సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన స్కోచ్ గ్రూప్ చైర్మ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో స్కోచ్‌ గ్రూప్ చైర్మన్‌ సమీర్‌ కొచ్చర్ భేటీ అయ్యారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన అనంత‌రం తను రాసిన ఇండియా 2047 హై ఇన్‌కమ్‌ విత్‌ ఈక్విటీ పుస్తకాన్ని స‌మీర్ కొచ్చ‌ర్‌ సీఎంకి బహుకరించారు. ఈ సంద‌ర్భంగా స్కోచ్ గ్రూప్ చైర్మ‌న్ సమీర్‌ కొచ్చర్‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌న్మానించారు. ఈ సమావేశంలో సమీర్‌ కొచ్చర్‌తో పాటు స్కోచ్‌ గ్రూప్‌ వైస్ చైర్మన్‌ డాక్టర్‌ గురుశరణ్‌ ధంజల్, డైరెక్టర్‌ రోహణ్‌ కొచ్చర్ పాల్గొన్నారు. 

Back to Top