ప్ర‌జాస్వామ్య‌వాదులు నిన్ను క్ష‌మించ‌రు బాబూ!

మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

 పశ్చిమగోదావరి: న్యాయస్థానాన్ని మభ్యపెట్టి, మేనేజ్ చేసి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం కోసం చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యవాదులు క్షమించరని చంద్రబాబుపై మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు.  విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాన్ని చంద్రబాబునాయుడు పూర్తి చేయలేదని ధ్వ‌జ‌మెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శివరామకృష్ణ కమిటీని కనీసం పట్టించుకోలేదు. ఆయన ఒక చక్రవర్తిలా కలగన్నాడు. రాజధానిలో ఐదు సంవత్సరాల కాలంలో ఏ నిర్మాణం చేశాడు..?. కపట నాటకానికి, కుట్రపూరిత రాజకీయానికి తెరతీశాడు. సుమారు రెండు వేల ఎకరాల భూమిని అమ్ముకున్నాడు కానీ ఏ ఒక్క రైతుకు ప్రయోజనం కలగలేదు. 

మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ఈ రాష్ట్రంలో అడుగులు వేస్తున్న నాయకుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. వైయ‌స్ జగన్‌పై ఆరోపణలు చేశారు. అందులో ఏమాత్రం తప్పులేదు కనుకే విచారణ ఎదుర్కొన్నారు. కానీ మీ మీద ఆరోపణ వస్తే 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు. స్టేలు తెచ్చుకుంటే మీరు నిరపరాధి కాదు. అమరావతి భూముల్లో మీరు చేసిన స్కామ్‌లు సీబీఐ ఎంక్వయిరీలో అన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా వాటిని అనుభవించాలి. అనుభవించే రోజులు వస్తాయ‌ని చంద్ర‌బాబును మంత్రి హెచ్చ‌రించారు. 

Back to Top