సచివాలయం: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ప్రివిలైజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. తమ హక్కులకు భంగం కలిగించేలా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహరించారని గతంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు స్పీకర్ తమ్మినేనికి ఫిర్యాదు చేశారు. మంత్రుల ఫిర్యాదును స్పీకర్ తమ్మినేని ప్రివిలైజ్ కమిటీకి పంపించారు. పలుమార్లు సమావేశమైన సభా హక్కుల కమిటీ.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు నోటీసులు అందించింది. విచారణకు అందుబాటులో ఉండాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు నోటీసులు అందించింది.