార్పు గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీరంతా ఈ మూడున్నరేళ్ల కాలంలో వచ్చిన మార్పులు గమనించారు. అలానే ఓట్లు అడిగేందుకు కూడా ఇక్కడికి రాలేదు. ఎందుకంటే గతంలో కూడా మీరు నన్ను ఆదరించారు. ఇప్పుడూ ఆదరిస్తున్నారు. ఇప్పిలి గ్రామం నా గెలుపునకు ఉపయోగపడుతోంది. ఎప్పుడు అవకాశం వచ్చినా మీ రుణం తీర్చుకుంటాను అని చెప్పాను. ఇప్పుడు మనకు రాజధాని ఇష్యూ వచ్చింది. పాలన రాజధానిగా విశాఖను చేయాలని, శాసన సభ వ్యవహారాలను అమరావతిలోనూ, న్యాయ వ్యవహారాలను కర్నూలులోనూ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. విశాఖ పట్టణం అన్నది అతి పెద్ద నగరం. రాజధాని ఏర్పాటుకు అన్నింటా అనుకూలం. ఎందుకు వద్దనకుంటారంటే.. బాబు అక్కడ అమరావతిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేందుకు అనుకూలం. అప్పుడు హైద్రాబాద్ ను ఇలానే అభివృద్ధి చేశాం. అదేవిధంగా చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం అమరావతిని రాజధాని చేశారు. కానీ ఇప్పుడు అమరావతి ఉద్యమ కారులు వెనక్కు తగ్గారు. అన్యాయాల కు చిరునామా తెలుగుదేశం పార్టీ. మీరు వచ్చి అన్యాయాల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు..మీరెక్కడ ఉంటున్నారు. హైద్రాబాద్ లో ఉంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు. ఇవి సబబు కాదు. ప్రజలు అంత అమాయకంగా లేరు. మీరు మళ్లీ అధికారంలోకి వస్తారు. మీరు చెప్పిన మాట ఏనాడయినా నిలబెట్టుకున్నారా.. అయినా మార్పు ఎక్కడ లేదు. పిల్లలకు మంచి బట్టలు, బూట్లు, బెల్టు అందించాం. అదేవిధంగా పిల్లలకు మంచి నాణ్యత పూర్వక విద్య అందించాలి. ఇవన్నీ మార్పు కదా అలానే బడులకు కొత్త హంగులు అందించాం. మీరు ప్రజలను ఓటర్లుగా చూశారు. అంతేకానీ వారిని మనుషులుగా చూడాలి. అదేవిధంగా ఆ రోజు టీడీపీ హయాంలో అణిగిమణిగి ఉండాలి. కానీ ఈ రోజు ఆ విధంగా ఉందా.. ఆత్మాభిమానం చంపుకోకుండా ఆత్మ గౌరవంతో బతకాలి. ఇదీ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. టీడీపీకి ఎప్పుడూ ఓట్లు గోలే, కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు. మత్స్యకారులను.,నేతన్నలనూ ఆదుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా ఆర్థిక చేయూత ఇస్తున్నాం. ఈ గ్రామంలో నూటికి 94మందికి గ్రామంలో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అక్కడికి వచ్చి డబ్బులు ముఖ్యమంత్రి పంచేస్తున్నారు అని విపక్ష నాయకులు చెబుతున్నారు. కానీ మీ దగ్గరకు వచ్చి మేం కూడా అవే పథకాలు ఇస్తాం అని అంటున్నారు. పోనీ మేం అమలుచేస్తున్న పథకాలలో ఏంటి తప్పో చెప్పమనండి కానీ ఎవ్వరూ చెప్పరు. 75 సంవత్సరాల అనంతరం ఇప్పటికి కూడా ఇల్లు లేని, కడుపు నిండా తిండి లేని కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు ఈ ప్రభుత్వం సంకల్పిస్తోంది. అందుకే నిస్వార్థంగా., స్వచ్ఛంగా అందిస్తోంది. ఏదేమన్నా అంటే పెట్రోలు ధర పెరిగింది అంటారు. నూనె ధర పెరిగింది అంటారు. పప్పులూ, ఉప్పుల ధరలు కూడా పెరిగాయి. కానీ ఇదంతా నిజం కాదు. ధరలు పెరిగాయి కానీ ఇందుకు జగన్మోహన్ రెడ్డి కారణం కాదు. దేశ మంతటా పెరిగాయి ఇక్కడా పెరిగాయి. ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరిగాయి. ధరలు పెరిగాయి కనుక వీలున్నంత వరకూ రైతులకూ, మత్స్యకారులకూ, ఇంకా ఇతర వర్గాలకూ అండగా ఉంటున్నాం. వారిని ఆదుకుంటున్నాం. అదేవిధంగా కరోనా సమయంలో 9 నెలల పాటు నిత్యావసరాలు అందించాం. అభివృద్ధి లేదు లేదు అంటున్నారు. మరి ఆర్బీకే సెంటర్లు, వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు, గ్రామ సచివాలయాల ఏర్పాటు, నాడు నేడు లో భాగంగా పాఠశాలల ఆధునికీకరణ చేశాం. అదేవిధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు అందించాం. ఇందుకు భూమి కొనుగోలు నిమిత్తం పన్నెండు వేల కోట్ల రూపాయలు వెచ్చించాం. ప్రజా ధనం దోచుకునేందుకు విపక్షం విష ప్రచారం చేస్తోంది. ఈనాడు పేపర్ ప్రభుత్వంపై దొంగ మాటలు చెప్పారే తప్ప ప్రజలను సరైన మార్గంలో పెట్టే వార్తలు ఏమయినా రాశారా. రాజకీయ పార్టీ కార్యకర్తలంతా ఇటువంటి విష ప్రచారాన్ని అడ్డుకోవాలి. అంతేకాదు ఆడవారికి ఆర్థికంగా అండదండలు అందించేందుకు నిర్ణయం తీసుకుని, పథకాల లబ్ధి అంతా వారికే దక్కే విధంగా చేస్తూ ఉన్నాం. ఇవేవీ కనిపించడం లేదా విపక్షాలకు ? అని ప్రశ్నించారాయన. ఇదే సందర్భంలో ప్రభుత్వ పథకాల అమలు వెనుక ఉన్న ఉద్దేశాన్ని మరోసారి వివరించారు. ఈ నెల 23న నరసన్నపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే సీఎం సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. తొలుత యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ.. రూ.10.4275 కోట్లు మేర సంక్షేమం పేరిట ఆర్థిక లబ్ధి ఇప్పిలి గ్రామస్థులకు కల్పించామని తెలిపారు. 63 మందికి ఇంటి పట్టాలు ఇచ్చామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపిపి నిర్మల శ్రీనివాసరావు, జెడ్పిటిసి రుప్పా దివ్య, సర్పంచ్ లోలుగు కనక మహా లక్ష్మీ, ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాత బాబు, వైయస్ఆర్‌సీపీ నాయకులు అంబటి శ్రీనివాసరావు, చిట్టి జనార్ధనరావు, లోలుగు శ్రీనివాసరావు, కరణం శ్రీనివాస్, బొడ్డేపల్లి పద్మజ, చంద్ర మౌళి, చిట్టి రవి, కూర్మరావు, గంగు నరేంద్ర, కంచు వసంత, రాజారావు, బన్నా నర్సింగరావు, తహశీల్దార్ వెంకటరావు, ఎంపిడివో రఘు, తదితరులు ఉన్నారు