కోవిడ్‌పై రాజకీయాలు చేయడం బాధాకరం
చంద్రబాబు ఒక్కరికైనా భరోసా ఇచ్చారా?
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: కోవిడ్‌పై చంద్రబాబు, లోకేష్ రాజకీయాలు చేయడం బాధాకరమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే..చంద్రబాబు ఒక్కరికైనా భరోసా ఇచ్చారా అని ఆయన ప్రశ్నింంచారు. కరోనా విపత్తులో చంద్రబాబు, లోకేష్ కనిపించకుండా పోయారన్నారు. కరోనా గురించి ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.ప్రభుత్వపరంగా అన్ని వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రవేట్ ఆసుపత్రుల్లోనూ కరోనాను ఆరోగ్యశ్రీకింద వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కృష్ణా జిల్లా ఆసుపత్రుల్లో బెడ్ల సామర్థ్యాన్ని పెంచామన్నారు. కరోనా పరీక్షల్లో కృష్ణా నంబర్‌వన్‌గా ఉందని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.