విద్యుత్ చార్జీల పెంపుపై ఉవ్వెత్తున ఉద్య‌మం

విద్యుత్ కార్యాలయాల వద్ద వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తల నిరసన కార్యక్రమాలు

వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల పోరుబాట‌

అమ‌రావ‌తి: ఎన్నికల సమయంలో కరెంటు చార్జీలను తగ్గిస్తామని నమ్మబలికి.. అధికారంలోకి వచ్చాక ఆర్నెల్లలోనే రూ.15,485.36 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన సీఎం చంద్రబాబు సర్కారుపై వైయ‌స్ఆర్‌సీపీ సమరభేరి మోగించింది. రాష్ట్ర­వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కరెంటు చార్జీల పెంపునకు నిరస­నగా, ప్రజలకు తోడుగా నిలుస్తూ ఆందోళన చేప­ట్టాలంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు కదం తొక్కుతున్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై ఉద్య‌మం ఉవ్వెత్తున మొద‌లైంది. రాష్ట్ర‌వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల వద్ద వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తల నిరసన కార్యక్రమాలు చేప‌ట్టారు.

కాకినాడ

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ నేతల పోరుబాట
కాకినాడ విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట పార్టీ నేతల ఆందోళన
సిటీ వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుండి డీఈ కార్యాలయం వరకు ర్యాలీ
పోరుబాటలో పాల్గొననున్న కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.
తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, పిఠాపురంలో వంగా గీతా,
పెద్దాపురంలో దవులూరి దొరబాబు, జగ్గంపేటలో తోట నరసింహం ఆధ్వర్యంలో పోరుబాట.
పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని విద్యుత్ అధికారులకు వినతి పత్రాలు అందజేయనున్న నేతలు

  విశాఖ :

విద్యుత్ చార్జీల బాదుడిపై విశాఖ సౌత్ నియోజకవర్గంలో పోరుబాట..
పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు..
మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ..
హాజరైన సీనియర్ నేతలు కొండా రాజీవ్ గాంధీ, జాన్ వెస్లీ తదితరులు

కర్నూలు..

ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ పోరుబాటు
అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నిరసనలు తెలుపుతున్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు.
ఇచ్చిన హామీలను మరచి విద్యుత్ ఛార్జీల పెంచడంపై మండిపడుతున్న సామాన్య ప్రజలు
పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ ప్రజల తరపున పోరాటం చేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ

అనంతపురం..

విద్యుత్ కార్యాలయాల వద్ద వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తల నిరసన కార్యక్రమాలు
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టిన వైయ‌స్ఆర్‌సీపీ
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్
అనంతపురం నగరంలోని బ్రహ్మంగారి ఆలయం నుంచి పవర్ ఆఫీస్ దాకా భారీ ర్యాలీ
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
శింగనమల నియోజకవర్గంలో ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో నిరసన
ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
 
 
దర్శిలో ఫ్లెక్సీల కలకలం..

వైయ‌స్ఆర్‌సీపీ విద్యుత్ పోరుబాట నేపథ్యంలో రెచ్చగొట్టేలా టీడీపీ శ్రేణుల ఫ్లెక్సీలు..
టీడీపీ వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై పోలీసులకు, మున్సిపల్‌ కమిషనర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఫిర్యాదు.
టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన మునిసిపల్ అధికారులు.
విద్యుత్ పోరుబాటకు ఆటంకాలు సృష్టిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం.
 
ఏపీ ప్రజలకు కరెంట్ షాక్..

నమ్మించి నట్టేట ముంచిన సీఎం చంద్రబాబు
ఎన్నికల్లో విద్యుత్ చార్జీలు పెంచం.. తిరిగి తగ్గిస్తాం అంటూ హామీ
టీడీపీ, జనసేన మేనిఫెస్టోలోనూ విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ
ఆరు నెలల్లోనే బట్టబయలైన సీఎం చంద్రబాబు నిజ స్వరూపం
రాష్ట్ర చరిత్రలో ఆరు నెలల్లోపు  ఏ ముఖ్యమంత్రి వేయని భారం మోపిన సీఎం చంద్రబాబు
విద్యుత్ చార్జీల పెంపుపై నోరు మెదపని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఎన్నికల్లో విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం అంటూ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ హామీ
విద్యుత్ చార్జీల బాదుడు చూసి వినియోగదారుల తీవ్ర ఆందోళన
 
నిరసనలపై ప్రభుత్వం కుట్రలు..

వైయ‌స్ఆర్‌సీపీ నిరసనలను అడ్డుకునేందుకు ‍ప్రభుత్వం కుట్రలు..
నిరసన ర్యాలీలను అడ్డుకునేందుకు ఖాకీలను ఉసిగొల్పుతున్న ప్రభుత్వం
అనంతపురం జిల్లా ఉరవకొండలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు పోలీసుల బెదిరింపులు
అయినాసరే పోరుబాటలో కరెంటు బిల్లు బాధితులు
బిల్లు భారం భరించలేక ఏలూరు జిల్లా గవరవరంలో ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం
 
 

Back to Top