బాబుది విజ‌న్ కాదు..420

 

మేనిఫెస్టోను ఎగ్గొట్టే ప్రణాళికది

విజన్‌ పేరుతో రంగురంగుల కథలు 

వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

ఏడు నెలల క్రితం హామీలకే దిక్కు లేదు

బాబు విజన్‌ చూస్తే ఆశ్చర్యమేస్తుంది

విజన్‌ అంటే మనిషి అభివృద్ధికి బాట 

ఓ పిల్లాడి 20 ఏళ్ల భవిష్యత్తుకు వేసే అడుగులే విజన్‌ 

ఆ విజన్‌కు మన ప్రభుత్వం గతంలోనే బాటలు వేసింది.

ప్రభుత్వ బడులను ప్రైవేటుకు థీటుగా మార్చాం.

అదీ వైయ‌స్ఆర్‌సీపీ విజన్‌

వైయస్‌ జగన్‌ వెల్లడి

హార్వర్డ్, ఎంఐటీ వంటి అత్యుత్తుమ సంస్థలు

వాటి భాగస్వామ్యం ఇక్కడ తీసుకున్నాం

ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ తెచ్చాం

ఇదీ ఉన్నత విద్యలో మన విజన్‌ 

వైద్యంలోనూ సమూల మార్పులు

గ్రామస్ధాయిలో ప్రివెంటివ్‌ కేర్‌ తెచ్చాం.

రైతుల కోసం గొప్ప సంస్కరణలు

ఆర్బీకేలతో రైతులకు చేయూత

ఇదీ సాగులో మన విజన్‌

గుర్తు చేసిన వైయస్‌ జగన్‌

పోరు బాటకు సిద్ధం కావాలి.

వైయ‌స్ఆర్‌సీపీ జెండా రెపరెపలాడాలి

ప్రతికార్యకర్త సోషల్‌ మీడియా సైనికుడు కావాలి

పార్టీ శ్రేణులకు జగన్‌ దిశా నిర్దేశం.

చంద్రబాబువి అబద్దాలు, మోసాలు.

ఆరునెలలకే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత.

మనం ప్రతి ఇంటికి మంచి చేశాం.

టీడీపీ ఇంట్లో ప్రతి ఒక్కరికీ హామీలిచ్చారు.

కూటమి ప్రభుత్వ మోసాలపై జగన్‌ ఆగ్రహం

ఆదాయం తగ్గినా మనం కోవిడ్‌లో హామీలు విస్మరించలేదు

మేనిఫెస్టోలో హామీలన్నీ అమలు చేశాం.

బడ్జెట్‌లో క్యాలెండర్‌ ఇచ్చి మరీ అక్కచెల్లెమ్మలకు లబ్ది చేశాం.

దేశంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం మాత్రమే ఇలా చేసింది.

పది శాతం ప్రజలను చంద్రబాబు నమ్మించాడు.

మనం గొప్ప పాలన అందించాం.

మనలాగే చంద్రబాబు చేస్తాడనని ఆశ పడ్డారు.

చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమే.

తేల్చి చెప్పిన  వైయస్‌ జగన్‌

ఆరు నెలల్లో బాబు మాటలు మోసాలయ్యాయి.

మన పథకాలు నిలిచిపోయాయి.

సూపర్‌ సిక్స్‌ హామీలు అటెకెక్కాయి.

ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.

రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది.

స్కామ్‌ల మీద స్కామ్‌లు జరుగుతున్నాయి.

ఎక్కడ చూసినా లిక్కర్, శాాండ్‌ మాఫియానే.

ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు.

సీఎం సహా, నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు.

వాస్తవాలు తేటతెల్లం చేసిన వైయ‌స్ జగన్‌

మనం ప్రజల తరపున పోరాడాల్సిన సమయమిది.

నాయకుడు ప్రజల సమస్యలపై పోరాటం చేయాలి.

ప్రజలు, రైతులు, విద్యార్ధులు అందరూ ఇబ్బంది పడుతున్నారు.

కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. 

ప్రతిపక్షంలో కష్టాలు, కేసులు సహజం

మనకూ మంచి టైం వస్తుంది.

నన్నే 16 నెలలు జైల్లో పెట్టారు.

ప్రజల అండతో ముఖ్యమంత్రిగా వచ్చాను.

ఎవరూ భయపడొద్దు.

వైయ‌స్ఆర్‌సీపీ, వైయ‌స్ జగన్‌ మీకు అండగా ఉంటారు.

సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు వైయ‌స్ జగన్‌ భరోసా 

తాడేపల్లి: ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. రాష్ట్రంలో కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతున్నాయి. చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు.. ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా.. ఇలా మాఫియాలు చేస్తున్నారన్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇలాంటి సమయంలోనే మనం గొంతు విప్పాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశమని వైయ‌స్‌ జగన్ ఉద్ఘాటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్‌ జగన్‌ భేటీ అయ్యారు. 

చంద్రబాబువి అబద్దాలు. మోసాలు:
    ఆరు నెలలకే  చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద తీవ్ర స్ధాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదు. 
    ఎన్నికల్లో మనం ప్రచారం చేసినప్పుడు, మన పార్టీ తరపున మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు నేను చెప్పిన మాటలు అందరికీ తెలుసు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీలు, మోసాలు గురించి నా దగ్గరకు వచ్చిన పార్టీ నాయకులు చాలా మంది చెప్పారు. మనం కుటుంబానికి అంతటికీ మంచి చేశాం. కానీ చంద్రబాబు మోసాలు, అబద్దాలు తీవ్రస్ధాయిలో ఉన్నాయి. ప్రతి ఇంటికి మనం మంచి చేస్తే.. ఆయన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి చేస్తానని హామీ ఇచ్చాడు. 

కోవిడ్‌ తో ఆదాయం తగ్గినా హామీల అమల్లో తగ్గలేదు:
    అబద్దాలు చెప్పడం, మోసం చేయడం ధర్మం కాదనేది నా నమ్మకం. మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని నాతో అన్నారు. ఆరోజు మనం మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఇవి మనం చేస్తున్న పథకాలు.. ఐదేళ్ల మన పాలనలో చరిత్రలో ఎప్పుడూ జరగని మార్పులు మన ప్రభుత్వంలో చేశాం. రాష్ట్ర చరిత్రలో మేనిఫెస్టోలో ఎన్నికలప్పుడు మాట ఇచ్చి.. ఎన్నికలు అయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయకుండా ఆ మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ లా భావించి అమలు చేశాం.
    చివరకు కోవిడ్‌ లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయాలు తగ్గినా, మనం సాకులు వెతుక్కోలేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం బడ్జెట్‌తో పాటు. సంక్షేమ క్యాలెండర్‌ కూడా ఇచ్చి ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి.. బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక్క వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే చేసి చూపింది. అంత గొప్పగా ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నాం.

పదిశాతం ప్రజలను చంద్రబాబు నమ్మించాడు
    మనమంతా ఎమ్మెల్యేల తరపున ప్రచారానికి వెళ్లినప్పుడు మనల్ని ఆప్యాయతతో ప్రజలు ఆదరించారు. మన మీద వ్యతిరేకత లేదు. కానీ పది శాతం మంది చంద్రబాబు మాటలను నమ్మారు. దానికి కారణం కూడా మనమే. అంత గొప్ప పాలన మనం అందించగలిగాం కాబట్టే.. చంద్రబాబు మభ్యపెట్టగలిగాడు, ప్రజలను ఆశపెట్టగలిగాడు. జగన్‌ చేసి చూపించాడు కాబట్టి  చంద్రబాబు కూడా చేసి చూపిస్తాడేమో అని ఆశపడ్డారు. 

చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమే:
    చంద్రబాబు ఆయన పార్టీ అభ్యర్ధులు ఏ ఇంటికి వెళ్లినా ఇంట్లో ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. ఒక మనిషి ఈ స్ధాయిలో మోసం చేయగలుగుతాడా అన్నంత గొప్ప మోసం చేశారు. ఏ ఇంటికి వెళ్లినా చిన్నపిల్లలతో సహా నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని వారి తల్లులైతే నీకు రూ.18 వేలు, ఆ అమ్మలకు తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన పిల్లవాడు ఇంట్లో కనిపిస్తే రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని ఇంట్లో ఎవరినీ వదిలిపెట్టకుండా ఆశపెట్టారు.
ఇవాళ ఆరు నెలల గడవకముందే చంద్రబాబు చెప్పిన మాటలు మోసాలై కంటికి కనిపిస్తున్నాయి.
    ఆరోజు నేను ఎన్నికల్లో చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని. చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తలపెట్టడమే అని.. ఇవాళ ఆరు నెలల తిరక్క ముందే అదే కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకటే మాట వినిపిస్తోంది. జగన్‌ పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. పలావు, బిర్యానీ రెండూ పోయాయి. ఏమీ లేకుండా చంద్రబాబు రోడ్డు మీద నిలబెట్టాడు అన్న చర్చ నడుస్తోంది.
    ఒకవైపు మనం ఇస్తున్న పథకాలు పూర్తిగా నిలిపివేశాడు. మరోవైపు ఆయన ఇస్తానన్న సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ గాలికెగిరిపోయాయి.  మరోవైపు చంద్రబాబు బాడుదే బాదుడు మొదలైంది. ముట్టుకుంటే కరెంటు బిల్లలు షాక్‌ కొడుతున్నాయి. ఆరు నెలల తిర్కక మునుపే రూ.15 వేల కోట్లు కరెంటు బిల్లలు షాకుల రూపంలో వేయగలిగిన దుర్మార్గుడు చంద్రబాబు మాత్రమే. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అమలు చేయలేదు సరికదా, వీటన్నింటికీ తోడు చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే.. ఆ ప్రశ్నించే స్వరాన్ని అణగ దొక్కుతూ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం గ్రామస్థాయి నుంచి అమలవుతోంది.
    ఇన్ని విపరీతమైన పరిస్థితుల మధ్య స్కామ్‌ల మీద స్కామ్‌లు జరుగుతున్నాయి. లిక్కర్, శాండ్‌ మాఫియాతో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు. ఇవన్నీ కాకుండా ఏ నియోజకవర్గంలోనైనా ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా, మైనింగ్‌ చేయాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి డబ్బులివ్వాల్సిందే. ప్రతి విషయంలోనూ నాకింత.. నీకింత అని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పంచుకుంటున్న పరిస్థితులు. 

ప్రజల తరపున పోరాడాల్సిన సమయమిది:
    ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమబాట పట్టడానికి మనం ఇవాళ కలిసి అడుగులు వేస్తున్నాం. ఏ నాయకుడైనా ప్రజల తరపున స్పందించ గలగాలి. వారి సమస్యలపై పోరాటం చేయాలి. దీనిపై పార్టీ నాయకత్వాన్ని చైతన్యం చేస్తున్నాం. అప్పుడే ప్రజల్లో అటువైపు అధికార పార్టీ మీద పెరుగుతున్న వ్యతిరేకత మనకు సానుకూలంగా మారుతుంది. ఆరు నెలలకే మనం పోరాటం చేయాల్సిన పరిస్ధితి వచ్చింది. చంద్రబాబు పాలన అలా నడుస్తోంది.
    ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్న విషయం మన కళ్లెదుటే కనిపిస్తోంది. రైతులకు గతంలో పెట్టుబడి సహాయం రైతు భరోసా కింద ఇచ్చిన రూ.13,500 గాలికెగిరిపోయింది. రూ.20 వేలు ఇస్తానన్న పెట్టుబడి సాయం కూడా మోసమని తేలిపోయిన పరిస్ధితుల్లో రైతు సాగు చేస్తున్నాడు. రైతులకు ఉచిత పంటల బీమా దక్కే పరిస్థితి పోయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఇ–క్రాపింగ్‌ ఎక్కడా కనిపించడం లేదు. గతంలో మనం ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్ధ లేకుండా ప్రతి రైతుకు కనీస మద్ధతు ధర వచ్చేటట్టుగా ధాన్యం కొనుగోలు చేసి.. వెంటనే పైకం చెల్లించేలా అక్కడే ‘ఫండ్‌ ట్రాన్సఫర్‌ ఆర్డర్‌’ (ఎఫ్‌టీఓ) కూడా ఇచ్చి, మనం తోడుగా ఉంటే.. ఇవాళ అదే రైతులకు కనీస మద్ధతు ధర రాకపోగా, అంత కంటే రూ.300 నుంచి రూ.400 వరకు తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్ధితి వచ్చింది. అందుకే వారికి మద్ధతుగా ఆందోళన కార్యక్రమం చేశాం.

షాక్‌ కొడుతున్న కరెంటు బిల్లులు:
    పట్టుకుంటే షాక్‌ కొట్టేలా ఉన్న విద్యుత్‌ బిల్లుల మీద ఈనెల 27న ఆందోళనకు పిలుపునిచ్చాం. ఇప్పటి వరకు 6 నెలల వరకు రూ.6 వేల కోట్ల బాడుదు మాత్రమే. రేపటి నెలలో మరో రూ.9 వేల కోట్ల బాదుడు ఉండబోతుంది. ఇలాంటి పరిస్థితులలో మహిళలు నిరసన తెలుపుతూ బిల్లులు కాల్చుతున్న పరిస్ధితి. ఈ దఫా కరెంటు బిల్లుల పెరుగుదలకు నిరసనగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో చేయబోతున్నాం.

ఫీజులు రాని పిల్లలకు అండగా..:
    మన ప్రభుత్వ హయాంలో ప్రతి 3 నెలలకొకసారి, త్రైమాసికం అయిన వెంటనే పిల్లల తల్లులకు డబ్బులిచ్చి వారి చదువులుకు తోడుగా ఉండేవాళ్లం. ఈరోజు పిల్లలుకు విద్యాదీవెన, వసతి దీవెన రాక ఇబ్బంది పడుతున్నారు. మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏప్రిల్‌లో వెరిఫై చేసి మే నెలలో ఇచ్చే వాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు త్రైమాసికాలు గడిచిపోయాయి. 
    ఇంకా ఏఫ్రిల్‌లో వసతి దీవెన కింద డబ్బులిచ్చే వాళ్లం. ఇప్పుడు అది కూడా ఎగిరిపోయింది. మొత్తంగా ఫీజులకు సంబంధించి నాలుగు దఫాలు విద్యాదీవెన రూ.2,800 కోట్లు, వసతి దీవెన రూ.1100 కోట్లు మొత్తం రూ.3,900 కోట్లు పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల.. పిల్లలు డబ్బులు కట్టలేక చదువులు మానివేస్తున్నారు. పనులకు వెళ్తున్నారు. ఈ పిల్లలకు అండగా వారికి తోడుగా ఉండే కార్యక్రమం జిల్లా యూనిట్‌గా జనవరి 3న చేయబోతున్నాం.

మనకూ కచ్చితంగా టైమ్‌ వస్తుంది:
    ప్రతిపక్షంలో కష్టాలు, కేసులు సహజం. మనకూ తప్పనిసరిగా టైమ్‌ వస్తుంది. ప్రజలకు తోడుగా, ప్రజల తరపున వారికి అండగా గొంతు విప్పాల్సిన తరుణమిది. అప్పుడే మనం నాయకులుగా ఎదుగుతాం. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఉంటాయి. కేసులు ఉంటాయి. జైల్లో కూడా పెడతారు. నేను మీ అందరికీ చెబుతున్నాను. కష్టాలు ఎల్లకాలం ఉండవు. కష్టం తర్వాత సుఖం ఉంటుంది. ఏ కష్టం ఎవరికి వచ్చినా నా వైపు చూడండి. నన్ను 16 నెలలు పెట్టారు. ప్రతిపక్షం ఉండదు. అడిగే వాడు ఉండడని నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు.
    అప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. కాంగ్రెస్, టీడీపీ కలిసి నామీద కేసులు పెట్టారు. ఏమైంది మరలా ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి అయ్యాను. పగలు తర్వాత రాత్రి వస్తుంది. మరలా మన టైం వస్తుంది. జమిలి వస్తుందంటున్నారు. దేనికైనా మనం సిద్ధమే. ఎవ్వరూ, ఎక్కడా భయపడొద్దు. దేన్నైనా ఢీకొందాం. మీ అందరికీ జగన్మోహన్‌రెడ్డి, పార్టీ అండగా ఉంటుంది. 

సాగునీటి సంఘాల ఎన్నికలు అప్రజాస్వామికం:
    ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను అపహాస్యం చేశారు. ఎన్నికలను ఏకపక్షం చేశారు. గ్రామస్ధాయిలో ఇవ్వాల్సిన నో డ్యూస్‌ సర్టిఫికెట్లు, ప్రతిపక్షానికి, సాధారణ రైతులకు ఇవ్వకుండా మీ పార్టీ వారికే ఇచ్చుకుని పోలీసుల సాయంతో ఏకపక్షంగా బుల్డోజ్‌ చేసి ఎన్నికలు జరిపించుకున్నారు. అలాంటప్పుడు ఎన్నికలు జరపడం ఎందుకు.

రాజీనామాలు చేసి రండి:
    బుల్డోజ్‌ చేసి ఎన్నికలు జరిపి.. రైతులు సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు. రైతులు సంతోషంగా ఉన్నారని మీకు అనిపిస్తే రాజీనామా చేసి బయటకు రండి. అప్పుడు పెట్టుబడి సాయం కోసం అడుగుతున్న రైతులు మీకు గుర్తుకు వస్తారు. ఉచిత బీమా కోసం అడుగుతున్న రైతులు గుర్తుకు వస్తారు. 

విజన్‌–2047 పేరుతో మరో డ్రామా:
    విజన్‌–2047 అంటున్నాడు. చంద్రబాబూ ఏడు నెలల క్రితం నువ్వు, నీ ఎల్లో మీడియా కలిసి మేనిఫెస్టో పేరుతో ప్రచారం చేసి ఊదరగొట్టారు. రూ.15 వేలు నుంచి రూ.48 వేల వరకు హామీలిచ్చుకుంటూ వెళ్లారు. ఇక్కడ ఏడు నెలల క్రితం మేనిఫెస్టో అని చెప్పిన హామీలకే దిక్కులేదు కానీ, విజన్‌–2047 అంటున్నాడు. వీరి విజన్, ఆ డాక్యుమెంట్‌ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది.
    వాస్తవానికి మనిషిని అభివృద్ధి బాటలోకి తీసుకుని పోవాలంటే.. ఆ అభివృద్ధి బాట, వృద్ధి బాట ఏమిటని చెప్పేదే విజన్‌ డాక్యుమెంట్‌. ఇవాళ చిన్న పిల్లాడు ఇరవై ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడు? ఇరవై ఏళ్ల తర్వాత భవిష్యత్‌ ఏంటి? ఆ భవిష్యత్‌ కోసం ఇవాళ సరైన అడుగులు వేస్తున్నామా? లేడద? అన్నదే విజన్‌. 
    అందులో భాగంగా ఆరోజు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చాలా వాటిసి చేసి చూపింది. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలో లేని విధంగా వైయస్సార్సీపీ ప్రభుత్వం బడులను మార్పు చేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా గవర్నమెంటు బడులతో ప్రైవేటు బడులు పోటీ పడే పరిస్థితి కేవలం వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే వచ్చింది.
    నాడు–నేడు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. తొలిసారిగా ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్‌ రూమ్‌లోనూ ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ)తో డిజిటల్‌ బోధన కూడా వైయస్సారీపీ ప్రభుత్వంలోనే మొదలైంది. ప్రభుత్వ బడులన్నీ ఇంగ్లిషు మీడియం చేయడంతో పాటు, సీబీఎస్సీతో ఆపకుండా.. ఏకంగా ఐబీ వరకు ప్రయాణానికి కూడా వైయస్సార్సీపీ ప్రభుత్వంలోనే అడుగులు పడ్డాయి. రోజుకొక మెనూతో గోరుముద్ద కూడా మన ప్రభుత్వంలోనే అమలు చేశాం. తొలిసారిగా మనం చేసిన ఈ మార్పులతో పదో తరగతికి వచ్చే సరికి పిల్లవాడు ఇంగ్లిషులో అనర్ఘళంగా మాట్లాడే పరిస్థితి.. అదీ మన విజన్‌ . 

ఉన్నత విద్యలోనూ ఊహకందని మార్పు..
    ఉన్నత విద్యలో మన డిగ్రీతో ఉద్యోగాలు రాని పరిస్థితి నుంచి వాటిని మరింత మెరుగ్గా చేయడానికి ఎడెక్స్‌ అనే సంస్ద సహాయంతో ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ తీసుకొచ్చాం. ఇందులో మన డిగ్రీ విద్యార్ధి తనకు నచ్చిన కోర్సులు కోసం స్టాన్‌ ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ వంటి పెద్ద, పెద్ద విదేసీ యూనివర్సిటీలు కోర్సులు ఆఫర్‌ చేసేలా చేశాం. ఆ కోర్సులు ఇక్కడ తీసుకుని వారి పరీక్షలు రాస్తే.. వాటికి ఆ యూనివర్సిటీలు సర్టిపికేట్‌ ఇస్తాయి. ఆయా యూనివర్సిటీల నుంచి డేటా అనలైటిక్స్, అసెట్స్‌ మేనేజిమెంట్‌ వంటి కోర్సుల్లో సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి కోర్సుల కోసం ఆలోచన చేసి వారికి విద్యాదీవెన, వసతి దీవెనతో సహా ఏర్పాటు చేయడమే విజన్‌.

గ్రామస్ధాయిలో ప్రివెంటివ్‌ కేర్‌ తెచ్చాం:
    చదువులు, వైద్యం మనిషిని ఎప్పుడైనా అప్పుల్లోకి నెట్టేస్తుంది. వెద్యం కోసం ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని,  ఆరోగ్య శ్రీ పరిధిని 3300 ప్రోసీజర్స్‌ కు తీసుకుని పోయి రూ.25 లక్షల వరకు ప్రతి పేదవాడికి ఉచితంగా ఆరోగ్యశ్రీ అందేట్టు చేశాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నాడు–నేడు పనులతో రూపురేఖలు మార్చాం.  ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో జీరో వేకెన్సీ పాలసీని తీసుకుని వచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రిలో స్పెషలిస్టు డాక్టర్ల కొరత దేశ వ్యాప్తంగా 67శాతం ఉంటే మన రాష్ట్రంలో మాత్రం దాన్ని కేవలం 4శాతానికి పరిమితం చేశాం. ప్రతి ఆసుపత్రిలో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలతో కూడిన మందులు ఉండేలా చేశాం. గ్రామ స్ధాయిలోకి విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తెచ్చాం. గ్రామ స్ధాయిలోనే ప్రివెంటివ్‌ కేర్‌ అంటే వివిధ రోగాలు తొలిదశలో ఉన్నప్పుడే గుర్తించి, వాటిని నివారించడానికి గొప్ప అడుగులు వైయస్సార్సీపీ ప్రభుత్వంలోనే పడ్డాయి. ఇదీ విజన్‌.
    రైతుకు ఇబ్బంది రాకుండా, వారిని చేయి పట్టుకుని నడిపించేందుకు ఒక అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ను ఆర్బీకే కేంద్రంగా కూర్చొబెట్టడం విజన్‌. ప్రతి ఎకరాను ఈ–క్రాప్‌ చేయడమే కాకుండా.. రైతుకు తోడుగా ఉంటూ ఇన్సూరెన్స్‌ చేసుకున్నా లేకున్నా.. విపత్తు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌ ఇన్సూరెన్స్‌ వచ్చేట్టు ఉచిత పంటల బీమా తీసుకుని రావడం విజన్‌. రైతుకు దళారీ వ్యవస్థ లేకుండా ఆర్బీకేల దగ్గరే కొనుగోలు చేసి.. పూర్తి గిట్టుబాటు ధర ఇచ్చేట్టు చేయడం ఒక విజన్‌. ఈ రకంగా వ్యవసాయ రంగంలో మార్పులు కూడా వైయస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగింది.
    మన ప్రభుత్వం రాకమనుపు ఒక రూపాయి ప్రభుత్వం ఇస్తే.. అది నేరుగా ప్రజల దగ్గరకు వెళ్ళే పరిస్ధతి ఉంటుందని ఎవరైనా అనుకున్నారా?.  అలాంటి విజన్‌ను తీసుకొచ్చిందే వైయస్సార్‌సీపీ ప్రభుత్వమే. గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెబుతూ ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ. అందులో 540 రకాల సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం. 60–70 ఇళ్లకు ఒక వాలంటీర్, కులం, మతం, ప్రాంతం చూడకుండా లంచాలు లేకుండా ప్రతి ఇంటికి ప్రతి పథకం చేర్చగలిగే పరిస్థితి వైయస్సార్సీపీ ప్రభుత్వంలోనే వచ్చింది. ఇదీ విజన అంటే. అలా మేనిఫెస్టోను ఎగురగొట్టేందుకు రంగురంగుల కథలు చెబుతున్నారు. దానికి విజన్‌ అని పేరు పెడుతున్నారు. అందుకే దాన్ని విజన్‌ అనరు. దాన్ని 420 అంటారు.

ఆరు నెలల్లో 3.14 లక్షల పెన్షన్లు కట్‌:
    మార్చి, ఏప్రిల్‌ నెలలో 66,34,742 పెన్షన్లు మన ప్రభుత్వ హాయంలో ఉండేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది. డిసెంబరులో పంపిణీ చేసిన పెన్షన్లు సంఖ్య 63,20,222 అంటే 3.14 లక్షల పెన్షన్లు కట్‌ చేశారు. కొత్త పెన్షన్లు ఒకరికి ఇవ్వకపోగా.. ఉన్న పెన్షన్లు కట్‌ చేస్తున్నారు. రెండు మూడు నెలల్లో ఇంకా, 3 లక్షల నుంచి 4 లక్షల పెన్షన్లు కట్‌ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరుబాటకు సిద్ధం కావాలి. ఈ పోరు బాటలో వైయస్సార్సీపీ జెండాను రెపరెపలాడించే విధంగా పోరాటం చేయాలని, ప్రతి గ్రామంలో వైయస్సార్సీపీ జెండాను ఎగుర వేయడానికి సిద్ధం కావాలని అభ్యర్ధిస్తున్నాను. 

జనవరి నుంచి జిల్లాల పర్యటన:
    జనవరి చివరి వారం నుంచి నేను పార్లమెంటు జిల్లాల్లో పర్యటిస్తాను. వారంలో ప్రతి బుధవారం, గురువారం రాత్రి అక్కడే బస చేసి కార్యకర్తలతో మమేకమవుతాను. ‘కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం’ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఈ కార్యక్రమం మొదలయ్యే లోగా మండల స్ధాయి నుంచి మొదలై నియోజకవర్గ, జిల్లాస్ధాయి వరకు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకాలన్నీ పూర్తి చేయాలి. పార్టీ నిర్మాణం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇదంతా ఆర్గనైజ్డ్‌గా తీసుకు రావాలి. నా కార్యక్రమం మొదలైన తర్వాత మీరు నేను కలిసి మండల స్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకు తీసుకుని పోదాం. విలేజ్‌ కమిటీలు, బూతు కమిటీలు నియామకం పూర్తి చేస్తాం.

మరింత చురుగ్గా సోషల్‌ మీడియాలో..:
    ఇవాళ‌ మనం చంద్రబాబుతో యుద్ధం చేయడం లేదు. చంద్రబాబు వేసుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి టీవీ5లాంటి ముసుగుతో యుద్ధం చేస్తున్నాం. ఇలాంటి వాళ్లను ఎదుర్కోవాలంటే మనం సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉండాలి. జనరేషన్‌ మారింది. ప్రతి కార్యకర్తకు ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్‌ వంటి అన్ని సోషల్‌ మీడియా అకౌంట్లు ఉండాలి. గ్రామ స్ధాయిలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించాలి. ఎవరికైనా పెన్షన్‌ రాకపోయినా, బిల్లుల బాదుడు పైనా ప్రశ్నిస్తూ ప్రతి గ్రామం నుంచి విప్లవ ధోరణిలో ప్రశ్నించాలి. 
గ్రామ స్థాయి నుంచే ప్రశ్నించే స్వరం ఉండాలి. అప్పుడు చైతన్యం వస్తుంది. ఈసారి మన టార్గెట్‌ చంద్రబాబు సింగిల్‌ డిజిట్‌ దాటకూడదు. అది కచ్చితంగా జరుగుతుంది.

Back to Top