తాడేపల్లి: ఆంధ్ర జ్యోతి పత్రిక అధినేత వేమూరి రాధాకృష్ణ ప్రధాని బల్ల కింద ఏమైనా దూరారా అని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. బల్ల కింద దూరి రాస్తున్నట్లుగా(బకిరా) ఆంధ్రజ్యోతి కథనాలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఆ రాతలను పట్టుకుని టీడీపీ నేతలు పిచ్చి కుక్క కరిచినట్లుగా, బకరాల్లా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో గురువారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. కేంద్ర పదవులు మాకు అవసరం లేదు: రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కలిశారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వ్యక్తిగత ఎజెండా కోసం కలిశారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తమకు కేంద్ర పదవులు అవసరం లేదని తేల్చి చెప్పారు. 10 ఏళ్ల రాజధానిగా హైదరాబాద్ ఉన్నా.. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు భయపడి ఏపీకి పారిపోయారు. కేసుల గురించి సీఎం వైయస్ జగన్ భయపడరు. కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవు. సీఎం వైయస్ జగన్‌పై ఉన్నవన్ని కుట్రపూరితమైన కేసులే. ఆ విషయాన్ని ప్రజలు గమనించారు.151 సీట్లతో సీఎం జగన్‌ను అఖండ మెజార్టీతో గెలిపించారు. చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు. చీకట్లో చిదంబరాన్ని కలిసిన చరిత్ర బాబుది.. చీకట్లో చిదంబరాన్ని కలిసిన చరిత్ర చంద్రబాబుదేనని అంబటి రాంబాబు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే సీఎం వైయస్ జగన్‌కు ముఖ్యం. కేంద్ర పదవులు మాకు అవసరం లేదు. చంద్రబాబు మారకుంటే మళ్లీ ప్రజలు బుద్ధి చెబుతారని’’ ఆయన దుయ్యబట్టారు. ఆంధ్రజ్యోతి కథనంలో అసలు జర్నలిజం విలువలు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. ప్రధానికి ఎవరైనా కోర్టులపై ఫిర్యాదు చేస్తారా?. ప్రధాని బల్ల కింద రాధాకృష్ణ ఏమైనా దూరారా?. ఇలాంటి రాతలు రాసేందుకు రాధాకృష్ణకు సిగ్గుందా?. ప్రధాని, కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిసినప్పుడల్లా ఆంధ్రజ్యోతి విషప్రచారం చేస్తోందని అంబటి నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రయోజనాలే సీఎం వైయస్ జగన్‌కు ముఖ్యమని అంబటి రాంబాబు స్పష్టం చేశారు