కేంద్రం కన్నా ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

ఏపీలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంది 

ఎగుమతుల్లోనూ ఏపీ ఎంతో అభివృద్ధి సాధించింది

చంద్రబాబు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు

ఏపీ జీడీపీలో ఐదో స్థానంలో ఉంది

 కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గింది

ఢిల్లీ:  కేంద్రం కన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో ఆర్థిక సంక్షోభం అంటూ, మరో శ్రీలంక కాబోతుందంటూ ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను విజయసాయిరెడ్డి తిప్పికొట్టారు. అదే సమయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రం, ప్రతిపక్ష టీడీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు. న్యూఢిల్లీలో పార్టీ ఎంపీలతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 

  • ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక ఇండెక్సెస్‌ అన్నీ కూడా లిమిట్స్‌లోనే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉందని తెలియజెప్పేందుకు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం.
  • 19 జులై 2022న నిర్వహించిన అఖిలపక్ష సమావేశం కేంద్రం ఏర్పాటు చేసింది. ఎంపీలందరికీ కూడా దేశ ఆర్థిక పరిస్థితిని ఈ సమావేశంలో వివరిస్తూ..శ్రీలంకకు ఏ రకంగా మనం సహాయం చేయాలని చెప్పారు.
  • ఈ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కూడా వివరించారు.  ఈ సమావేశంలో కొన్ని వివరాలు ఇచ్చారు.
  • గత కొన్ని రోజులుగా చంద్రబాబు ఆర్థిక పరిస్థితిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది..మరో శ్రీలంకగా మారబోతుందని పదే పదే చెబుతున్నారు. ఆ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ఎక్కడా కూడా వివరించలేదు. రాష్ట్ర, కేంద్ర పాలితప్రాంతాల ఆర్థిక పరిస్థితిని వివరించారు. 
  • చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక విషయం గురించి మాట్లాడే సమయంలో మనకు ఎలా వర్తిస్తుందని గమనించాలి. 
  • రాష్ట్రం అప్పును జీడీపీతో పోల్చితే ఎలా ఉంది? 2021–22వలో కేంద్ర ప్రభుత్వం 57 శాతం ఉంది. పంజాబ్‌ లో 47 శాతం, ఏపీలో జీడీపీ చూస్తే 32.4 శాతం ఉంది. సీరియల్‌ నంబర్‌లో చూస్తే ఏపీ ఐదో స్థానంలో ఉంది. ఎక్కడా కూడా ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా లేదు. చాలా చక్కగా ఉంది. కేంద్రం కన్నా ఏపీలో చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ డెఫిసిట్‌ గమనిస్తే..8,500 కోట్లు, పిస్క‌ల్‌  డెఫిసిట్‌ 25,194.62 కోట్లు, 15వ ఆర్థిక ప్రణాళిక రెకమెండ్‌ చేసినా కూడా జీఎస్‌డీపీ ఏపీకి 2.1 శాతం మాత్రమే ఉంది.
  • కేంద్రంతో పోల్చితే కేంద్రంలో ఫిజికల్‌ డెఫిసిటి 6.9 శాతం ఉంది. ఏపీలో 3.18 శాతం ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితి చాలా చక్కగాఉంది
  • శ్రీలంకలో సంక్షోభం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. పదేపదే చంద్రబాబు ఇదే చెబుతున్నారు. శ్రీలంకలో ఎగుమతులు తగ్గడం, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గాయి. టూరిజమ్‌ తగ్గింది. శ్రీలంక కరెన్స్‌ వ్యాల్యూ పడిపోయింది. వివిధ కారణాలతో శ్రీలంకలో సంక్షోభం వచ్చింది. ఈ విషయం చంద్రబాబుకు తెలియడం లేదు.
  • 2019–2020లో శ్రీలంకలో మర్కైంటైజ్‌ ఎక్సోపోజ్‌  12.9బిలియన్‌ డాలర్లు, ఏపీలో 85,665 కోట్లు , 2021లో శ్రీలంకలో ఇంచుమించు 12 బిలియన్‌ డాలర్లుగానే ఉంది. ఏపీలో 85,660 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు చేరింది. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఏవిధంగా అభివృద్ధి చెందుతుందో అర్థమవుతోంది. 
  • ఇక రెమిటెంసెస్‌ విషయానికి వస్తే రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఏపీకి స్టేట్‌ రెమిటెంసెస్‌ ఎక్కడా ఇవ్వడం లేదు. అయినా కూడా రాష్ట్రంలో 4 నుంచి 5 శాతం ఉంటుంది. 2020లో 4.1 బిలియన్‌ డాలర్లు, 2021లో 4.35 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  కేంద్రం నుంచి 41 శాతం ఇచ్చిన ఏ రోజు కూడా లేదు. నిజానికి ఇచ్చింది 32 శాతం మాత్రమే.
  • కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం చేస్తుందో లె లుసుకోవాలన్నారు. ఎక్కడా పన్నులు పెంచకుండా, సెస్, సర్‌చార్జ్‌లు ప్రతి ఏటా పెంచుతోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ రెండు మాత్రమే పెంచుతున్నారు. ఇందులో రాష్ట్రాలకు వాటా ఇచ్చి ఉంటే గత ఏడేళ్లలో ఏపీకి రూ.45 వేల నుంచి 50 వేల కోట్లు కేంద్రం నుంచి అధనంగా వచ్చి ఉండేవి. అన్ని రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోంది.
  • రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేస్తోందని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. బీజేపీ మొదటి టర్మ్‌లో అప్పు ఏరకంగా పెరిగిందో గమనించాలి. చంద్రబాబు హయాంలో అప్పులు అన్నవి 117.42 శాతం పెరిగాయి. 2014లో లక్ష 20 వేల కోట్ల నుంచి 2.62 లక్షల కోట్లకు అప్పులు పెంచారు.సీఏజీఆర్‌ తీసుకుంటే చంద్రబాబు హయాంలో 16 శాతం పెరిగింది. చంద్రబాబు ఎంత దారుణంగా అప్పులు చేశారో గమనించవచ్చు.
  •  మా ప్రభుత్వంలో ఏ జరిగిందో గమనించండి. 2019 నుంచి 2020 వరకు కేంద్ర ప్రభుత్వం లైయబులిటిస్‌ 49.69 శాతం పెరిగాయి. వైయస్‌ జగన్‌హయాంలో ఏం జరిగిందంటే.. అప్పు 43.03 శాతం పెరిగింది. కేంద్రం కన్నా తక్కువ అప్పులు చేశాం. సీఏజీఆర్‌ చూస్తే 12.75 శాతం మాత్రమే పెరిగింది. చంద్రబాబు హయాంలో 16 శాతం ఉండేది. దీన్ని బట్టి చంద్రబాబు ఎంత చక్కగా అబద్ధాలు చెబుతారన్నది అర్థం చేసుకోవచ్చు. మా పాలనలో కోవిడ్‌ సంక్షోభం ఉందన్నది గమనించాలి. డీబీటీ ద్వారా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రూ.1.62 లక్షల కోట్లు పేద, బడుగు, బలహీన వర్గాలకు అందజేశారు. ఇది పేదల ప్రభుత్వం అన్నదానికి నిదర్శనం. 
  • అప్పులతో పోల్చుకున్నా.. కేంద్రంతో పోల్చినా కూడా ఇంతగొప్పగా పేదలకు డబ్బులు  ఇవ్వడం గొప్ప విషయం.
  • టీడీపీ ఎంపీ ఒక ప్రశ్న వేశారు. ఏపీ ప్రభుత్వం అప్పులు ఎంత చేసిందని ప్రశ్నించింది. దానికి కేంద్ర సమాధానం కూడా తెలుసుకోండి. చంద్రబాబు హయాంలో అంటే 2014–2019 వరకు రూ.1,S62,888 కోట్లకు అతీగతి లేదని కేంద్రం సమాధానం చెప్పింది. చంద్రబాబు పాలనలో ఇబ్బడిముబ్బడిగా దుర్వినియోగం చేశారో కేంద్రమే చెప్పిందని ఎంపీ విజయాసాయిరెడ్డి వివరించారు.
  •  
Back to Top