అంద‌రి మొహల్లో సంతోషం చూసే మంచి కార్యక్రమం

 

తిరుపతిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్ 
 
తిరుపతి నగరంలోని ఆకాశవీధి– శ్రీనివాస సేతు ప్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం

టీటీడీ – శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాల నూతన వసతిగృహ సముదాయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

అంద‌రి మొహల్లో సంతోషం చూసే మంచి కార్యక్రమం

తిరుమల తిరుపతి దేవస్ధానం ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం  వైయస్‌.జగన్‌

 తిరుప‌తి: 2019లో అప్పట్లో కేవలం ఎన్నికల నిమిత్తం టెంకాయ కొట్టి.. జీవో ఇచ్చేసిన పరిస్థితి నుంచి.. ఈ నాలుగు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టును చెయ్యి పట్టుకుని నడిపించామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఆ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించి.. తిరుపతి ప్రజలకు అంకితమిస్తున్నా.  దాదాపు 650 కోట్ల ప్రాజెక్టు.. ఏడు కిలోమీటర్ల పొడవునా.. తిరుపతి ప్రజలకు ప్రత్యేకించి గుడికి పోయే భక్తులకు మరి ఎక్కువగా ఉపయోగపడుతుంది. దాదాపుగా రూ.600 కోట్లతో సుమారు 7వేల మంది టీడీపీ ఉద్యోగులు అందరికీ ఇళ్ల పట్టాలిచ్చి.. వాళ్లందరి మొహల్లో సంతోషం చూసే మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఇది అన్నింటికన్నా సంతోషాన్నిచ్చే విషయమ‌న్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం  వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే..: 

దేవుడి దయతో ఈ రోజు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం.  శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు సంబంధించి మీ అందరికీ తెలుసు.. 2019లో అప్పట్లో ఎన్నికల నిమిత్తం టెంకాయ కొట్టి, జీవో ఇచ్చి వదిలేసిన పరిస్థితుల నుంచి ఈ నాలుగేళ్లలో ఆ ప్రాజెక్టును చేయిపట్టుకుని నడిపించి.. దాన్ని పూర్తిచేసి ఇవాళ తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నాం. దాదాపు రూ.650 కోట్ల వ్యయంతో నిర్మించిన 7 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు వల్ల భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది. శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీ హాస్టల్స్‌కు సంబంధించి రూ.37.80 కోట్ల వ్యయంతో నూతన భవనాలు నిర్మించి ఇవాళ వాటిని కూడా ప్రారంభించుకుంటున్నాం. దీనివల్ల అక్కడున్న పిల్లలకు మరింత మెరుగైన వసతి అందుబాటులోకి రానుంది. అదేవిధంగా తిరుమలలో డోనర్స్‌తో  రూ.7 కోట్లతో వకుళమాత నిలయం, రూ.11.50 కోట్లతో రచన విశ్రాంతి గృహాలను కట్టించి వాటిని కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసి తిరుమల తిరుపతి దేవస్ధానానికి ఇస్తున్నాం. 

మరీ ముఖ్యంగా అన్నింటికన్నా సంతోషించే విషయం.. టీటీడీలో పనిచేస్తున్న దాదాపు 6,700 మంది ఉద్యోగులకు కచ్చితంగా ఇళ్ల స్ధలాలు ఉండాలి, వారికి మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో వేగంగా అడుగులు వేశాం. అందులో భాగంగా రూ.313 కోట్లను ఖర్చు చేసి 3,518 మందికి ఇవాళ ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తున్నాం. మరో రూ.280 కోట్లు ఖర్చు చేసి ఇంకో 3,500 మందికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. నెల నుంచి 45 రోజుల్లోగా ఇది కూడా పూర్తి చేస్తామని కలెక్టర్‌ చెప్పారు.  దాదాపుగా రూ.600 కోట్లతో సుమారు 7వేల మంది టీడీపీ ఉద్యోగులు అందరికీ ఇళ్ల పట్టాలిచ్చి.. వాళ్లందరి మొహల్లో సంతోషం చూసే మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఇది అన్నింటికన్నా సంతోషాన్నిచ్చే విషయం. 

తిరుపతిలో దాదాపు 8,050 మంది... ఇళ్లుకట్టుకుని  22– ఏలో ఇరుక్కొని ఉన్న వారి ఇళ్లు అమ్మాలనుకున్నా... తమ పిల్లలకు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటూ..కొద్ది రోజుల క్రిందటనే.. వరదలకు నేను వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యను పరిష్కరించి...  తిరుపతి ప్రజలకు మంచి చేసూ 22–ఏలోనుంచి వారందరినీ డిలీట్‌ చేయించాం. తిరుపతిలో 8,050 మందికి ఇళ్లపట్టాలిచ్చాం. 2,500 మందికి చంద్రగిరిలో కూడా 22–ఏ నుంచి డిలీట్‌ చేసి వారికి కూడా ఉపశమనం కలిగించాం. ఇవన్నీ దేవుడి దయతో నాలుగేళ్లలో ప్రజలకు మంచి జరగాలని తపన, తాపత్రయంతో అడుగులు వేశాం. వీటన్నింటి వల్లా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. దాదాపు రూ.1300 కోట్లకు సంబంధించిన పలు కార్యక్రమాలను ప్రారంభించుకుంటున్నాం. మీ అందరికీ మరింత మంచిచేసే అవకాశం ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని.. సీఎం తన ప్రసంగం ముగించారు.
 

Back to Top