పశ్చిమగోదావరి: పరిపాలనా చేతకాక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ప్రజలను మోసం చేయడం అనే పదానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని సెటైర్లు వేశారు రాష్ట్రంలో వరద బాధితుల కోసం ప్రజలు కదిలి వస్తే ఒక్క రూపాయి కూడా బాధితులకు ఇవ్వలేదని మండిపడ్డారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలను మభ్యపెట్టి లేనిపోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. బాదుడే బాదుడు అనే కార్యక్రమంతో ఇంటి ఇంటికి తిరిగి పెరిగిన రేట్లుపై లేనిపోని కథలు అల్లారు. మరి నిత్యవసర వస్తువులు, పెట్రోలు మీద పెరిగిన రేట్లు తగ్గించే ప్రయత్నం ఎందుకు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 55వేల కోట్లు అప్పులు చేశారు. చేసిన అప్పులు ఎక్కడికి వెళ్లాయి. కరెంట్ చార్జీలు పెంచమని అన్న మీరు ఇప్పుడు సామాన్య ప్రజలపై ఎలా భారం మోపారు. ఇసుక రేట్లు భారీగా పెంచేసి ప్రజలకు మరింత కఠినతరం చేశారు. ఇసుక కొరత వల్ల భవన కార్మికులకు పని దొరక్కపోవడంతో రోడ్డున పడ్డారు. రూ.99కే నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పి భారీ రేట్లతో మద్యం అమ్మకాలు చేస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్టు షాపులు దర్శనం ఇస్తుంటే మన రాష్ట్రం ఎక్కడ పోతుందని భయమేస్తుంది. 40ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్. కుట్రలు కుతంత్రాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. వరద బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో వచ్చిన కొన్ని వేల కోట్ల రూపాయలు సాయం చేస్తే ఒక్క రూపాయి ప్రజలకు పంచిన పాపన పోలేదు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిపోయిందో చెప్పాలి. అగ్గిపెట్టలు, కొవ్వొత్తులకు 23కోట్లు ఖర్చు పెట్టాము అని చెప్పడం సిగ్గు చేటు. చంద్రబాబుకి దేవుడు మీద విశ్వాసం లేదు, తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని పచ్చి అబద్ధాలు చెప్పాడు. దీనికి తోడు ఎల్లో మీడియాలో విష ప్రచారం చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు.. చంద్రబాబుకు మొట్టికాయలు వేసింది. పాలన చేతకాక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు. షర్మిలతో చేయి కలిపి వైయస్ జగన్ కుటుంబాన్ని చంద్రబాబు విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో వైయస్ఆర్‌సీపీ బలంగా ఉండడంతో ఎలాగైనా బలహీనం చేసేందుకు షర్మిలతో ఆస్తి పంపకాలు నాటకాలు మొదలు పెట్టాడు. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ నిర్వీర్యం చేస్తున్నారు. నిమ్మల రామానాయుడు మంత్రిలాగా వ్యవహరించడం లేదు.. డ్రామా ఆర్టిస్టులా ప్రవర్తిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై కనీస అవగాహన లేకుండా మంత్రి మాట్లాడం హాస్యాస్పదం. ఆనాడు ప్రత్యేక హోదా గాలికి వదిలేసి పోలవరం డ్రామాలు ఆడారు. పోలవరం పూర్తి అయితే కోటి ఎకరాలు ఆయకట్టు బాగుపడుతుందని వైయస్ఆర్ వేసిన ఆశయం వైయస్ జగన్ 80 శాతం పూర్తి చేశారు. ప్రజలు సూపర్ సిక్స్ నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. కూటమి అధికారంలోకి వచ్చినా సూపర్ సిక్స్ ఎక్కడా లేదు. అమ్మఒడిని తల్లికి వందనం అని పేరు పెట్టి చేతులు దులుపుకున్నారు. పేద విద్యార్థుల కోసం ఏడు మెడికల్ కాలేజీలు కడితే వాటిని నిర్వీర్యం చేసి విద్యార్థుల గొంతు కోశారు. రైతులను కూడా కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేందుకు వైయస్ఆర్‌సీపీ పలు కార్యక్రమాలతో ముందుకు వస్తుందని స్పష్టం చేశారు.