అమరావతి: కమ్యూనిస్టులకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలిచారని మంత్రి కన్నబాబు తెలిపారు. ఎన్నో అవార్డులు వ్యవసాయ రంగానికి వచ్చాయని, ఇతర రాష్ట్రాల మంత్రులు రాష్ట్రానికి వచ్చి ఆర్‌బీకేల గురించి ఆరా తీస్తున్నారని తెలిపారు. ఏపీ అగ్రికల్చర్ రంగాన్ని కేరళ వ్యవసాయ మంత్రే స్వయంగా ప్రశంసించారు. ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశం ప్రారంభమైంది. వ్యవసాయ రంగంపై చర్చ జరుగుతోంది. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక విస్తారంగా వానలు కురిశాయని తెలిపారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని కురసాల కన్నబాబు విమర్శించారు. మంగళగిరిలో తనయుడి నారా లోకేష్ ఓడిపోతే తట్టుకున్న గుండె చంద్రబాబుది కాబట్టే..ఇవాళ కుప్పంలో టీడీపీ ఓడిపోయినా తట్టుకోగలిగారని ఎద్దేవా చేశారు. ప్రతి గ్రామంలో ఒక అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు ఉంటుంది. బ్రహ్మాండంగా పంటలు పండించిన రైతులను సభ్యులుగా తీసుకున్నాం. రైతు భరోసా కేంద్రానికి అనుసంధానంగా అగ్రికల్చర్ బోర్డు పని చేస్తుంది. ప్రతి నెల మొదటి శుక్రవారం గ్రామ స్థాయిలో సమావేశం జరుగుతోంది. క్రమం తప్పకుండా రెండో శుక్రవారం మండల స్థాయిలో సమావేశం అవుతుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలను కూడా భాగస్వాములను చేశాం. గ్రామాల్లో నుంచి వచ్చిన ఎజెండాలను జిల్లాలోని మూడో శుక్రవారం జిల్లా స్థాయి బోర్డు సమావేశం అవుతుంది. ఇన్‌చార్జ్ మంత్రి దానికి గౌరవ చైర్మన్‌గా ఉంటారు. ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఇక్కడికి పంపిస్తారు. ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ అధికారులు ఒక విధానంలోకి తీసుకొచ్చి..ఉన్నత స్థాయిలో చర్చిస్తారు. లక్ష మంది రైతుల భాగస్వామ్యంతో ఇవాళ అగ్రికల్చర్ బోర్డు నడుస్తోంది. మార్కెట్ కమిటీలకు సీఎం వైయస్ జగన్ ఎమ్మెల్యేలను గౌరవ చైర్మన్లుగా నియమించారు. ఒక్క రోజు కూడా చంద్రబాబు, అచ్చెన్నాయుడు హాజరు కావడం లేదు. నిద్ర పోతున్నారు. ఏడాది అవుతుంది..అడ్వైజరీ బోర్డులో ఏ రోజు కూడా మండల స్థాయి నాయకులు కూడా హాజరు కాలేదు. రైతుల కోసం వీరు ఒక్క సలహా కూడా చెప్పలేదు. కడుపు మంటతో అడ్డుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు గురించి మాట్లాడితే ఏడాది పాటు సభ పెట్టినా సరిపోదు. చంద్రబాబు కౌగిలించుకోని పార్టీలేదు. తిరుపతికి వచ్చిన అమిత్‌షా పై చంద్రబాబు రాళ్లు వేయించాడు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా?. మా నాయకుడిది ప్రజల ఆకాంక్షల మేరకే పరిపాలన జరుగుతుంది. ఎవరైనా ఒక సమస్య చెబితే దానిపై తక్షణమే స్పందించే వ్యవస్థ కావాలని స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చాం. మే 2020లో దాన్ని ప్రారంభించాం. 3.50 లక్షల కాల్స్ వచ్చాయి. రైతులకు సలహాలు ఇచ్చాం. ఇందుకోసం శాస్త్రవేత్తలను తీసుకువచచాం. రైతు తన పంటలో ఒక పురుగు, తెగులు ఉంటే దాన్ని వాట్సాప్లో పంపితే ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చే వ్యవస్థను తీసుకువచ్చామని మంత్రి కన్నబాబు తెలిపారు. ఏపీలో అయిల్ ఫామ్ రైతులు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి చక్కెర కార్మగారాన్ని కాపాడుతాం. చక్కెర రైతుల బకాయిలను మా సీఎం తీర్చారు. ఎంప్లాయిస్‌కు పెట్టిన బకాయిలు చెల్లించాం. పొగాకు రైతుల గురించి వైయస్ జగన్ సమావేశం ఏర్పాటు చేసి రేపటి నుంచి ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేస్తుందని, మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొన్న చరిత్ర మా ప్రభుత్వానిది. ఐటీసీ కంపెనీలు రైతులను ఆదుకోవాల్సింది పోయి ధరలు తగ్గిస్తామంటే..మేమే ఆదుకుంటామని మా సీఎం ముందుకు వచ్చారని తెలిపారు.