చంద్ర‌బాబు మైండ్ సెట్ అర్థం కావ‌డం లేదు

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు

తూర్పుగోదావ‌రి: ప‌్ర‌తిప‌క్ష‌నేతగా ఉన్న చంద్ర‌బాబు బాధ్య‌తారాహిత్యంగా మాట్లాడుతున్నార‌ని, ఆయ‌న మైండ్ సెట్ ఏమిటో అర్థం కావ‌డం లేద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు అన్నారు. 10 సెక‌న్ల‌కు ఒక‌రు క‌రోనాతో చ‌నిపోతున్నారంటూ ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేసేలా చంద్ర‌బాబు మాట్లాడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అబ‌ద్ధాల‌ను ప్ర‌చారం చేయ‌డం చాలా దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని మండిప‌డ్డారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో మంత్రి క‌న్న‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డ‌మే చంద్ర‌బాబు ప‌నిగా పెట్టుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల‌కు న‌ష్టం, క‌ష్టం  జ‌రుగుతున్న ఆలోచ‌న కూడా చంద్ర‌బాబుకు లేదన్నారు. దేశంలో అత్య‌ధికంగా క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉంద‌న్నారు. క‌రోనా గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు స‌మాచారం అందిస్తున్నామ‌ని, క‌రోనా క‌ట్ట‌డికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను దేశ‌మంతా చ‌ర్చిస్తోంద‌న్నారు. ఏపీలో క‌రోనా ఇన్ఫెక్ష‌న్ రేటు 5.56 శాతం ఉంద‌ని, రిక‌వ‌రీ రేటు 48.78 శాతం, మ‌ర‌ణాల రేటు -1.18 శాతంగా ఉంద‌న్నారు. ఎంతో అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబుకు క‌నీస విజ్ఞ‌త లేదా..? అని ప్ర‌శ్నించారు.

 

Back to Top