అమరావతి: ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇసుక అధిక ధరలకు అమ్మినా, అక్రమ రవాణా చేసినా ఫిర్యాదుల కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇసుక అక్రమ రవాణాపై కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 14500కి ఫోన్ చేసి ఫిర్యాదులు అందించవచ్చన్నారు. అదేవిధంగా కాల్ సెంటర్ ఉద్యోగులతో సీఎం వైయస్ జగన్ మాట్లాడి పలు సూచనలు చేశారు. అధిక ధరలకు అమ్మినా, అక్రమ రవాణా చేసినా ఫిర్యాదులు చేయొచ్చన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక స్టాక్ పాయింట్ ద్వారా రోజుకు 2 లక్షల టన్నుల ఇసుకను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అక్రమ రవాణా నియంత్రణకు ఇసుక ధరలకు మించి అమ్మితే రెండేళ్ల జైలుశిక్ష. రూ. 2 లక్షల జరిమానా విధించేందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. Read Also: బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించండి