ఆ భూముల్లో ఒక్క సెంటు కూడా సజ్జల రామ‌కృష్ణారెడ్డిది కాదు

వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డమే లక్ష్యంగా ఎల్లోమీడియా త‌ప్పుడు క‌థ‌నాలు
 

వైయ‌స్ఆర్ జిల్లా: కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌పై త‌ప్పుడు ప్ర‌చారం, అక్ర‌మ కేసులు అధిక‌మ‌య్యాయి. హామీల అమ‌లును మ‌ర‌చిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కు తెర లేపింది. ఇందులో భాగంగా తాజాగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి భూ క‌బ్జా అంశాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చింది. అసలు ఈ ఆరోపణలకు ఆస్కారమే లేదు. ఎల్లోమీడియా చెప్తున్నట్టుగా కడప సమీపంలోని మామిడి తోటల్లో ఒక్క సెంటు భూమి కూడా వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్‌ సజ్జల రామకృష్షారెడ్డికి లేదు. ఇందులో కబ్జా అన్న ప్రశ్నే తలెత్త‌దు. 
 
చంద్ర‌బాబు హ‌యాంలోనే ఆ భూములు కొనుగోలు:

1995 ప్రాంతంలోనే అంటే చంద్రబాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మయంలోనే క‌డ‌ప స‌మీపంలో పనికిరాని భూములను సజ్జల రామ‌కృష్ణారెడ్డి సోదరులు కొనుగోలుచేశారు. వాటిని సాగులోకి తెచ్చి మామిడితోటలు వేశారు.  2005వ సంవ‌త్స‌రంలో అంటే దాదాపు పదేళ్ల తర్వాత సజ్జల రామకృష్షారెడ్డి తన వాటా భూములను ఆయ‌న సోదరులకు విడిచిపెట్టారు. అప్పటినుంచీ ఆ భూములతో ఆయనకు సంబంధం లేదు. ఇది జరిగినప్పుడు ఆయన రాజకీయాల్లోకూడా లేరు.

రెవెన్యూ, ఫారెస్టు శాఖ‌ల మ‌ధ్య వివాదం

2014లో ఫారెస్ట్‌, రెవిన్యూ విభాగాల మధ్య ఈ ప్రాంతంలో మొత్తం భూముల విషయమై వివాదం నెలకొంది. ఫారెస్ట్‌ కిందకు వస్తుందని అటవీశాఖ, ఆ ప్రసక్తే లేదని రెవెన్యూ శాఖలు తలోరకంగా చెప్తున్నాయి. ఇరుశాఖలకు మొత్తం రికార్డులు కూడా సజ్జల సోదరులు అప్పగించారు. సంయుక్తంగా సర్వే చేసి ఏదో విషయం తేల్చాలని సజ్జల సోదరులే పలుమార్లు అర్జీలు పెట్టుకున్నారు.  రాజ‌కీయంగా దెబ్బ‌తీసేందుకు, సజ్జలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డమే లక్ష్యంగా ఎల్లోమీడియా తాజాగా భూక‌బ్జా అంటూ కొత్త రాగం అందుకుంది.  తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై సజ్జల రామ‌కృష్ణారెడ్డి న్యాయపరమైన చర్యలకు  సిద్ధ‌మ‌వుతున్నారు. 

Back to Top