గుంటూరు: రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన అరాచకాలకు హద్దు పద్దు లేదని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందన్నారు. రోడ్ల విస్తరణ పేరుతో చంద్రబాబు ఆలయాలు కూల్చారన్నారు. ఐదేళ్లలో రెండు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మించలేకపోయారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో నిర్వహించిన వైయస్‌ఆర్‌సీపీ జిల్లా ప్లీనరీ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 2014–2019 మధ్య ఆయన స్పార్థపూరితమైన, అన్యాయమైన, సంకూచిత నిర్ణయాల కారణంగా అన్యాయంగా విభజనకు గురైన రాష్ట్రం అవశేష ఆంధ్రప్రదేశ్‌గా, అవహేళన ఏపీగా పిలువబడిన రాష్ట్రానికి రాజధాని అన్నది లేకుండా చేశారు. ఇందులో చంద్రబాబు పాత్ర కూడా ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో సకల అరాచకాలకు, దాష్టిక ముఠా పాలనకు, నిరంకుశత్వానికి ఒక చిహ్నంగా చెప్పాలంటే విజయవాడ, చుట్టు ప్రక్కల ప్రాంతాలు కనిపిస్తాయి. ఏ ప్రాంతమైతే తనకు పెట్టని కోటగా చెప్పుకుంటారో..ఆ ప్రాంతమే చంద్రబాబు అన్యాయమైన పాలనకు అద్దం పడుతుంది. లక్ష కోట్లతో రాజధాని నిర్మిస్తానని గొప్పలు చెప్పాడు. ఆ సంగతి పక్కన పెడితే రెండు, మూడు కిలోమీటర్ల ఫ్లై ఓవర్‌ను నిర్మించలేకపోయారు. కారణం ఏంటో చంద్రబాబుకే తెలియాలి. రాజధానికి ఎవరు వచ్చినా విజయవాడ నుంచి వెళ్లాల్సిందే. ఎయిర్ పోర్టు దిగగానే మొండిగోడలు పెట్టాడు. ఎటు చూసినా ట్రాఫిక్ జాములే. విజయవాడ సిటీ బాగు చేస్తే చంద్రబాబు పాలన బాగుంటుందనే ఆలోచన కూడా ఆయనకు రాలేదు. అమరావతికి వెళ్తే ఎడారికి వెళ్లినట్లే. సరైన రోడ్డు కూడా నిర్మించలేదు. ఐదేళ్ల పాలనలో రెండు మూడు ఫ్లైఓవర్లు కూడా నిర్మించలేకపోయారు. చంద్రబాబు పాలనలో విజయవాడ నగరంలోనే 46 గుళ్లు కూలగొట్టారు. ధర్మ పోరాటం పేరుతో బెంజీ సర్కిల్ వద్ద నాలుగు సార్లు పోరాటం చేశారు. ఖాళీ కూర్చీలతో కూర్చొని ప్రజలను ఇబ్బంది పెట్టారు. చంద్రబాబు అరాచకాలకు విజయవాడ అద్దం పడుతుంది. అందుకే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అక్రోశం వెల్లగక్కినా ఎవరూ పట్టించుకోలేదు. టీడీపీని స్థానిక సంస్థల ఎన్నికల్లో బుట్టలో పారేశారు. మన పాలన వచ్చాక విజయవాడ ఎంతో అభివృద్ధి చెందింది. ఐదు నిమిషాల్లో అటు నుంచి ఇటు రాగలిగాను. కనకదుర్గ టెంపుల్ వద్ద ఫ్లై ఓవర్ పూర్తి చేసింది మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. మన ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం పూర్తి చేశాం. బెంజి సర్కిల్ వద్ద సగంలో ఆగిన ఫ్లై ఓవర్‌ను కూడా మన జగనన్న ప్రభుత్వమే పూర్తి చేసింది. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించారు. చంద్రబాబుకు ఏమాత్రం బుద్ధిజ్ఞానం ఉంటే ఆ బ్రిడ్జిని నిర్మించేవాడు. అది కాకుండా ఐకాన్ బ్రిడ్జి అని గ్రాఫిక్స్ చూపించారు. మన హయాంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా, ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఈస్ట్రన్ సైడ్ బ్రిడ్జిని మన ప్రభుత్వం నిర్మిస్తుంది. ఆధునీక నగరంగా విజయవాడను తీర్చిదిద్దుతాం. 190 కిలోమీటర్లు రూ.1800 కోట్ల అంచనాతో సంబంధం లేకుండా రింగ్ రోడ్డు కూడా కాకుండా ఎక్కడో హైవేను కలుపుతున్నట్లు ప్రతిపాదనలు తయారు చేసి మభ్యపెట్టారు. ఆచరణలో వైయస్ జగన్ కార్యాచరణతో ముందుకు వెళ్తుంటే చంద్రబాబు ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. తాను రూ.1800 కోట్లతో నిర్మించాలనుకుంటే వైయస్ జగన్ రూ.800 కోట్లతోనే కడుతున్నాడని చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నాడు. ప్రజల అవసరాలు చంద్రబాబుకు పట్టవు. వాళ్ల ఆకాంక్షలు పట్టవు. అద్భుతమైనది సృష్టిస్తున్నానని భ్రమలో పెట్టి ఓట్లతోలబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన అరాచకానికి హద్దు పద్దు లేదు. నూజివీడుతో మొదలు నాగార్జున యూనివర్సిటీ వరకు రకరకాలుగా చెప్పి..చివరికి అమరావతి వద్ద ఆగాడు. లక్ష కోట్లతో రాజధాని అంటూ..ఇదే కామధేనువు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఆయన ఖర్చు చేసింది రూ.700 కోట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1200 కోట్లు తీసుకున్నారు. ఐదేళ్లు చంద్రబాబు ఏం చేశారో ఎవరికి అర్థం కావడం లేదు. రాజధాని ప్రాంతంలో రైతులతో చంద్రబాబు ఆటలు ఆడుకున్నాడు. అన్ని తాత్కాలికంగా నిర్మించి జనాలను మోసం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌పై కూడా విమర్శలు చేస్తున్నారని తప్పుపట్టారు. విమర్శలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. సామాజిక న్యాయంతో సీఎం వైయస్ జగన్ విప్లవం తెచ్చారని గుర్తు చేశారు.చంద్రబాబుది పచ్చి ఉన్మాద స్వభావమని దుయ్యబట్టారు.