నాన్న గురించి ఈ పుస్తకంలో అమ్మ ధైర్యంగా నిజాలు చెప్పింది

వైయ‌స్ షర్మిల

తనకు మాత్రమే తెలిసిన నాన్నలోని కొత్త కోణాన్ని తెలిపింది 

వైయ‌స్సార్‌ అందరికీ ఒక స్ఫూర్తి

ఇడుపుల‌పాయ‌:  నాన్న‌, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గురించి   `నాలో..నాతో వైయ‌స్ఆర్ పుస్త‌కంలో  అమ్మ ధైర్యంగా నిజాలు చెప్పార‌ని మ‌హానేత త‌న‌య వైయ‌స్ ష‌ర్మిల పేర్కొన్నారు.   దివంగత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఆయన ధ‌ర్మ‌ప‌త్ని వైయ‌స్‌ విజయమ్మ రాసిన 'నాలో.. నాతో వైయ‌స్ఆర్‌' పుస్తకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్‌‌ షర్మిల మాట్లాడుతూ... 'నాన్న జీవిత విశేషాలపై అమ్మ రాసిన పుస్తకమే "నాలో.. నాతో వైయ‌స్సార్‌‌''. ఇది చాలా మంచి పుస్తకం.. హృదయాన్ని తాకే విధంగా ఉంది' అని తెలిపారు.

'నాన్నకు సంబంధించిన విశేషాలను ఈ పుస్తకంలో కొత్త కోణంలో తెలుసుకోవచ్చు. తనకు మాత్రమే తెలిసిన నాన్నలోని కోణాన్ని తెలుపుతూ అమ్మ ఈ పుస్తకం రాసింది. ఈ విధంగా నాన్నను లోకానికి కొత్తగా పరిచయం చేసింది. ఈ పుస్తకం చదువుతున్నంత సేపు అమ్మ, నాన్నలతో కలిసి ప్రయాణం చేస్తున్నట్లు అనిపించింది' అని వైయ‌స్‌ షర్మిల పేర్కొన్నారు.

'వారిద్దరితో ఎమోషనల్ జర్నీ చేస్తున్నట్లు భావించాను. నిజం చెప్పడం సులభం కాదు .. అయినప్పటికీ ధైర్యంగా అమ్మ నిజం చెప్పింది. ఈ పుస్తకంలో నాన్నకు సంబంధించిన అన్ని విషయాలను తెలిపింది. వైయ‌స్సార్ గొప్ప స్ఫూర్తిమంతమైన వ్యక్తి. ఆయనను జ్ఞాపకం చేసుకునే అవసరం ఉంది. అందుకే అమ్మ ఈ బుక్‌ రాసింది' అని షర్మిల చెప్పారు.

వైయ‌స్సార్‌ అందరికీ ఒక స్ఫూర్తి అని వైయ‌స్ షర్మిల అన్నారు. "నాలో.. నాతో వైయ‌స్సార్‌‌'' పుస్తకాన్ని అందరూ చదవాలని కోరారు. వైయ‌స్సార్ జీవిత విషయాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయని తెలిపారు. అందరూ వైయ‌స్‌ జీవిత చరిత్రను తెలుసుకోవాల్సి ఉందని వైయ‌స్ ష‌ర్మిల పేర్కొన్నారు.

 

Back to Top