చంద్రబాబుకు భవిష్యత్ కనిపిస్తోంది 

వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ నందిగం సురేష్

చంద్రబాబుని కచ్చితంగా అరెస్ట్ చేస్తారు.. 
 

చంద్రబాబుకి ఐటీ నోటీసులపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా వున్నారు

లోకేష్‌కు సిగ్గు, శరం ఉందా ?

తాడేప‌ల్లి:  చంద్ర‌బాబుకు భ‌విష్య‌త్ క‌నిపిస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ నందిగం సురేష్ అన్నారు. చంద్రబాబు బాగోతం కొద్దీ రోజులుగా బయట పడుతోందని .. ఐటీ నోటీసులకు సమాధానం చెప్పకుండా ఆయన దొంగలా తిరుగుతున్నారని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మ గౌరవం గురించి మాట్లాడే బాబు ఇప్పుడు ఎక్కడ తాకట్టు పెట్టారని ప్రశ్నించారు. చంద్రబాబుకి ఐటీ నోటీసులపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా వున్నారని ప్ర‌శ్నించారు. పవన్ కళ్యాణ్‌కి కూడా ఏమైనా ముడుపులు అందాయా అని నిల‌దీశారు. చంద్రబాబు ఇప్పటికైనా తన తప్పుని ఒప్పుకోవాలన్నారు. కోడ్ భాషలో చంద్రబాబు డబ్బులు సమకూర్చుకున్నారని ఎంపీ నందిగం సురేష్ ధ్వ‌జ‌మెత్తారు. చంద్రబాబును కచ్చితంగా అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నిద్ర మేల్కో, ప్రశ్నించు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. లోకేష్‌కు సిగ్గు, శరం ఉందా ఆయన  ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో అల్లర్లు, గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు. గురువారం ఎంపీ నందిగం సురేష్ మీడియాతో మాట్లాడారు.

తప్పించుకు తిరుగుతున్న దొంగ చంద్రబాబుః
అమరావతి రాజధాని పేరిట రెండు కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి చంద్రబాబు, లోకేష్ లకు అక్రమంగా రూ.118 కోట్లు ముట్టాయని కేంద్ర ఐటీశాఖ నోటీసులు జారీచేసింది. అయితే, ఈ నోటీసులకు సరైన సమాధానం చెప్పకుండా, డొంక తిరుగుడు వాదనలు చేస్తూ, చంద్రబాబు దొంగలా తప్పించుకు తిరుగుతున్నాడు. మరోవైపు మా నాన్న నిప్పు అని గొప్పలు చెబుతున్న ఆయన కొడుకు లోకేశ్‌ కూడా ఐటీశాఖ నోటీసులపై నోరుమెదపడం లేదు. దీన్నంతటినీ జాతీయ మీడియా సైతం ప్రచారంలోకి తీసుకొచ్చిం ది. చంద్రబాబుకు ఐటీశాఖ జారీచేసిన నోటీసులపై జరుగుతున్న పరిణామాల్ని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.

- చంద్రబాబుకు తన భవిష్యత్‌ కళ్లకు కనిపిస్తుందేమో..? తనను రేపోమాపో అరెస్టు చేస్తారని నిన్న మాట్లాడాడు. ఆ విషయం ప్రజలకు చెప్పాల్సిన అవసరమేముంది..? తప్పు చేసినోడ్ని చట్టం శిక్షించకమానదు. ఈ విషయం చంద్రబాబుకు సైతం తెలుసు కనుకే ఆయనలో ప్రస్తుతం భయం బయల్దేరింది. మరి, ఇప్పటికైనా ఆయన ఆర్జించిన అవినీతి సంపాదనపై తప్పు ఒప్పుకుంటాడా..? లేదంటే, తప్పు నుంచి తప్పించుకుంటాడా..?. 

బాబు అవినీతి సముద్రంలో రూ.118 కోట్లు నీటిబొట్టేః
అమరావతి రాజధాని పేరిట  షాపూర్జీ పల్లోంజీ, ఎల్‌అండ్‌టీ కంపెనీలు చిన్న కాంట్రాక్టు పనుల్లోనే చంద్రబాబుకు రూ.118 కోట్లు ముడుపులు చెల్లించారు. అలాంటిది, ఈ రెండు కంపెనీలతో పాటు మరికొన్ని కంపెనీలు వేలకోట్ల కాంట్రాక్టులు దక్కించుకుని.. రాష్ట్రప్రభుత్వ ఖజానా నుంచి బిల్లులు డ్రా చే శాయి. అంటే, ఎన్ని రూ.వేల కోట్లు చంద్రబాబు అండ్‌ కో ముఠాకు అంది ఉంటాయో అర్ధం చేసుకోవాలి. దీన్నిబట్టి లెక్కవేస్తే.. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ఆర్జించిన రూ.వేల కోట్లల్లో ఐటీ పట్టుకున్న రూ.118 కోట్లు కేవలం సముద్రంలో నీటిబొట్టు మాత్రమేనని తెలుస్తుంది. అదేవిధంగా స్కిల్‌డెవలప్‌మెంట్‌లో రూ.350 కోట్ల కుంభకోణం, టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో స్కామ్‌ తదితర అన్నింటిపై సమగ్ర విచారణ జరుగుతోన్న క్రమంలో బాబు బొక్కలన్నీ బయటపడే రోజులొస్తున్నాయి. 

బాబుకు ఇంకెన్నాళ్ళు ఊడిగం చేస్తావ్..?
చంద్రబాబు ఒక అవినీతిపరుడు. రాష్ట్రసంపదను దోచుకున్న దుర్మార్గుడు, గజదొంగ. ప్రజల ధన,మానప్రాణాల్ని హరించే నరరూప రాక్షసుడు అని లోకం కోడై కూస్తుంటే.. ఆయన భాగస్వాములు మాత్రం మౌనముద్ర వహిస్తున్నారు. సొంత కొడుకు లోకేశ్‌నేమో యాత్రలో మాట్లాడుతూ .. మా నాన్న నిప్పు అంటున్నాడు. అంతకుమించి ఒక్కమాట కూడా ఐటీ నోటీసులపై స్పందించడంలేదు. మరోవైపు దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌ ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో అనేది ఎవరికీ తెలియడం లేదు. ఇక, చంద్రబాబు పార్టీ ఆఫ్‌ ఇండియాగా మారిన సీపీఐ రామకృష్ణ ఏమైపోయాడు..? ఎందుకు వీరంతా చంద్రబాబుకు అందిన ఐటీ నోటీసులపై మాట్లాడంలేదు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడికి ప్యాకేజీ ఈ అవినీతి సొమ్ములో నుంచే అందుతుందా..? కాదంటే, ఎన్నాళ్లు నువ్వు బాబుకు బానిసగా ఊడిగం చేస్తావో పవన్‌కళ్యాణ్‌ సమాధానం చెప్పాలి. జాతీయ మీడియా సైతం ఐటీ నోటీసులపై కథనాల్ని హోరెత్తిస్తుంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలాంటి పచ్చమీడియా పత్రికలు, ఛానెళ్లు ఎందుకు రాయలేకపోతున్నాయి..? అలా రాయకుండా.. చూపించకుండా ఉండటానికి మీ సంస్థలకు అందిన వాటాలేంటి..? అని ప్రశ్నిస్తున్నాను. ఐటీ గుర్తించిన రూ.118 కోట్ల అవినీతి సొమ్ములో బాబు అండ్‌ కో ముఠా మొత్తానికి వాటాలున్నందునే, వారు మౌనంగా ఉన్నారా..? అని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ సందర్భాల్లో కోర్టులను ఆశ్రయించి చంద్రబాబు 30 స్టేలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఐటీశాఖ నోటీసుల విచారణపై మరో స్టే తెచ్చుకుంటాడేమో మరి. 

బాబుకు సెల్ఫ్‌ఫైనాన్స్‌ క్యాపిటల్‌ అదిః
  రాజధాని ప్రాంతంగా అమరావతిని చెప్పుకుని.. దాన్ని అడ్డంపెట్టుకుని ప్రజాసంపదను దోచుకోవడమే తప్ప ఇక్కడి ప్రజలపై చంద్రబాబుకు ప్రేమాలేదు.. దోమాలేదు. అమరావతి సెల్ఫ్‌ఫైనాన్స్‌ క్యాపిటల్‌ అని ఆయన చెప్పిన మాటకు అర్ధమేంటా..? అని చూస్తే.. అమరావతిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు సంపాదించుకోవడమేనని అర్ధాన్ని వివరించాడన్నమాట. ప్రేమ, త్యాగం అంటూ తోటకూర కబుర్లు చెప్పి రైతుల రక్తం తాగిన వ్యక్తిని ఏమనాలి..? చంద్రబాబులాంటి దొంగను ప్రపంచంలో ఎక్కడైనా చూడగలమా..? 40 ఏళ్ల ఆయన రాజకీయ జీవితం మొత్తం ఎన్నికలొస్తున్నాయంటే, కొత్త హామీల్ని ఊదరగొట్టడమే గానీ..  ఏరోజైనా రాష్ట్ర ప్రజలకు గతంలో నేను మేలు చేశానని.. మరలా అదే మేలును చేస్తానని చెప్పుకుంటాడా..? అంటే, చేసిన మేలే లేనప్పుడు చంద్రబాబు మాత్రం ఎలా చెప్పుకోగలడు..? అంటూ సమాధానం వినిపిస్తుంది. బాబు హామీలు ఎలా ఉంటాయంటే, ఎవడైనా హైదరాబాద్‌కు అన్నీ ఉన్నాయండీ... సముద్రం ఒక్కటే లేదంటే.. మనం హామీఇచ్చి తీసుకొద్దాం అనే రకం చంద్రబాబు.

బాబును అరెస్టు చేసి విచారించాలిః
చంద్రబాబు ఐటీశాఖకు అడ్డంగా దొరికిన దొంగ. రాష్ట్ర సంపదకు భద్రత లేకుండా పోయిందంటే అది చంద్రబాబులాంటి ద్రోహులు, దుర్మార్గుల పాలన వల్లనే అనేది ఐటీ నోటీసులతో తేటతెల్లమైంది. ఆయనకు ఒక్కగానొక్క కొడుకు ఉంటేనే రాష్ట్రఖజానాకు తూట్లు పొడిచి రూ.లక్షల కోట్లు సంపాదించాడంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. పాలకుల్ని నమ్మితే ఇలాగే నట్టేట ముంచుతారా..? అని చంద్రబాబును నిలదీసే రోజులొచ్చాయి. అవినీతి ముడుపుల్లో లోకేష్ కూడా సూత్రధారి అని ఐటీ నోటీసుల్లో పేర్కొంది. నిజంగా ఆయన నిప్పో తుప్పో తేలాలంటే చంద్రబాబును తక్షణమే అరెస్టు చేసి విచారించాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం.
 
నడవలేక.. అలజడులు
యువగళం పాదయాత్ర అంటూ మిడ్‌నైట్‌ వాక్ చేసే లోకేశ్‌... పాదం ముందుకు కదపలేని దద్దమ్మలా తయారయ్యాడు. యాత్రను మధ్యలో నిలిపివేస్తే తన తండ్రి కోప్పడతాడని.. ఎక్కడికక్కడ దాడులు, అలజడులకు తెరదీశాడు. చంద్రబాబు కుట్రల ఫలితంగానే ఉభయ గోదావరి జిల్లాల్లో అలజడులు జరుగుతున్నాయి. అదేమంటే, తప్పు వైయస్‌ఆర్‌సీపీ మీద నెట్టేయడానికి చూస్తున్నారు. ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో.. వారికి టీడీపీ తరఫున అంత పెద్ద నామినేటెడ్‌ పదవులు ఇస్తాను అని లోకేశ్‌ను అంటున్నాడు. నడవలేక గొడవలు పెట్టుకుంటున్నది, అల్లర్లు సృష్టిస్తున్నదీ లోకేషేనని టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. కనీసం, వార్డుమెంబర్, కౌన్సిలర్‌గానైనా గెలవలేని నీ స్థాయి ఏంటో తెలుసుకో. నువ్వు పాదయాత్ర చేసే గ్రామాల పేర్లు కూడా సరిగ్గా నోటితో చెప్పలేవు..? అలాంటి నువ్వు ఏదో పెద్ద నాయకుడిగా పాదయాత్రలు చేసి ఏం ఉద్దరిస్తావని..? బాబు, కొడుకులకు సిగ్గేలేదని తేలిపోయింది.

జగన్‌ గారే మరోసారి ముఖ్యమంత్రిః 
చంద్రబాబు, లోకేశ్, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌ రాష్ట్రంలోని ఊరూరా తిరుగుతూ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎంతగా తూలనాడినా.. మాకు ప్రజామద్ధతు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలతో పాటు అన్నివర్గాలు మావైపే ఉన్నాయి. పేదపిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు విద్య చెబుతామంటే బాబు అండ్‌ కో ముఠా కోర్టులకెళ్లారు. నాడు – నేడు పేరిట స్కూళ్ళను బాగు చేస్తుంటే, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై, పేదలకు ఇళ్ల స్థలాల్ని ఉచితంగా పంపిణీ చేస్తామంటే.. ప్రతి అంశంలోనూ కోర్టుల్లో కేసులు వేసి మీరు అడ్డుకున్నారు. గతంలో చేసిన పాపాలకు ప్రజల చేతుల్లో చంద్రబాబు అండ్‌ కో ముఠా నాశనం అయ్యే స్థితికి వెళ్తున్నారు. ఓటు అనే ఆయుధంతో వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ ముఠాకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోసారి జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. 

Back to Top