బద్వేల్‌ ప్రజలు సీఎం వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారు

డాక్టర్‌ దాసరి సుధ

వైయస్‌ఆర్‌ జిల్లా: బద్వేల్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడంతో ప్రజలంతా సీఎం వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారని రుజువైందని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ పేర్కొన్నారు.  తనను 92 వేల మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు, తన తరఫున ప్రచారం చేసిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉప ఎన్నికలో అవకాశం కల్పించి, తన పథకాలతో ఇంత భారీ మెజారిటీతో గెలిపించారని, సీఎం వైయస్‌ జగన్‌కు రుణపడి ఉంటానని చెప్పారు. గతంలో కంటే రెట్టింపు మెజారిటీతో గెలిపించారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తన తల్లిని గెలిపించాయని సుధ కుమార్తె పేర్కొన్నారు.
 

Back to Top