టీడీపీని కనుమరుగు చేయాలంటే నిమిషం పని

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయనగరం: లోకేష్‌ స్పీకర్‌కు బహిరంగ లేఖ రాయడం హాస్యాస్పదమని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయనగరం పట్టణంలోని లీ ప్యారడైజ్‌లో నెరెడ్కో ప్రాపర్టీ షో – 2019ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనర్సయ్య, బడుకొండ అప్పలనాయుడు పాల్గొన్నారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్‌ పదవిని దిగజార్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్యాన్‌ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా చంద్రబాబు కొనుగోలు చేశాడని మండిపడ్డారు. అలాంటి అనైతిక చర్యలకు పాల్పడిన చర్యలు తీసుకోలేని పరిస్థితిలో గత స్పీకర్‌ ఉండేవారన్నారు. టీడీపీని కనుమరుగు చేయాలంటే వైయస్‌ జగన్‌కు ఒక్క నిమిషం పని అని, కానీ విలువలతో కూడిన రాజకీయం చేసే గొప్ప నేత సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. లోకేష్‌ కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్సీకి తక్కువ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఇరిగేషన్‌ మీద కనీస అవగాహన కూడా లేదన్నారు. 

Read Also: టీడీపీ అక్రమాలపై విచారణ చేయిస్తాం

Back to Top