తాడేపల్లి: హృద్రోగ సంబంధ సమస్యతో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఆయనతో ఫోన్‌లో మాట్లాడిన వైయస్ జగన్, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ అన్నిరకాలుగా అండగా ఉంటుందన్నారు. మనోహర్‌రెడ్డి తాడేపల్లిలో ఉన్న మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి అవుతారని వైద్యులు వెల్లడించారు.