పవర్‌ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు బాబూ|

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌ 
 

తాడేప‌ల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉండగా బీసీల అభివృద్ధిని మరచిన బాబు ప్రతిపక్షంలో కూర్చుని వారిని ఉద్ధరిస్తానని బీరాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో.. ‘అధికారంతో విర్రవీగిన రోజుల్లో అంతు చూస్తా, తోక కోస్తా అని బీసీలను.. చంద్రబాబు ఈసడించిన వీడియోలు సోషల్‌మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. పవర్‌ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు చంద్రబాబు. విస్తరిలో వడ్డించేటప్పుడే ఆకలి మంటను గుర్తించాలి, వాటిని ఎత్తేసేటప్పుడు కాదు’అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.

Back to Top