తాడేపల్లి: ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకుడు, స్వరకర్త, తిరుమల తిరుపతి దేవస్ధానం మాజీ ఆస్దాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గరిమెళ్ల బాలకృష్ణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్ధాన విద్వాంసుడిగా బాలకృష్ణ ప్రసాదు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. సంగీత విద్వాంసుడిగానే కాకుండా ప్రముఖ సంకీర్తనాచార్యులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తలనకు స్వరకల్పన చేసి.. అన్నమాచార్యుల వారి సంగీత, సాహిత్యాలను ప్రజలకు చేరవేయడంలో ఆయన సేవలు వెలకట్టలేనివని అన్నారు.