తాడేపల్లి : వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ తొలి పూజలందుకునే వినాయకుడు విఘ్న నివారకుడే కాదు.. సకల కళలకు, విజ్ఞానానికి మూల స్వరూపుడు. అలాంటి వినాయకుడిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’’అంటూ ట్వీట్ చేశారు.