విశాఖపట్నం: వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ అకాల మరణం విశాఖపట్నానికి తీరని లోటని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ద్రోణంరాజు మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. తనకు ద్రోణంరాజు శ్రీనివాస్ మంచి స్నేహితుడని, వైజాగ్ అభివృద్ధిలో కీలక భాగస్వామి అయ్యారన్నారు. వైజాగ్ అభివృద్ధి కోసమే శ్రీనివాస్ పరితపించే వారని గుర్తు చేశారు. ఆయన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించేవారు. భగవంతుడు చాలా త్వరగా ద్రోణంరాజు శ్రీనివాస్‌ను తీసుకెళ్లిపోయారు. ద్రోణంరాజు శ్రీనివాస్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించమని సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సీఎం మామ గారు చనిపోవడంతో ద్రోణంరాజు అంత్యక్రియలకు రాలేకపోయరని తెలిపారు. అత్యంత విషాద కరమైన రోజు: అవంతి ఈ రోజు అత్యంత విషాద కరమైన రోజు. ద్రోణంరాజు శ్రీనివాస్ నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అకాల మరణం నన్ను ఎంతో బాధించింది. పేదల కోసం ఆయన ఎంతో శ్రమించారు. ద్రోణంరాజు విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. విశాఖ అభివృద్ధిలో వారిది కీలక పాత్ర: వాసుపల్లి గణేష్ ద్రోణం రాజు మరణాన్ని విశాఖ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. విశాఖ అభివృద్ధిలో ద్రోణంరాజు సత్యనారాయణ ఆయన కుమారుడు శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. విశాఖ చరిత్రలో ఒక పేజీ వాళ్ళ కుటుంబానికి ఉంటుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఓ ల్యాండ్ మార్క్ - పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గిరిజన ప్రాంత ప్రజలతో ద్రోణంరాజు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. ద్రోణంరాజు సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్‌లు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఓ ల్యాండ్ మార్క్.