వైయ‌స్ఆర్ కూతురుగా ఇన్నాళ్లూ గౌరవించాం

వైయ‌స్ జగన్ సోదరిగా అభిమానంగా చూసుకున్నాం

కానీ మీరు బద్ధ శతృవులతో చేయి చేయి కలిపారు

వారి అనుకూల మీడియాతో కలిసి పోతున్నారు

అందుకే రాజకీయంగా శతృవుగా భావిస్తున్నాం

మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు స్పష్టీకరణ

సొంత అన్నయ్యపై అంత దారుణ విమర్శలా?

అత్యంత హేయంగా ఏమిటా పదజాలం?

జగన్‌గారిని రాజకీయంగా పతనం చేయాలనుకుంటున్నారా?

ఆయన్ను ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు?

చంద్రబాబు డైరెక్షన్‌లో మీరు పని చేస్తున్నారు

ఆ స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నారు

మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఆక్షేపణ

రాజకీయాలు అంటే వేళాకోలమా? ఇది సీరియస్‌ ఇష్యూ

మా పార్టీపై, కార్యకర్తలపై ఇష్టానుసారం మాట్లాడతారా?

వైయ‌స్ జగన్ తన తండ్రి పేరు, వారసత్వం నిలబెట్టారు

అదే వైయ‌స్ఆర్ పేరును రోడ్డు మీద మీరు నిలిపారు

మీ అన్నయ్యను శనిలా పట్టుకుని వేధిస్తున్నారు

షర్మిల వైఖరిని ఎండగట్టిన సుధాకర్‌బాబు

ఇకనైనా  వైయ‌స్ జగన్‌గారిని వేధించడం మానుకొండి

ఆయన మా మనిషి. మేమంతా ఆయన కుటుంబమే

ఆయనను బాధ పెడితే చూస్తూ ఊర్కోబోము

ఎంతటి వారినైనా వదిలిపెట్టం. గట్టిగా ఎదుర్కొంటాం

షర్మిలకు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు హెచ్చరిక

చివరకు మీ బాబాయిని ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు

ఆయన వైయ‌స్ జగన్ మోచేతి నీళ్లు తాగి బతుకుతున్నారా?

ఇదేనా మీ సంస్కారం? ఏమిటా దిగజారుడు మాటలు?

వైయ‌స్ జగన్  మా వంటి వారెందరికో రాజకీయ బిక్ష పెట్టారు

ఆయన వల్ల కోట్లాది నిరుపేదల జీవితాలు మారాయి

ప్రతి నిరుపేద కుటుంబంలో ఆయన ఉన్నారు

ఇకనైనా మీ వైఖరి మార్చుకొండి. పద్ధతి వీడండి

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన సుధాకర్‌బాబు

ఒంగోలు: వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూతురుగా ష‌ర్మిల‌మ్మ‌కు ఇన్నాళ్లూ గౌరవించాం..వైయ‌స్ జగన్ సోదరిగా అభిమానంగా చూసుకున్నామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్‌బాబు అన్నారు. ష‌ర్మిల‌మ్మా..మీరు  వైయ‌స్ఆర్‌ బద్ధ శతృవులతో చేయి చేయి కలిపారు. వారి అనుకూల మీడియాతో కలిసి పోతున్నారు..అందుకే రాజకీయంగా శతృవుగా భావిస్తున్నామ‌ని మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. 
డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఇద్దరు పిల్లల్లో ఒకరు, తండ్రి ఆశయాల కోసం నిరంతరం పోరాడుతున్నారని, కృషి చేస్తున్నారని.. ఆయనే వైయ‌స్ జగన్‌ కాగా, అదే వైయ‌స్ఆర్ కి బద్ధశతృవు అయిన వారితోనూ, ఆ పార్టీ అనుకూల మీడియాతోనూ జతకట్టి, చివరకు వైయ‌స్ఆర్ పేరును చనిపోయిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌లో పెట్టిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా పని చేస్తోంది ఆయన కూతురు షర్మిల అని  సుధాకర్‌బాబు తెలిపారు. వైయ‌స్ జగన్‌కి నిజంగా పదవి, డబ్బుపై వ్యామోహం ఉంటే, ఆనాడు కాంగ్రెస్‌ను ఎదిరించి ఉండేవారు కాదని, సోనియా చెప్పినట్లు వినేవారని, రోశయ్యగారి తర్వాత తప్పనిసరిగా సీఎం అయి ఉండేవారని స్పష్టం చేశారు. ఒంగోలులో వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.

    రాష్ట్ర రాజకీయాల్లో ఎందరో వారసులు ఉన్నారంటూ.. కోట్ల, నాదెండ్ల వారసుల పేర్లు ప్రస్తావించిన ఆయన.. నమ్మిన సిద్దాంతానికి, ఆశయాలకు కట్టుబడి పోరాడుతున్న, అన్యాయంగా 16 నెలలు జైల్లో ఉన్న జగన్‌గారిని, ఆయన సోదరి రోజూ చంపుతున్నారని, ఇందుకు ఆమె మనసెలా ఒప్పిందని ప్రశ్నించారు.

ఆనాడే వైయ‌స్ఆర్ వారసురాలిగా చనిపోయారు:
    జగన్‌గారిని అన్యాయంగా 16 నెలలు జైలులో పెట్టిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న రోజే, షర్మిల వైయస్సార్‌గారి వారసురాలిగా చనిపోయారు. వాస్తవాలు చెప్పిన సొంత చిన్నాన్నను కూడా తప్పు పడుతున్నావు. ఎందుకింతగా దిగజారిపోయావు? ఆయన జగన్‌గారి మోచేతి నీళ్లు తాగుతున్నారా? ఏమిటా పిచ్చి విమర్శలు?.
    వైయ‌స్ఆర్ ఆశయ సాధన కోసం శ్రమిస్తున్న జగన్‌గారిని వేధిస్తున్న నిన్ను చూసి, తిట్టాలని ఎంత ఉన్నా, కేవలం వైయ‌స్ఆర్ కూతురువి కాబట్టి, ఓర్చుకుంటున్నాం. కానీ, రాజకీయంగా మిమ్మల్ని బద్ద శతృవులుగానే భావిస్తున్నాం.

చూస్తూ ఊర్కోబోము:
    మేం నిజాలు చెప్తుంటే.. మీకు అంత ఉలుకు ఎందుకు? మీ అన్నగారికి మీరు వ్యక్తిగతంగా రాసిన లేఖ ఎలా బయటకు వెళ్లింది? టీడీపీ చేతిలోకి ఎలా వెళ్లింది? ఎవరు ఇచ్చారు? ఆ లేఖ ఆసరాగా వైయ‌స్ జగన్‌గారి వ్యక్తిత్వాన్ని మీరు చేతులు కలిపిన చంద్రబాబు, ఆయన అనుకూల పార్టీలు, మీడియా హననం చేస్తుంటే.. మేం చూస్తూ ఊరుకోవాలా? సుబ్బారెడ్డిగారు నిజాలు చెప్పకూడదా? మా పార్టీ నాయకులు వాస్తవాలను, జరిగిన విషయాలను చెప్తే తప్పవుతుందా?.
    నీవు నీతిమాలిన, దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నావు. అక్కడ తెలంగాణ సీఎంతో కలిసి పని చేస్తావు. ఇక్కడ టీడీపీతో కలిసి పని చేస్తున్నావు. అక్కడి నుంచి నీకు నెల నెలా నిధులు ఇస్తున్నారు. చివరకు నీ ఫ్లైట్‌ కూడా వారే ఏర్పాటు చేస్తున్నారు. 
    వైయ‌స్ జగన్‌గారిని ఇబ్బంది పెడితే చూస్తూ ఊర్కోబోము. తొక్కుకుంటూ పోతాం. మీకు వైయ‌స్ జగన్‌గారు అవసరం లేదేమో. కానీ, ఆయన అవసరం మాకుంది. మేము కాంగ్రెస్‌కు వ్యతిరేకులం. టీడీపీకి వ్యతిరేకులం. బీజేపీకి వ్యతిరేకులం. 

నీ యాత్ర ఎవరివల్ల సక్సెస్‌?:
    మీరు ఆరోజు పాదయాత్ర చేశారు. మరి దాన్ని ఎవరు సక్సెస్‌ చేశారు. అది మేమే చేశాం. మీ అన్నయ్య జైలులో ఉంటే, ఆయనకు మద్దతుగా మా పార్టీ కార్యకర్తలంతా రోడ్డెక్కారు. దాని వల్లనే నీ పాదయాత్ర సక్సెస్‌ అయింది. మీరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, వాటిని ఎదుర్కునే సత్తా జగన్‌గారికి ఉంది. ఆయనకు కోట్లాది మంది అక్కచెల్లెమ్మలు రాష్ట్రమంతా ఉన్నారు.

కోట్ల కుటుంబాల్లో ఆయన ఉన్నారు:
    నీవు మాత్రమే ఆయనకు సోదరురాలివి కాదు. జగన్‌గారికి రాష్ట్రంలో కోట్ల మంది కుటుంబ సభ్యులున్నారు. వైయస్సార్‌గారి సిద్ధాంతాన్ని మేము మోస్తూనే ఉంటాం. కాంగ్రెస్‌ భావజాలానికి వ్యతిరేకంగా పుట్టిన మా పార్టీని బలోపేతం చేసుకున్నాం. చివరకు అధికారంలోకి కూడా వచ్చాం. రేపు మళ్లీ జగన్‌గారిని సీఎం చేసుకుంటాం. 

ఆనాడెందుకు ఆస్తులు కోరలేదు?:
    వైయస్సార్‌గారు చనిపోయే నాటికి మీ ఆస్తుల విలువ ఎంత? ఆ తర్వాత ఎంత? అన్నీ లెక్కలున్నాయి. సాక్షి ప్రారంభించిన కొత్తలో చాలా నష్టాలు. నెలకు ఖర్చు సుమారు రూ.30 కోట్ల నుంచి రూ.33 కోట్లు. రాబడిపోను ప్రతి నెలా సగటున రూ.20 కోట్ల నష్టం వచ్చేది. మరి ఆ నష్టంలో పాలు పంచుకుంటానని ఎప్పుడైనా షర్మిలగారు వచ్చారా? ఆమె అన్నకు తన సొంత ఆస్తుల ద్వారా ఏమైనా సాయం చేశారా?
    జగన్‌గారు ప్రారంభించిన సంస్థలు.. వైయస్సార్‌గారు పోయే నాటికి దాదాపు రూ.1300 కోట్ల రుణభారంలో ఉన్నాయి. ఆ తర్వాత కేసులు వచ్చాయి. జగన్‌గారిని అక్రమంగా జైలుకు పంపారు. ఎన్నో కష్టాలు అనుభవించారు. అలాంటి సమయంలో షర్మిల ఆర్థికంగా అన్నకు ఏ రూపంలో అండగా ఉన్నారు? ఆర్థికంగా ఏం సాయం చేశారు? ఏమీ చేయలేదు కదా? 

జగన్‌గారు మీకేం చేయలేదా!:
    జగన్‌గారు తనకేమి చేశారని షర్మిలగారు అన్నారు. ఏమీ చేయలేదా? రూ.200 కోట్లు ఎవరు తీసుకున్నారు? అవి మీ అన్న ఇచ్చినవి కాదా? మీకు మీ తండ్రిగారు ఇచ్చింది కన్నా.. మీ అన్న ఇచ్చింది ఎక్కువా? తక్కువా? షర్మిలగారు చెప్పాలి. రాశేఖరెడ్డిగారు లేని తర్వాత.. ఆ కుటుంబ భారాన్ని మోసింది జగన్‌గారే కదా? మరి ఏమీ చేయలేదని ఒక్క మాటతో కొట్టేస్తే ఎలా? ఇవాళ మీరు అనుభవిస్తున్నదంతా ఆయన ఇచ్చిందే కదా?.
    కంపెనీల్లో నీ పేరు ఎక్కడైనా ఉందా? ఆరోజు దాన్ని మీరు మీ తండ్రిని ఎందుకు అడగలేదు? భారతి సిమెంట్స్‌ అని పేరు ఎందుకు పెట్టారంటే, అది ఆయన సొంతం కాబట్టి. చంద్రబాబుకు రాష్ట్రంలో చాలా వ్యతిరేకత ఉంది. అందుకే ఆయన నిన్ను ముందుపెట్టి నడిపిస్తున్నాడు. ప్రతినెలా నీకు తెలంగాణ సీఎం డబ్బులు పంపిస్తున్నాడు.

పదవి కోసం కొత్త డ్రామా:
    నీవు నీ పీసీసీ పదవిని కాపాడుకోవడానికి కొత్త డ్రామా ఆడుతున్నావు. జగన్‌గారి కంపెనీల్లో లాభాలు కోరుతున్న నీవు, ఆ కంపెనీల మీద కేసు పెట్టిన కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా ఉన్నావు. అదే కాంగ్రెస్‌ ఆనాడు జగన్‌గారిపై కేసు పెట్టి, అన్యాయంగా 16 నెలలు జైల్లో పెడితే.. మీరు వాటిలో నాకూ భాగస్వామ్యం ఉందని ముందుకు ఎందుకు రాలేదు?. అందుకు కారణం. అప్పుడు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. ఆ తర్వాత అవి లాభాల బాట పట్టడంతో, వాటా ఉందని చెబుతున్నావు.
    ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకొండి. నీకు జగన్‌గారు 10 ఏళ్లలో రూ.200 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత 2019లో జగన్‌గారు తన కంపెనీల్లో 40 శాతం వాటా రాసిచ్చినప్పుడు, నీ పేరు మీద ఎందుకు మార్చుకోలేదు? కారణం అలా చేస్తే నీవు రూ.200 కోట్ల రుసుము చెల్లించాల్సి వచ్చేది. ఆ తర్వాత కేంద్రం రూల్‌ మార్చింది. దాంతో నీవు షేర్లు మార్చుకున్నావు. కొత్త డ్రామా ఆడుతున్నావు.

జగన్‌గారి ఔదార్యం:
    నీవు చెబుతున్నట్లు నిజంగా నీకు భాగస్వామ్యం ఉంటే, నీపేరు కంపెనీలో లేదు. మీరు డైరెక్టర్లుగా ఎందుకు లేరు.తండ్రి ఆస్తిలో కూతురు, కొడుక్కి సమాన హక్కు ఉంటుంది. ఆ మేరకు మీకు ఆస్తులు దక్కాయి. కానీ, తండ్రి మరణానంతరం, జగన్‌గారి ఆస్తుల్లో నీకు భాగస్వామ్యం కోరుకున్నావు. నిజానికి నీకు ఆ హక్కు కూడా ఉండదు.
పైగా ఆయనకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. అయినా ఆస్తి కోరుకున్నావు.
నీవు ఎందుకు ఆలోచించడం లేదు?

ఇది మా సెంటిమెంట్‌:
    ఎంతసేపూ డబ్బు, రాజ్యాధికారం కోరడం కాదు. ఇది మా సెంటిమెంట్‌తో కూడిన విషయం. జగన్‌గారి దయ వల్లనే సామాన్యులమైన మేము చాలా మంది ప్రజా ప్రతినిధులం అయ్యాం.
ప్రజాభిమానంతో ఒక మహానేతగా ఎదిగిన అన్నయ్యతో మంచిగా ఉండి, మంచితనంతో కావాల్సినవి అడగాల్సి ఉండాల్సింది. కానీ, ఆ పని చేయకుండా అన్నయ్య శతృవులతో చేయి కలిపావు. ఆయన ఆస్తులు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. కడుతున్న పార్టీ ఆఫీస్‌ను కూల్చారు. పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే మీకేమీ కనిపించడం లేదా? చంద్రబాబు చేస్తోంది తప్పు అనిపించలేదా?
    చంద్రబాబు తన తమ్ముణ్ని కనిపించకుండా చేశారు. ఆయన తన తోబుట్టువులకు కొంచెం కూడా ఆస్తి రాసివ్వలేదు. కనీసం దాన్నైనా గుర్తించు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో. రాజకీయాలు అంటే ప్రెస్‌మీట్లు పెట్టడం, వ్యక్తిగత లేఖలు బయట పెట్టడం కాదు. మీకు ఆస్తులు కావాలంటే, నాన్న పోగానే ఎందుకు అడగలేదు?

అదే మీ అందరి కుట్ర:
    ఇప్పుడు ఈ కుట్ర ఎందుకు చేశావంటే.. జగన్‌గారి బెయిల్‌ రద్దు కావాలి, ఆయన పార్టీ దెబ్బతినాలి. అదే నీ లక్ష్యం. నిన్ను నడిపిస్తున్న చంద్రబాబు కుట్ర. ఆనాడు జగన్‌గారు కాంగ్రెస్‌ను వీడి వస్తే, మా లాంటి ఎందరో ఆయన వెంట నడిచారు. మేమంతా ఆయన వెంటే ఉన్నాం. కానీ, మీరు మాత్రం ప్రతి క్షణం ఆయన్ను తల దించుకునేలా చేస్తున్నారు.
    మీరు వైయస్సార్‌గారి కూతురు కాబట్టి, ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాం. కానీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా, చంద్రబాబుతో కలిసి పని చేయడాన్ని ఎప్పుడూ తప్పు పడుతూనే ఉంటాం. శతృవుగానే చూస్తాం.
అన్నయ్యను దింపాలని పని చేస్తున్నావు. ఆనాడు చంద్రబాబు తన మామకు వెన్నుపోటు పొడిచి, పదవి లాక్కుంటే, నీవు నీ అన్నయ్యను రాజకీయంగా చంపి, పదవి పొందాలని చూస్తున్నావు.

భారతిగారిపై అసత్యాలు ఎందుకు?:
మీ వెనక ఎవరున్నారు?:
    జగన్‌గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి, ఆస్తులు ఆయనవే అనడం సరికాదని మరో అబద్ధం చెప్తున్నారు. భారతిగారిపై కేసులు లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భారతిగారి ఆస్తులు అటాచ్‌ అయ్యాయి. ఆమె పేరు కూడా కేసులో ఉంది. 
    ఇంకా తల్లిని కోర్టుకు ఈడ్చారు అంటున్నారు. ఈ పరిస్థితికి కారణం షర్మిల కాదా? మోసపూరితంగా షేర్లు బదిలీ చేసుకోవడం వల్లనే కదా ఇదంతా?. షేర్‌ సర్టిఫికెట్స్‌ పోయాయని తప్పుడు సమాచారం ఇచ్చి బదిలీ చేయించుకున్నారు. దీన్ని వెనకుండి నడిపింది ఎవరు?.
    అంటే అన్నను మళ్లీ కష్టాల్లోకి పెట్టినా పర్వాలేదా? నీవు చేసిన తప్పుడు పనికి ఆయన కోర్టు రక్షణ కోరుకుంటే తప్పా? ఆయన కోర్టుకు వెళ్లింది మేలు కోసం కాదు. కీడు జరగకుండా ఉండటానికి. భవిష్యత్తులో ఎదురయ్యే పర్యవసానాలకు జగన్‌గారు, ఆయన పార్టీ బలి కావాల్సిందేనా? ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారు? అంటే తప్పు మీరు చేస్తారు? జగన్‌గారు దానికి శిక్ష అనుభవించాలా?. తద్వారా మీరు మా పార్టీ నాశనం కోరుకుంటున్నారు. అంతే కదా?.

వైయ‌స్ఆర్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది కాంగ్రెస్‌:
    ఎఫ్‌ఐఆర్‌లో వైయ‌స్ఆర్ పేరు పెట్టింది పొన్నవోలు అని మరో అబద్ధాన్ని షర్మిలగారు చెప్తున్నారు. సీబీఐ వైయస్సార్‌గారి పేరు పెడితే, పొన్నవోలు దానిపై కోర్టుకు వెళ్లారు. కేబినెట్‌ అన్నది సమష్టి నిర్ణయం, దానికి ఒక్క  వైయస్సార్‌గారు బాధ్యులు ఎలా అవుతారని ప్రశ్నిస్తూ ఆయన కేసు వేశారు. దీన్ని వక్రీకరించి షర్మిల అబద్దాలు చెప్తున్నారు. కాంగ్రెస్‌లో కలిసి పోవడానికి, చంద్రబాబుతో కలిసి నడవడానికి ఈ అబద్ధాన్ని ఎంచుకున్నారు. ఇది వాస్తవం కదా?

నీది స్థిరత్వం, గమ్యం లేని రాజకీయం:
    నీకు రాజకీయ స్థిరత్వం లేదు. గమ్యం అస్తవ్యస్తంగా ఉంది.
తెలంగాణలో పార్టీ పెట్టావు. నీ వెంట పది మంది కూడా లేరు. పూర్తిగా విఫలమై.. ఇక్కడికి వచ్చావు. మా లాంటి వారెందరికో జగన్‌గారు రాజకీయంగా బిక్ష పెట్టారు. మేము పదవులు పొందాం. ఇంకా కోట్లాది నిరుపేదలకు ఆయన వల్ల మేలు జరిగింది. కాబట్టి అందరి కోసమైనా.. ఇప్పుడు షర్మిలగారిని కట్టడి చేయాలని విజయమ్మ గారికి చేతులెత్తి నమస్కరిస్తూ కోరుతున్నానని టీజేఆర్‌ సుధాకర్‌బాబు వెల్లడించారు.

Back to Top