బెంగళూరు: శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి వివాహానికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. బెంగళూరు మారియట్ హోటల్ లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు పవిత్ర రెడ్డి , డాక్టర్ కౌశిక్ రెడ్డిలకు వైయస్ జగన్, వైయస్ భారతి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.