చంద్రబాబు అడే డ్రామాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్‌

వైయ‌స్ఆర్ జిల్లా: చంద్రబాబు అడే డ్రామాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌ రెడ్డి మండిప‌డ్డారు.  డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పరామర్శ పేరుతో హడావిడి చేయడం, ఆఘమేఘాలపై గాలివీడు వెళ్ళి అక్కడ వైయ‌స్ఆర్‌సీపీ నేతలను విమర్శించార‌ని త‌ప్పుప‌ట్టారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ లో భాగంగా పవన్‌ పర్యటన అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ఏమ‌న్నారంటే..

  • డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ MPDO జవహర్ బాబును పరామర్శించడానికి ఆగమేఘాలపై వచ్చారు, ఎవర్ని పరామర్శించిన ఆహ్వానించదగిన పరిణామమే అయితే జరిగిన సంఘటన ఎంత తీవ్రమైంది అనేది కూడా చూడాలి
  • ఎంపీపీ కుమారుడు మండల ఆఫీసు సిబ్బంది పిలిస్తే వెళ్లారు, అక్కడ MPP ఛాంబర్ కు తాళాలు వేశారు..ఓపెన్ చేయండి అని అడిగారు, అక్కడ జరిగింది ఇది
  • ముందుగా పథకం ప్రకారం MPDO గారిపై దాడి అంటూ వందల మంది టిడిపి వారు వచ్చేసారు, టిడిపి వారు రావడంతో అక్కడే తోపులాట జరిగింది, ఈ తోపులాటలో MPDO కుర్చీ పై పడి దెబ్బ తగిలింది
  • దాన్ని డిప్యూటీ సిఎం డైవర్ట్ చేసే కార్యక్రమం చేపట్టారు, విద్యుత్ చార్జీలపై మేం చేసే పోరుబాటను డైవర్ట్ చెయ్యడానికి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు
  • చంద్రబాబు తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం పవన్ కళ్యాణ్ ను పంపుతున్నారు, గాలివీడు సంఘటనను కూడా అలాగే ఉపయోగించుకున్నారు
  • ముందుగానే ఎవరిపై కేసు పెట్టాలో కూడా నిర్ణయించుకున్నారు, MPDO కి ఏమీ కాకపోయినా ఆయన్ను రిమ్స్ కి తెచ్చి హడావుడి చేశారు
  • సింహాద్రిపురం మండలం దుద్దెకుంటలో ఒక రైతు కుటుంబం చనిపోయింది, రైతులకు మద్దతు ధర లేకపోవడం వల్ల, పంట నష్టం ఇవ్వని కారణంగా ఆ రైతు కుటుంబం ఆత్మహత్యకు ఒడిగట్టారు
  • అదే వైయ‌స్ జగన్ ఉంటే ఆ రైతు కుటుంబం చనిపోయేది కాదు
  • ప్రశ్నిస్తాను అనే పవన్ కళ్యాణ్ రైతు కష్టాలపై ఎందుకు ప్రశ్నించరు...?ఇంత దూరం వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ రైతు కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు..?
  • చంద్రబాబు అడే డ్రామాలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారు
  • పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు వద్దకు ఎందుకు వెళ్ళడం లేదు...? ఉక్కు ఉద్యోగుల తరఫున పవన్ ప్రశ్నించవచ్చుగా..?
  • విద్యుత్ చార్జీలు పెంచను అని హామీ ఇచ్చి పెంచుతుంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నించవచ్చుగా..?
  • ప్రశ్నించే గొంతు మూగబోయిందా..? మీరు అధికారంలో ఉన్నా జగన్ ను మాత్రమే ప్రశ్నిస్తావా..?
  • పిఠాపురంలో జాన్ అనే జనసేన నాయకుడు ఓ మైనర్ బాలికను రేప్ చేస్తే ఎందుకు పరామర్షించలేదు..?
  • మీ ఎమ్మెల్యే నానాజీ ఒక సీనియర్ మెడికల్‌ ప్రొఫెసర్ పై దాడి చేస్తే నువ్వు ఎందుకు కట్టడి చేయలేదు..?
  • కానీ డైవర్ట్ చెయ్యడానికి గాలివీడు వచ్చి చంద్రబాబు చెప్పినట్లు నటిస్తున్నాడు
  • కమలాపురంలో అక్రమ ఇసుకను అడ్డుకున్నందుకు ఒక vro ను బీరు బాటిల్ తో టిడిపి నేత తలపగలగొడితే నువ్వెందుకు పరామర్శించలేదు..?
  • మీ నాటకాలన్నీ ప్రజలు చూస్తున్నారు..ప్రజలే బుద్ధి చెప్తారు.
     
Back to Top