నంద్యాల: ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కోసం న్యాయ పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అధ్యక్షతన మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు కోరారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పరితపిస్తూ ప్రజల పక్షాన నిలిచిన జననేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళతామని వారి నాయకత్వం వర్ధిల్లాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజలకు అనేక వాగ్దానాల ఇచ్చి వాటిని అమలు చేయకుండా విస్మరించి ప్రజలను మోసం, దగా చేశారని విమర్శించారు. గత డ ప్రభుత్వం లో వైయస్ జగన్ ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను మాట తప్పక మడమ తిప్పక నెరవేర్చిన నాయకుడని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా తాను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేనని చెప్పడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు రోజుకో రంగులు మారుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇసుక విధానాన్ని అమలు పరచడంలో దారుణంగా వైఫల్యం చెందారని విమర్శించారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ప్రజలతో ఉంటామని పోరాటాలు చేస్తూ ప్రజలకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుజాడల్లో అంకితభావంతో నడుస్తామని తెలిపారు. రానున్న కాలంలో తిరిగి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని, జననేత జగన్ అన్నకు నీరాజనాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల్లోకి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారని జన సునామీని మరోసారి సృష్టించబోతున్నారని తెలిపారు. ఇకనైనా ప్రజలకు మోసపు వాగ్దానాలను చెప్పి అమలుకు నోచుకోని టిడిపి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా ఉంటుందని, సువర్ణ రాజ్యం, జగనన్న రాజ్యం, రాజన్న రాజ్యం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైయస్ఆర్‌సీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి ,దేశం సుధాకర్ రెడ్డి ,రామలింగారెడ్డి, దాల్మిల్ అమీర్ , డా. శశికళ రెడ్డి, వైసీపీ కౌన్సిలర్ లు ఆరిఫ్ నాయక్, కలాం భాష, చంద్రశేఖర్ రెడ్డి, మేస చంద్రశేఖర్ , సాదిక్ భాష, బాసిద్ ,కోఆప్షన్ సభ్యులు సలాముల్ల, వార్డు వైసిపి నాయకులు లక్ష్మీనారాయణ, కిరణ్, పార్ధుడు ,సోమశేఖర్ రెడ్డి, రామచంద్రుడు, కాలువ నాగరాజు, ఎద్దు రవి, దేవ నగర్ బాషా, జాకీర్ హుస్సేన్, టీవీ రమణ, గన్ని కరీం,జలీల్, చింత శ్రీనివాసులు, సాయిరాం రెడ్డి,దండే సుధాకర్ ,కుమ్మరి రాముడు ,శంకర్ నాయక్ ,రామచంద్రుడు ఎస్సీ సెల్, కాసిం, కారు రవి, టైలర్ శివ ,ఎర్రన్న, చల్ల సత్యం, బషీర్, లాల్ బాషా, మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.