తిరుపతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై సీబీఐ విచారణ జరిపించాలని వైయస్ఆర్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండు చేశారు. ఆలయ పవిత్రత మంట కలిపే విధంగా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ అపవాదు వేశారని.. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు వాఖ్యలు చేయడం సరికాదన్నారు. మా హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని.. సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మాజీ సీఎం వైయస్ జగన్‌ను శ్రీవారి దర్శనానికి రాకుండా అడ్డుకున్నారు వేంకటేశ్వరస్వామిని వైయస్ జగన్ ఎన్నోసార్లు దర్శించుకున్నారు. రాజకీయ ప్రాబల్యం కోసం చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేశారు. వెంకన్న చౌదరి తిరుమలలో అన్యమతస్తులకు ప్రవేశం లేదంటూ పెద్ద ఎత్తున బోర్డులు పెట్టారు. వెంకన్న చౌదరి వెంకన్నకు సేవ చేయాలి. చంద్రబాబుకు కాదు. వైయస్ జగన్ పర్యటన రద్దువ్వగానే వెంటనే ఫ్లెక్సీలు తీసేశారు. రోజుకు 700 మందికి పైగా అన్యమతస్తులు తిరుమల దర్శనానికి వస్తారు. ఏనాడు డిక్లరేషన్ తీసుకోలేదు’’ అని భూమన అన్నారు. చంద్రబాబుకి దేవుడంటే భయం లేదు: మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విశాఖ పట్నం: రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి చంద్రబాబు లాగారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదు. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు లడ్డూని తెరపైకి తెచ్చారు. సీఎం లడ్డూపై రోజుకో మాట మాట్లాడుతున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని మొదట మాట్లాడారు. కల్తీ లడ్డూ ఎక్కడ వాడారో తనకు తెలియదని మళ్ళీ అంటున్నారు. వైఎస్ జగన్ నేరుగా ఎదుర్కొనలేక చంద్రబాబు.. దేవుని రాజకీయాల్లోకి లాగుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబుకి దేవుడంటే భయం లేదు .. అసలు వాస్తవాలు తెలియాలంటే లడ్డూ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలి. చంద్రబాబు వేసిన సిట్‌పై నమ్మకం లేదు.. తిరుపతి వెళ్తామంటే నోటీసులు ఇచ్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా?. గతంలో వైయస్ జగన్, ఆయన తండ్రి వైయస్ఆర్ తిరుపతి వెళ్లలేదా.. మళ్లీ వైయస్ జగన్ తిరుపతి వెళతారు. ఎవరు ఆపుతారో చూస్తాం వైయస్ జగన్‌కు వెంకటేశ్వరస్వామిపై ఉన్న భక్తి చంద్రబాబుకు లేదు. రుషికొండ టీటీడీ దేవాలయాన్ని వైయస్ జగన్ హయాంలోనే నిర్మించారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా ప్రత్యేక పూజలు నిర్వహించాం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు పవన్ కళ్యాణ్ దీక్షలు చేయాలి. జనసేన ఎమ్మెల్యే దళిత ఉద్యోగిపై దాడి చేసినందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి’ డిక్లరేషన్ బోర్డు పెట్టి ఎందుకు తీసేశారు?: మాజీ మంత్రి అంబటి రాంబాబు అసత్య ప్రచారంతో టీటీడీ ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నారు. డిక్లరేషన్ బోర్డు పెట్టి ఎందుకు తీసేశారు?. బాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా వైయస్ జగన్ తిరుమల వెళ్లారు. అప్పుడు డిక్లరేషన్ ఎందుకు అడగలేదు?. వైయస్ జగన్‌ను మానసికంగా వేధించాలని కుట్రలు చేస్తున్నారు. కూటమి నేతల మెదడులోనే ‘కల్తీ’: వైయస్ఆర్‌సీపీ నేత పోతిన మహేష్ కూటమి ప్రభుత్వం గత పది రోజులుగా తిరుమల వేంకటేశ్వరస్వామిని ప్రచార అస్త్రంగా మార్చుకుంది. ఇష్టానుసారంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజకీయాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.. ఇలాంటి రాజకీయాలు మానుకోవాలి. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు చేసిన పాపాలకు వారికే శిక్షలు పడాలని ఆ దేవుడిని కోరుతున్నాం. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నాం. కల్తీ లడ్డూలో జరగలేదు... కల్తీ నెయ్యిలో జరగలేదు. కూటమి నేతల మెదడులోనే కల్తీ జరిగింది. పాదయాత్ర ముగించుకుని జగన్ నేరుగా తిరుమల వెళ్లారు. ఆ రోజు చంద్రబాబు ఎందుకు డిక్లరేషన్ అడగలేదో సమాధానం చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో కలిసి వెళ్లినపుడు ఆ రోజు బీజేపీ నేతలు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు?. తిరుమల వెంకన్న స్వామిపై వైయస్ జగన్‌కి అపారమైన నమ్మకం ఉంది. కాబట్టే తిరుమలతో నవనీత సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యోగులను పర్మినెంట్ చేశారు. జీతాలు రెట్టింపు చేశారు. ఇళ్లస్థలాలు ఇచ్చారు. ఏ రోజు ఏ మతంలో ఉంటాడో.. ఏ కులంలో ఉంటాడో తెలియని పవన్‌ను చంద్రబాబు డిక్లరేషన్ అడగాలి.