తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, అచ్చెన్నాయుడు వారి సొంత నియోజకవర్గాలు కుప్పం, టెక్కలిలో రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సవాలు విసిరారు. టీడీపీ హయాంలో కాల్ నాగులకు, సెక్స్ ర్యాకెట్ సూత్రధారులకు సహకరించి, మహిళల జీవితాలతో ఆడుకున్న చంద్రబాబుకు అసలు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జరిగిన మహిళా సంక్షేమం, ప్రస్తుతం వైయస్ జగన్ గారి హయాంలో జరుగుతున్న మహిళా సంక్షేమంపై చంద్రబాబుకు దమ్మూ ధైర్యం ఉంటే ఓపెన్ డిబేట్‌కు రావాలని బహిరంగ సవాల్. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మా పార్టీ మహిళా నాయకురాలు, నగిరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను రాజీనామా చేయమనడం కూడా హాస్యాస్పదంగా ఉంది . ముందు కుప్పంలో చంద్రబాబునాయుడు, టెక్కలిలో అచ్చెన్నాయుడు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే తాను తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఆమె ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి లాంటివాడు. ఆ సినిమాలో అతను అధికారం కోసం అర్రులు చాచినట్లే చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం నాడు తనకు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచారు... నేడు తన భార్య భువనేశ్వరిని అడ్డం పెట్టుకుని గ్లిజరిన్ ఏడుపులు మొదలెట్టారు... తన సొంత సోదరుడైన రామ్మూర్తినాయుడును పిచ్చివాడిని చేసి ఇంట్లో గొలుసులతో కట్టిపడేసిన చంద్రబాబుకు జగన్ గారి కుటుంబం గురించి మాట్లాడడానికి సిగ్గుండాలి. వైయస్ జగన్ పాలనలో మహిళలు ఎంతో సంతోషంగా జీవిస్తుంటే చూసి చంద్రబాబు సహించలేకపోతున్నాడు. . అమ్మఒడి, చేయూత, ఆసరా వంటి పధకాలతో మహిళా సంక్షేమాన్ని మనస్పూర్తిగా కాంక్షిస్తూ మంచి పనులు చేస్తున్న జగన్ గారిని చూసి కడుపుమంటతో రగిలిపోతూ సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేస్తూ తన అనుకూల మీడియాతో ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేయిస్తున్నారు. డ్వాక్రా గ్రూపులు తానే ఏర్పాటు చేశానని చెబుతున్న చంద్రబాబు.. తన పాలనలో 25వేల కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళలకు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి చెల్లించకుండా ఎగ్గొడితే ... వాటిని నాలుగు విడతల్లో మహిళల ఖాతాలో జమ చేస్తున్న ఘనత జగన్ గారికే దక్కుతుంది. విజయవాడ వేదికగా జరిగిన మహిళా సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు వైయస్ జగన్ గారికి జేజేలు పలికారు. యావత్ మహిళా లోకం ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి వెన్నంటి అండగా నిలిచిన నేపధ్యంలో.. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలలో వచ్చిన ఫలితాలే, 2024 ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతాయి. ఇకనైనా అబద్దాల కోరు చంద్రబాబు ఆటలు సాగవనీ, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కదనీ, అసలు ఆ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులే ఉండవు... అని పోతుల సునీత స్పష్టం చేశారు.