తిరుమలకు వెళ్లకుండా నోటీసులు ఇవ్వడం దారుణం

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: తిరుమలకు వెళ్లకుండా నోటీసులు ఇవ్వడం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌ మండిపడ్డారు. తిరుమలకు వెళ్లకుండా నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సతీష్‌  ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. నెయ్యి ట్యాంకర్‌లను వెనక్కి పంపామన్న చంద్రబాబు..లడ్డూలో ఎలా కల్తీ జరుగుతుందని ప్రశ్నించారు. చంద్రబాబుకు మతిభ్రమించి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ బోర్డును దిగజార్చేలాగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. టీటీడీ ప్రతిష్టను గంగపాలు చేస్తున్న ఘతన చంద్రబాబుకే దక్కిందన్నారు. 

వైయస్‌ఆర్‌సీపీ నేతలకు నోటీసులు
వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసు 30 యాక్ట్‌ అమలులో ఉందంటూ భూమన కరుణాకర్‌రెడ్డి, అభినయ్‌తో పాటు మేయర్‌ శిరీషకు, కార్పోరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. తిరుమలకు వెళ్లొదంటూ నోటీసులు ఇచ్చారు.
 

Back to Top