నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలోని ముతుకూరులో జరిగిన సామాజిక సాధికార బహిరంగ సభ విజయవంతమైంది. బస్సు యాత్ర ర్యాలీగా సాగింది. జనం భారీగా ర్యాలీవెంట నడిచారు. సాయంత్రం బహిరంగసభకు నియోజవర్గంలోని అన్ని మండలాల నుంచి అశేషంగా జనవాహిని వచ్చింది. సభ అసాంతం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. సభ చివరి వరకు ఉత్సాహంగా కనిపించారు ప్రజలు. స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీలు గురుమూర్తి, బీదమస్తాన్‌రావు మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి – 76ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు పెద్దపీట వేసిన చారిత్రక సందర్భం ఆదర్శప్రదేశ్‌లోనే చూస్తున్నాం. –మాట తప్పని..మడమ తిప్పని జగన్‌మోహన్‌రెడ్డిలాంటి నాయకుడు చాలా చాలా అరుదు. – ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల వారిని ఇంతగా గౌరవించి, సముచిత స్థానాల్లో కూర్చోపెట్టిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప దార్శనికత ఉన్న నాయకుడు – ఎస్సీ,ఎస్టీలను చులకనగా చూసినవాడు చంద్రబాబు. ముఖ్యమంత్రి స్థాయిని మరిచి నీచంగా మాట్లాడినవాడు చంద్రబాబు. – ఎస్సీలకు, ఎస్టీలకు చదువులెందుకు? పదవులెందుకు?కూలీపనులు చేసుకుని బతకండి అన్న నాయకులు టీడీపీలో చాలామంది ఉన్నారు. అందరూ ఈరోజు ఈ ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల ప్రభంజనంలో కొట్టుకుపోయారు – జగనన్నకు జైకొట్టిన బడుగు,బలహీనవర్గాలకు, పేదలకు ఇప్పటిదాకా ఎంతో మంచి జరిగింది. మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిగా వస్తే..ఆయా వర్గాలకు, పేదలకు మరింత మంచి జరిగితీరుతుంది. జగనన్న మన గురించే ఆలోచిస్తారు. మన బాగు గురించే ఆలోచిస్తారు. ఎంపీ గురుమూర్తి – ఇంతకు ముందు పరిపాలించిన నాయకులు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలను ఓటుబ్యాంకుగానే చూశారు. – సీఎం అయ్యాక బడుగు,బలహీనవర్గాలను తన కుటుంబసభ్యుల్లా చూసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్ – ఎస్టీ,ఎస్సీ,బీసీ,మైనార్టీ వర్గాలను తన గుండెల్లో పెట్టుకుని...మన కోసం...మన మంచి కోసం ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చారు. మన ఇంటి గడప దగ్గరకే పథకాలు అందిస్తున్నారు. – విద్యావ్యవస్థలో విప్లవాత్మకమార్పులు తీసుకొచ్చి, మన పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేశారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి – వైద్యరంగంలోనూ పేదలకు గొప్ప అండగా ఉండేలా ఆరోగ్యశ్రీ స్థాయిని పెంచారు. రూ.25లక్షల వరకు వైద్య సేవలు అందేలా చేశారు. ఎంపీ బీదమస్తాన్‌రావు – ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు జగనన్న ఎంతో సామాజిక న్యాయం చేశారు జగనన్న –రాజకీయాల్లో ఆయావర్గాలకు పెద్దపీట వేశారు జగనన్న – తన కేబినెట్‌లోని 25మంది మంత్రుల్లో 17మంది బడుగు,బలహీన వర్గాల వారే ఉండటం..జగనన్న వల్లే సాధ్యమైంది. – రాజ్యసభలో సైతం ఐదుగురిని సభ్యులుగా కూర్చోబెట్టిన దార్శనికుడు జగనన్న – కులగణన కోసం కమిషన్ ఏర్పాటు చేశారు జగనన్న. – నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో 50శాతం బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు వాటా కల్పించిన ముఖ్యమంత్రి జగనన్న. – సంక్షేమపథకాల అమలులో ఎలాంటి వివక్ష లేకుండా, లంచాలకు చోటు లేకుండా, పార్టీలకతీతంగా, కులమతాల కతీతంగా అందించడమన్నది జగనన్న పాలనలోనే చూస్తున్నాం. – సామాజిక సాధికారత కల్పించడంలో..సామాజిక న్యాయం చేయడంలో జగనన్నకు జగనన్నే సాటే. – మహిళలకు ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. – మత్స్యకారుల కోసం హార్బర్లు ఏర్పాటు చేస్తూ, వారి స్థితిగతులను మార్చాలని చిత్తశుద్దితో కృషి చేస్తున్నారు జగనన్న.