తాడేపల్లి: చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహమని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబును దశమ గ్రహం అంటూ ఎన్టీ రామారావు విమర్శించారని గుర్తు చేశారు. శనిగ్రహం కన్నా చాలా పవర్ ఫుల్ చంద్రబాబు అన్నారు. చంద్రబాబు కంటే ఉన్మాది ఎవరూ దేశంలో లేరన్నారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలు తరిమేసినా కూడా చంద్రబాబుకు బుద్ధి రాలేదని తెలిపారు.వాస్తవాలు ప్రజలకు వివరించేందుకు బస్సు యాత్ర చేస్తున్నారని వివరించారు. వైయస్ఆర్సీపీ బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంటే..మహానాడు వేదిక నుంచి అడ్రస్ లేని వెధవలు తొడగొడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల వ్యాఖ్యలను మాజీ మంత్రి కొడాలని నాని తిప్పికొట్టారు. శుక్రవారం వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్‌ను దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మహానాడుకు వచ్చిన కార్యకర్తలు, నేతలను నమ్మించేందుకు చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. వైయస్ జగన్ ఉన్మాదట..ఆయన్ను ఈ రాష్ట్రం నుంచి పంపించేయాలట..ఈయన పిలుపునిచ్చాడు. వైయస్ జగన్‌ను ఈ రాష్ట్రం నుంచి పంపించడానికి నీ వయసుకు సరిపోతుందా?. ఆయన ఏమైనా కొట్టుకువచ్చిన పార్టీకి అధ్యక్షుడు అనుకుంటున్నావా?. ప్రజలను నమ్ముకుని, ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల ఓటుతో ఎన్నికవ్వాలి. అడ్డదారిలో ఎవరో ఒకరి కాళ్లు పట్టుకొని అధికారంలోకి రావాలని అనుకోలేదు. సొంతంగా పార్టీ పెట్టి పది ఏళ్లు పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి వైయస్ జగన్. నీకు మాళ్లే ఎవరో పార్టీ పెడితే..వారి పంచన చేరి వెన్నుపోటు పొడిచి, ఆ పార్టీని దొంగించిన టువంటి దొంగ, నీ లాగా 420 అనుకుంటున్నావా? వైయస్ జగన్ ఉన్మాది కాదు..నీవు పండగ చేస్తున్నావు కదా? ఎన్టీఆర్ పుట్టిన రోజు చేసుకుంటున్నావు కదా? ఆయన నీకు ఓ పేరు పెట్టారు. జామాత దశమ గ్రహం అన్నారు. అంటే ఏమిటంటే..ఈ భూ ప్రపంచంలో 9 గ్రహాలే ఉంటాయి. అయితే మరో గ్రహం ఉంది. అదే అల్లుడి రూపంలో వచ్చిన 10 గ్రహం. శని గ్రహం కన్నా పవర్ పుల్ గ్రహం వీడు అని ఎన్టీఆర్ మాటలతో క్యాసెట్ రిలీజ్ చేశాడు. నీవు పెద్ద శని గ్రహం గాడివి. చంద్రబాబు ఈ రాష్ట్రానికి, తెలుగు దేశం పార్టీకి పట్టిన పెద్ద శనిగ్రహం. సిగ్గు లేకుండా ఇవాళ ఎన్టీఆర్ జయంతి జరుపుతున్నావంటే..నీకన్నా నీచుడు, దరిద్రుడు, నీ కన్నా సిగ్గు శరం లేని వ్యక్తి కానీ, అన్ని వదిలి అధికారమే పరమావధిగా భావిస్తున్న నీ లాంటి నీచుడికి ఏ పేరు పెట్టినా తక్కువే. పెద్దాయన ఎన్టీఆర్ పెట్టిన పేరు జామాత దశమ గ్రహం కాబట్టి..నీవు అల్లుడి రూపంలో ఈ రాష్ట్రానికి పట్టిన నిష్ట దరిద్రుడివి. ఎన్టీఆర్ చనిపోయిన తరువాత రామారావు పేరు చెప్పి పండగ చేస్తున్నారు. ఎన్టీఆర్ పేరు చెబితే నీకు, నీ కొడుకు నిద్ర పట్టదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్టీఆర్ పేరు చెబితే చాలు నీకు తడిచి పోతుంది. కింద పైనా తడుస్తుందంటే..నీవు చేసిన ద్రోహమే నీకు నిద్రపట్టని రాత్రులు. నీవు ఈ రోజు శనిగాడిలాగా ప్రజల ముందు ఉపన్యాసాలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు 2019లో నీకు 23 సీట్లు ఇచ్చి రాజకీయ సమాధి చేశారు. ఇంకా జలగ లాగా పట్టుకుని 2024లో ఎవరినో బయటకు పంపుతానని అంటున్నాడు. నీవు ప్రతిపక్షానికి కూడా పనికిరావని ప్రజలు ఛీదరించుకుంటున్నాడు. పనికిరాని సన్యాసిగాళ్లను పది మందిని వేదిక ఎక్కించి తిట్టిస్తూ పైచాచిక ఆనందం పొందుతున్నావు. ఎన్టీఆర్‌ను చంపినటువంటి వ్యక్తివి నీవు ఇవాళ ఆయన పుట్టిన రోజును జరుపుకోవడం సిగ్గు చేటు. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి, ఆయన పార్టీని, పదవిని లాక్కున్నటువంటి వ్యక్తివి. ఆయన చనిపోయి 27 సంవత్సరాలు అయినా..ఆయనకు వందో సంవత్సరం పుట్టిన రోజు వచ్చినా కూడా శనిగ్రహం లాగా విరగడకాకుండా తిరుగుతూనే ఉన్నావు. అందుకే నిన్ను జామాత దశమ గ్రహం అని ఆరోజు నామాకరణం చేశాడు. పెద్ద శనిగ్రహం కన్న గ్రహానివి. అమలాపురంలో మా దళిత మంత్రి ఇల్లు తగులబెట్టించావు. మా బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యే ఇల్లు తగులపెట్టించావు. అదే ముమ్మడివరం సభలో ఎమ్మెల్యే, మంత్రి ఈ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం వైయస్ జగన్‌ను కోరారు. అలాగే నీ నిక్కర బ్యాచ్ కూడా ఈ డిమాండు చేసింది. మేమే ఇల్లు కట్టించి మేమే తగులబెడుతామా? మహానాడు వేదిక నుంచి మాట్లాడుతున్నారు. ఒక్కడికి కూడా అడ్రస్ ఉండదు. పనికిమాలిన నాయకులతో తొడగొట్టిస్తున్నాడు. వైయస్ జగన్ గట్టిగా చూస్తే గుండె ఆడి చస్తారు. పార్టీ లేదు..బొక్కా లేదు అన్నటువంటి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మరో బొక్కగాడు మా గురించి మాట్లాడుతున్నారు. వైయస్ఆర్సీపీ నవగ్రహ పార్టీ అంటున్నారు. నవగ్రహాలు అంటే వైయస్ఆర్సీపీనే. వైయస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నారు. 9 గ్రహాలు వైయస్ఆర్సీపీకి ఇచ్చేశారు. పదో గ్రహం ..శనిగ్రహం చంద్రబాబు..ఎన్టీఆర్ చెప్పినట్లుగా జామాత దశమ గ్రహం చంద్రబాబు. రాష్ట్రాన్ని, టీడీపీని సర్వనాశనం చేసిన జామాత దశమ గ్రహం చంద్రబాబు..420 చంద్రబాబును ఈ రాష్ట్ర ఎల్లలు దాటించి తరిమి కొట్టాలని కోరుతున్నాను. వైయస్ జగన్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నత స్థానాలు కల్పిస్తున్నారు. రాష్ట్రంలో 17 మందిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంత్రి పదవులు ఇచ్చారు. కార్పొరేషన్లు, స్థానిక సంస్థల పదవులు 50 శాతానికి పైగా ఈ వర్గాలకే అధికారాన్ని కట్టబెడుతున్నారు. సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావాలని అనువణువు కూడా తాపత్రయపడుతున్న వైయస్ జగన్‌ను ఎందుకు దించేయాలి. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను గాలికి వదిలిన చంద్రబాబుకు ఎందుకు ఆదరించాలి. ఎస్సీలను రామోజీరావుకు, ఎస్టీలను రాధాకృష్ణాకు, బీసీలను బీఆర్ నాయుడికి, మైనారిటీలను తీసేసి దత్తపుత్రుడికి అప్పగించి ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలనుకుంటున్న దొంగలు, 420కి ఈ రాష్ట్ర ప్రజలు అండగా ఉండాలా?. ఈ వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలకు నీకు, నీ తొట్టి గ్యాంగ్‌కు రాజకీయ సమాధి కడుతారు. వీళ్లను గొయ్యి తీసి పాతాళంలో పాతిపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైయస్ జగన్ ఈ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతకు, ఈ రోజు మా వద్ద ఉన్న మంత్రులు అట్టడుగు వర్గాలకు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎల్లోమీడియా, చంద్రబాబు, దుష్టచతుష్టయం విష ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చేస్తుంటే చంద్రబాబు మహానాడులో బస్సు యాత్ర గురించి మాట్లాడుతూ విషం కక్కుతున్నారు. మంత్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు చెబుతుంటే ఈ బఫూన్‌గాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మహానాడులో లక్షలాది మందికి భోజనాలు పెడుతున్నారు. మా మంత్రులు 17 మంది బస్సు యాత్ర చేస్తుంటే మాపై అక్కస్సు ఎందుకు. మాది సామాజిక న్యాయభేరి. వైయస్ జగన్ చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం మాకు ఉంది. మహానాడు సభ మాకు పోటీ కాదు. నీ కొడుకు ను గెలిపించుకోలేని వేధవి..వైయస్ జగన్‌ను ఓడించేవాడివా? నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని కొడాలి నాని సెలవు తీసుకున్నారు.