చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారో?

చంద్రబాబు అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలి

ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి

నెల్లూరు: ఐటీ సోదాలు జరుగుతున్నా చంద్రబాబు నోరు ఎందుకు మెదపడం లేదని, ప్రెస్‌మీట్లు పెట్టి హడావుడి చేసే ఆయన..ఎక్కడ దాక్కున్నారని  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ప్రశ్నించారు. బాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నాయి. మాజీ పీఎస్‌కు రూ. వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. మాజీ పీఎస్‌తో పాటు టీడీపీ నేతల వెనకున్నదెవరో అందరికీ తెలుసు. చంద్రబాబు అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆనం రాంనారాయణరెడ్డి డిమాండు చేశారు. 
 

Back to Top