ఒంగోలు: చంద్రబాబు విజనరీ కాదని, ఆయన ఆర్గనైజ్డ్ క్రిమినల్ అని వైయస్ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అభివర్ణించారు. చంద్రబాబు ఓ స్కిల్డ్ నేరస్థుడు. ఆయన చేయని అరాచకాలు లేవని విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో షెల్ కంపెనీల ద్వారా బినామీ అకౌంట్లలోకి నిధులు మళ్లించారు. రూ. 3000 కోట్లలో.. రూ. 2700 కోట్లు ఇస్తామని సీమెన్స్ ఎప్పుడూ చెప్పలేదు. ఈస్కాంలో సుమారు రూ. 470 కోట్లు కొట్టేశారు. ఒక్క రుపాయి కూడా ముట్టలేదని సీమెన్స్ చెబుతోంది. ఈ కుంభకోణం చేసింది బాబే. దర్యాప్తు సంస్థల విచారణలో ఈ విషయం బయటపడిందన్నారు. టీడీపీ మాటలను ఎవరూ విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. టీడీపీ బంద్‌కు అసలు స్పందనే లేదన్న ఎంపీ.. బంద్ రోజు హెరిటేజ్ షాప్‌లు కూడా మూయలేదని చెప్పారు. బాబు నీతిమంతుడని ఎవరూ అనుకోవడం లేదని, అన్ని కేసుల్లో ఆయన స్టేలు తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. ఒంగోలులో మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే చంద్రబాబు నేరస్వభావం గల వ్యక్తి: గత మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం. నిన్న టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చింది...చివరికి హెరిటేజ్ సంస్థలు కూడా మూయలేదు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ సందర్భంగా ఆయన సచ్చీలుడు, మహానాయకుడు, అంతర్జాతీయ నాయకుడని నమ్మించే ప్రయత్నం ఒక మీడియా వర్గం ప్రయత్నం చేస్తోంది. దాంట్లో వాళ్లు పూర్తిగా వైఫల్యం చెందారు. చంద్రబాబు స్వతహాగా నేర స్వభావం, నేర ప్రవృతి కలిగిన వ్యక్తి. ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఆయన చేసిన నీచరాజకీయాలు, అకృత్యాలు ఆయన స్వభావాన్ని తెలుపుతాయి. నేర స్వభావాన్ని, ఆలోచనలను వెనకేసుకు వచ్చే క్రమంలో ఆయన వర్గ మీడియా ఆయన సౌమ్యుడు, ఉదారస్వభావం ఉన్న విజనరీ అనే మెసేజ్ పంపాలని ప్రయత్నం చేశారు. దానిలో వాళ్లు విఫలమయ్యారు...అది నిజం కాదు అన్నది ప్రజలు కూడా గమనించారు. డబ్బుంటేనే రాజకీయాలు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి చంద్రబాబు: సీమెన్స్ అనే సంస్థ ఒక మల్టీ నేషనల్ కంపెనీ. ఆ కంపెనీ 90 శాతం ఇస్తుందో లేదో కూడా తెలియకుండా ప్రభుత్వ వాటాగా 10శాతాన్ని విడుదల చేశారు. రూ.370 కోట్లు విడుదల చేసి తన బినామీ ఎకౌంట్లో వేసుకున్న తీరు సీఐడీ కోర్టు ముందు పెట్టింది. ఈ విషయంలో లోకేశ్ అనుచరుడు కిలారు రాజేష్ అనే వ్యక్తి కీలక భాగస్వామి. యువతకు నైపుణ్యాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించినప్రజా ధనాన్ని సొంత ఖాతాల్లో వేసుకున్నారు. రాజకీయాలు బ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు. కాదని ఎవరైనా అంటే ఎలాంటి చర్చకైనా నేను సిద్ధం. రాజకీయాలను సామాన్యులకు దూరం చేస్తూ చంద్రబాబు ఓటుకు నోటు కేసు అందరూ చూశారు. డబ్బులుంటేనే రాజకీయాలు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి చంద్రబాబు. స్వతహాగా చంద్రబాబుకి ఎటువంటి చరిష్మా లేదు. 1983 ప్రాంతంలో ఎన్టీఆర్‌తో చంద్రబాబు ఫోటోలు మీరు చూస్తే అది అర్ధం అవుతోంది. ప్రజాభిమానం లేదు..చరిష్మా లేదు...నాయకత్వ లక్షణాలు కూడా లేవు. డబ్బుతో రాజకీయాలను ముడిపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. వ్యవస్థలను సైతం బ్రష్టు పట్టించిన వ్యక్తి బాబే: చంద్రబాబు చేయని అరాచకం లేదు. చంద్రబాబు హెరిటేజ్ డెయిరీ విషయంలో.. రాష్ట్రంలోని సహకార డెయిరీలను దెబ్బకొట్టడం నుంచి హైదరాబాద్ అభివృద్ధి పేరుతో ఇన్ సైడర్ ట్రేడింగ్, జయభేరి లాంటి సంస్థల్లో ఆయన వాటాలెంతో అందరికీ తెలుసు. ఇక నేరపూరితమైన తన తెలివి తేటలతో అన్ని వ్యవస్థల్లో తన సొంత మనుషులను పెట్టుకుని వ్యవస్థలను కూడా బ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబుపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అన్నిటిలో స్టే తెచ్చుకున్నారు. నిజంగా చంద్రబాబుకు ప్రజా బలం ఉంటే స్టే తెచ్చుకోకుండా, తాను తప్పు చేయలేదని విచారణను ఎదుర్కొని ఉండాల్సింది. ఏలేరు రిజర్వాయర్ నుంచి పోలవరం భూసేకరణ, ఐఎంజీ భారత్, ఫైబర్ నెట్, స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం..ఇలా ప్రతిదీ ఒక స్కామే. అమరావతి నిర్మాణం, పోలవరం, పేదల హౌసింగ్..ఇలా ప్రతి పని వెనుక ఒక స్కామ్ ఉంది. ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పినట్లు చంద్రబాబు ఒక స్కిల్డ్ క్రిమినల్..నైపుణ్యత కలిగిన ఒక నేరస్థుడు. ఆ స్కిల్డ్ క్రిమినల్‌ను పట్టుకోవడం చాలా కష్టమని అందరికీ తెలుసు. చంద్రబాబు అరెస్ట్ లోకేశ్‌కి, ఎల్లోమీడియాకు మింగుడుపడని అంశం. బాబు నీతిమంతుడు అని ఏ ఒక్కరూ అనుకోవడం లేదు. మా నాన్న నీతిమంతుడు అని లోకేశ్ చెప్పదలచుకుంటే.. ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో స్టే వెకేట్ చేయించుకుని ఎదుర్కోవాలి. ప్రధాన సూత్రదారి చంద్రబాబేనని కేంద్ర సంస్థలు కూడా చెప్తున్నాయి: స్కిల్ కుంభకోణంలో సీమెన్స్ చెప్పిన విషయాన్ని ఒక సారి గమనించాలి. రూ.3వేల కోట్లలో రూ.2,700 కోట్లు ఇస్తామని మేం ఎవరికి చెప్పామని సీమెన్స్ ప్రతినిధి తన స్టేట్‌మెంట్‌లో ప్రశ్నించాడు. మా కంపెనీ 90 శాతం ఇస్తుందని, పది శాతం మీరు ఇవ్వండి అని ఎందుకు చెప్తాం అని ఆ కంపెనీ ప్రశ్నించింది. దీన్ని బట్టి చంద్రబాబు ఎలా రూ.370 కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఆ డబ్బు సీమెన్స్‌కి వెళ్లిందని టీడీపీ వారు చెప్తుంటే...అది మాకు రాలేదు అని సీమెన్స్ చెప్తోంది. ఈ కుంభకోణం చేసిందంతా చంద్రబాబేనని కేంద్ర సంస్థలు ఈడీ, సీఐడీలు వేరు వేరుగా చేసిన దర్యాప్తుల్లో స్పష్టంగా చెప్పాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖ కూడా ఈ విషయాన్ని బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థే కాదు..కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. అవుటర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూములు, అమరావతి భూములు, ఫైబర్ గ్రిడ్, అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణం, అసెంబ్లీ తాత్కాలిక నిర్మాణాల వంటి ప్రతి దాంట్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి చంద్రబాబు అనేది సందేహమే లేదు. ఇక్కడెవరూ నోరు విప్పడం లేదని ఇతర రాష్ట్రాల వారిని బతిమిలాడుకుంటున్నారు: బాబు అరెస్ట్ తర్వాత నోరువిప్పడానికి టీడీపీ సీనియర్ నాయకులే ముందుకు రావడం లేదు. అందుకే ఆయన ప్రతినిధులను ఇతర రాష్ట్రాలకు పంపారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్ వంటి రాష్ట్రాలకు పంపి వాళ్లతో ట్వీట్లు పెట్టించడం, లేదంటే వాళ్లని ఆహ్వానించడం చేస్తున్నారు. మీకు స్పెషల్ ఫ్లైట్లు పెడతాం.. మీరు వచ్చి మమ్మల్ని సమర్ధించండి అంటూ బతిమిలాడుకుంటున్నారు. చంద్రబాబు ఒక ఆర్గనైజ్‌డ్ క్రిమినల్‌గా మారడానికి తన నేర ప్రవృతితో రాష్ట్రాన్ని ఈ స్థాయికి దిగజార్చడానికి కారకులు చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీ. చంద్రబాబు చేసిన ప్రతి తప్పును గొప్ప విజనరీ చేసిన పనిగా ఆయన చిత్రీకరించాడు. ఆయన చేసిన పని వల్లే ఈ రోజు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపేలా చేసింది. నేరాలను ప్రోత్సహించేలా, కుట్రపూరిత ఆలోచనలను చంద్రబాబుకు సలహాలు ఇచ్చి జైలుకు పంపారు. చంద్రబాబు చేసిన అనేక నేరాల్లో ప్రధాన భాగస్వామిగా రామోజీ పాత్రను కూడా విచారణ చేయాలి. రామోజీనే ఒక మోసం..ఒక దగా..తనకు అవకాశం ఇచ్చి సహకరించిన ప్రతి ఒక్కరినీ తొక్కేస్తూ తన అవినీతి సామ్రాజ్యం నిర్మించుకున్నాడు. రామోజీ సామ్రాజ్యంలో చంద్రబాబు పాత్ర...చంద్రబాబు సామ్రాజ్యంలో రామోజీ పాత్రను విడదీయలేం. చంద్రబాబు ఎంతటి సచ్చీలుడు అని ప్రయత్నించినా అది వీలు కాదు. టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు: ఎన్ని ఊహలైనా వారు చేసుకోవచ్చు..ఊహాజనితంగా ఆరునెలల్లో అధికారంలోకి వస్తానని కలలు కనొచ్చు. వాళ్లు రారు...రాలేరు..ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. జగన్ గారే తిరిగి ముఖ్యమంత్రి అవుతారు..ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ వైఎస్సార్సీపీ. పురందేశ్వరి గారు బీజేపీలో టీడీపీ కోవర్టు అని నేను భావిస్తున్నా. ఆమెతో పాటు బీజేపీలో చాలా మంది టీడీపీ కోవర్టులున్నారు. బీజేపీ ఆధికారంలో ఉంది కాబట్టి వీరంతా అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి జనసేన బీజేపీతో ఉంది..భవిష్యత్తులో టీడీపీతో కలిసే అవకాశం ఉందని ప్రజల్లో ప్రచారం ఉంది. కాబట్టి సాధారణంగానే జనసేన అనేది టీడీపీకి సపోర్ట్ చేస్తుంది. అన్ని కేసుల్లో శిక్ష పడితే బాబు జీవితాంతం బయటకు రాలేడు: చంద్రబాబుపై విచారించదగిన కేసులు ఆరేడు ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన కనుక అరెస్ట్ అయితే బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ ఆరేడు కేసుల్లో ఆయనకు శిక్ష పడితే జీవితాంతం బయటకు రాలేడు. కేసు విచారణలో ఉన్నప్పుడు మాట్లాడటం సమంజసం కాదు. ఎవరో ఒక అధికారి ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం ఈ అరెస్ట్ జరిగిందనడం సరికాదు. అది ఒక ఎవిడెన్స్ కావచ్చు..కానీ ప్రజాధనం ఎలా షెల్ కంపెనీలకు వెళ్లింది..క్యాష్ ట్రైల్ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అరెస్ట్ జరిగింది. ఆధారాలతో సహా నిరూపించారు కాబట్టే కోర్టు సంతృప్తి చెందిన తర్వాతే చంద్రబాబును 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపారు. త్వరలో పోలీస్ రిమాండ్ వస్తుంది..దాంట్లో మరిన్ని విషయాలు బయటపడతాయి. దీంట్లో లోకేశ్ పాత్ర, కిలారు రాజేశ్ పాత్ర కూడా ఉంది. ఆధారాలు దొరికిన తర్వాత చర్యలు తీసుకుంటారు. క్షేత్ర స్థాయి నుంచి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాం: నియోజకవర్గాల ప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశం అయ్యాం. జిల్లా సమావేశం నిర్వహించాం. వీటి తర్వాత మండల, గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహిస్తాం. పార్టీకి సంబంధించిన అన్ని సమస్యలను చర్చించాం. సమన్వయలోపాలు, భిన్నాభిప్రాయాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఒంగోలు జిల్లాకు సంబంధించినంత వరకూ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు, నిర్ణయాలు జరుగుతాయి. అందరితో సమన్వయం చేసుకునే భాద్యత బాలినేనిపై ఉంది. పార్టీని క్షేత్ర స్థాయిని బలోపేతం చేస్తూ సచివాలయ కన్వీనర్లు, గృహసారధులను కూడా సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు సమాయత్తమవుతాం. జగన్ గారు అభ్యర్థుల విషయంలో తీసుకునే నిర్ణయమే శిరోధార్యం. 2019లో ఈ జిల్లాలో ఒక్క కొండెపి నియోజకవర్గాన్ని టీడీపీ గెలుచుకుంది..రాబోయే ఎన్నికల్లో కొండపితో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైయస్ఆర్‌సీపీ గెలుస్తుందని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.