పద్మ అవార్డు గ్రహీతలకు వైయ‌స్ జగన్ శుభాకాంక్షలు

తాడేపల్లి : పద్మ అవార్డు గ్రహీతలకు వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి.. భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్ష‌లు’ అని వైయ‌స్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు  నాగేశ్వరరెడ్డి
 
ప్రఖ్యాత వైద్యులు డా.నాగేశ్వర్‌రెడ్డికి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించటంపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ఆయన చేసిన పరిశోధనలు వైద్యరంగంలో గొప్పగా నిలిచిపోతాయి. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు  నాగేశ్వరరెడ్డి. రోగులకు ఆత్మీయత పంచడమేకాదు, వారు తిరిగి కోలుకునేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే గొప్ప మనసు ఆయనది. 

కొత్త కొత్త వ్యాధులకు చికిత్స అందించడంలో నాగేశ్వర్‌రెడ్డి సేవలు విశేషమైనవి. అత్యాధునిక వైద్య పద్ధతులు,చికిత్సా విధానాలను తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా విస్తరించడంలో ఆయనది కీలక పాత్ర. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిని దేశం గొప్పగా గౌరవించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం’ వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు.

విఖ్యాత వైద్యులు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డిగారికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ ప్రకటించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చేసిన పరిశోధనలు వైద్యరంగంలో గొప్పగా నిలిచిపోతాయి. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు ఆయన. రోగులకు ఆత్మీయత పంచడమేకాదు, వారు తిరిగి…

కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు వారైన  గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్‌ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్‌ దక్కడంపై ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. 

   

Back to Top