విశాఖపట్నం: ఏడాది కాలంలో వ్యవసాయ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఈ అంశంపై చంద్రబాబు చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏపీలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయానికి పెద్దపీట వేశారన్నారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మరని, , చంద్రబాబుకు, యనమల రామకృష్ణుడుకి వ్యవసాయం గుర్తించి మాట్లాడే అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారన్నారు.