తాడేపల్లి: స్థానిక సంస్థల కోటాలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన పార్టీ నాయకులు.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతబాబు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైయస్ఆర్ సీపీ నేత అనంత సత్య ఉదయభాస్కర్ (అనంతబాబు), వారి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరును ఖరారు చేసిన సీఎం వైయస్ జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఉన్నారు. తూమాటి మాధవరావు.. ప్రకాశం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ నేత తూమాటి మాధవరావు, వారి కుటుంబ సభ్యులు సీఎం వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి తన పేరును ఖరారు చేసిన ముఖ్యమంత్రికి తూమాటి మాధవరావు పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఙతలు తెలిపారు. మొండితోక అరుణ్‌కుమార్.. కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ నేత, ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మొండితోక అరుణ్ కుమార్, కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్ధానానికి తన పేరును ఖరారు చేయడంతో ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఙతలు తెలిపారు. మురుగుడు హనుమంతరావు.. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్ధానానికి తన పేరును ఖరారు చేయడంతో ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఙతలు తెలిపారు. హనుమంతరావు వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, లక్ష్మినారాయణ ఉన్నారు. ఇందుకూరి రఘురాజు సీఎం వైయస్ జగన్‌ను విజయనగరం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ నేత ఇందుకూరి రఘురాజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్ధానానికి తన పేరును ఖరారు చేయడంతో ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి రఘురాజు కుటుంబ సభ్యులు, ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఉన్నారు.