విశాఖ: "అవినీతి చక్రవర్తి"కి అబద్ధాల భార్య భువనేశ్వరి అంటూ వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అభివర్ణించారు. భువనేశ్వరి చేపట్టిన దీక్ష ప్రజల దృష్టిలో అదొక అసత్యాగ్రహానికి దీక్ష అని విమర్శించారు. అవినీతిపరుడు జైలుకెళ్తే ఆయనకు వత్తాసుగా నారా భువనేశ్వరి దొంగదీక్షలు చేయడమేంటి..? జైలుపాలైన దొంగ కోసం దొంగదీక్షలు చేయడమనేది ఒక్క మన రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. మొన్ననేమో కంచాలు కొట్టమని పిలుపునిచ్చారు. లంచాలు తిన్నోడి కోసం కంచాలు కొట్టడమేంటని ప్రజలంతా ఛీ కొట్టారు. నిన్నటి భువనేశ్వరి దీక్షకూ ప్రజాస్పందన లేదన్నారు. అవినీతిమార్గంలోనే చంద్రబాబు అండ్ కో నడిచారని ప్రజలే చెబుతున్నారు. వీళ్లను గాడ్సే వారసులుగా ప్రకటించినా తప్పేమీలేదనే అభిప్రాయంలో ప్రజలున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం విశాఖలో వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. అవినీతి బాబు కోసం దొంగ దీక్షలా..? స్కిల్ పేరుతో.. రూ. 371 కోట్లు అవినీతి చేసి దొంగలా ఆధారాలతో సహా పట్టుబడి చంద్రబాబు జైలుకెళ్లాడనే సంగతి అందరికీ తెలిసిందే. మరి, అవినీతిపరుడు జైలుకెళ్తే ఆయనకు వత్తాసుగా నారా భువనేశ్వరి దొంగదీక్షలు చేయడమేంటి..? జైలుపాలైన దొంగ కోసం దొంగదీక్షలు చేయడమనేది ఒక్క మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. మొన్ననేమో కంచాలు కొట్టమని పిలుపునిచ్చారు. లంచాలు తిన్నోడి కోసం కంచాలు కొట్టడమేంటని ప్రజలంతా ఛీ కొట్టారు. నిన్నటి భువనేశ్వరి దీక్షకూ ప్రజాస్పందన లేదు. న్యాయస్థానాల్లో వారి న్యాయపోరాటం సంగతి పక్కనబెడితే.. క్షేత్రస్థాయిలో ప్రజాతీర్పు సైతం చంద్రబాబు అండ్ కో కు ప్రతికూలంగానే ఉందని తేలిపోయింది. అసలు, ఇదంతా టీడీపీ ఎందుకు చేస్తున్నట్లు..? రాజకీయమంటే, తప్పు చేసినోళ్లను వెనుకేసుకురావడమేనా..? అందుకు ప్రజల్ని వాడుకోవడమే ఆ పార్టీ సిద్ధాంతమా..? అని ప్రశ్నిస్తున్నాను. గాంధీజీని అవమానించిన భువనేశ్వరిః అక్టోబర్ 2న పూజ్య గాంధీజీని స్మరించుకోవడం దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమం. అలాంటిది, ఆరోజునే ఒక దొంగ అరెస్టుకు నిరసనంటూ నారా భువనేశ్వరి దొంగ దీక్ష చేపట్టడం పూజ్య గాంధీజీని అవమానించినడమే. ఆమె తండ్రి స్వర్గీయ ఎన్టీరామారావు బతికున్నప్పుడే చంద్రబాబు ఎంత దుర్మార్గుడో.. ఎంత దొంగో బహిరంగంగా చెప్పి బాధపడ్డాడు. ‘గాడ్సే కంటే ఘోరం.. గొడ్డు కంటే హీనం’ అని చంద్రబాబునుద్దేశించి ఆనాడు ఎన్టీ రామారావు అన్నమాట ఎవరూ చెరిపివేయలేరు. పూజ్య గాంధీజీనే చంపిన గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి, నీచుడైన చంద్రబాబు కోసం దీక్షలు చేశారంటేనే వీళ్లల్లో దేశభక్తి ఏమేరకు ఉందోననేది ప్రజలు అర్ధం చేసుకున్నారు. అసత్యాగ్రహానికి దీక్షబూనిన టీడీపీః నిన్నటి కార్యక్రమానికి సత్యాగ్రహదీక్ష అని పేరుపెట్టారు. ప్రజల దృష్టిలో మాత్రం అదొక అసత్యాగ్రహానికి దీక్షబూనిన టీడీపీ అని చెప్పాలి. వారిది అహింసామార్గం కాదని.. అవినీతిమార్గంలోనే చంద్రబాబు అండ్ కో నడిచారని ప్రజలే చెబుతున్నారు. వీళ్లను గాడ్సే వారసులుగా ప్రకటించినా తప్పేమీలేదనే అభిప్రాయంలో ప్రజలున్నారు. నారా భువనేశ్వరి, టీడీపీ నేతలు నిన్న దీక్షలెందుకు చేశారు..? కోర్టులేమో చంద్రబాబుకు రిమాండ్‌లిస్తూ తీర్పులిస్తుంటే.. మీరు మాత్రం దీక్షలు చేయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి..? అంటే, న్యాయవ్యవస్థపై నమ్మకం లేక కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా మీరు దీక్షలు బూనుతున్నారా..? చట్టాలకు చంద్రబాబు అతీతుడని టీడీపీ నేతలు భావిస్తున్నారా..? అని ప్రశ్నిస్తున్నాను. మీకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వర్తించదా..? ప్రత్యేకంగా ‘నారా’ వారి రాజ్యాంగం ఏమన్నా రాసుకున్నారా..? ఇందుకు నారా భువనేశ్వరి సమాధానం చెప్పాలి. తాను దీక్ష చేసింది చంద్రబాబు కోసం కాదని.. ప్రజల కోసమేనని నారా భువనేశ్వరి చెప్పింది. ప్రజలంటే ఆమె దృష్టిలో ఎవరు..? ఆమె మహిళల కోసం దీక్ష చేశారా..?రైతుల కోసమా..? లేదంటే, రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీలు నెరవేర్చాలని దీక్ష చేశారా..? మీరు ఈరోజు అవినీతిపరుడైన మీ భర్త కోసం దీక్ష చేశారనేది ప్రజలకు స్పష్టంగా తెలుసు. స్కామ్ స్టర్ చంద్రబాబుః ఈ రాష్ట్రంలో అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది, అవినీతికి కేరాఫ్ ఎవరంటే.. అది చంద్రబాబునాయుడు. అవినీతికి ఆధార్‌కార్డుగా చంద్రబాబు రికార్డుల కెక్కాడు. బోగస్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ కూడా అతనే. దోపిడీకి చిరునామా చంద్రబాబు. ఇలాంటి వ్యక్తి కోసం భువనేశ్వరి, టీడీపీ నేతలు దీక్షలు చేయడం విడ్డూరం. వారంతా చెబుతున్న చంద్రబాబు కడిగిన ముత్యం కాదు. అవినీతిలో మునిగిన ముత్యం అని గుర్తు చేస్తున్నాను. అలాగే, చంద్రబాబు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న సూపర్‌స్టారేమీ కాదు. ఆయనొక స్కామ్‌స్టార్‌గా ప్రజలకు తెలిసిపోయిందని గుర్తుచేస్తున్నాను. మీకు ఆయన బంగారు కొండ అవుతాడేమో గానీ .. ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రం చంద్రబాబు అవినీతి అనకొండగా కనిపిస్తున్నారనడంలో ఎలాంటి సందేహంలేదు. దళితమహిళలంటే అంత చిన్నచూపా..? టీడీపీ ఆదినుంచి దళితులు, బీసీల పట్ల చాలా చిన్నచూపు చూడటం అందరికీ తెలిసిన విషయమే. నిన్న దీక్ష కార్యక్రమంలో నారా భువనేశ్వరి కాళ్ల దగ్గర ఒక దళిత నాయకురాలు, మాజీ స్పీకర్ ప్రతిభా భారతిని కూర్చొబెడతారా..? అదేవిధంగా మాజీమంత్రి వంగలపూడి అనిత, మరో గిరిజన మహిళా నేత సంధ్యారాణిలకు కూడా ఏమాత్రం ప్రాధాన్యతనివ్వకుండా మీకు దిగువన కూర్చొబెడతారా..? అంటే, దళిత, బీసీ మహిళలంటే నారా భువనేశ్వరికి, ఆ పార్టీ పెద్దలకు అంత చిన్నచూపా..? అని అడుగుతున్నాను. అవినీతి చక్రవర్తికి అబద్ధాల భార్యః అవినీతి చక్రవర్తి చంద్రబాబుకి అబద్ధాల భార్య భువనేశ్వరి .. అనే టైటిల్ పెడితే ‘నారా’ వారి కుటుంబానికి చక్కగా సరిపోతుంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ నారా భువనేశ్వరి పదేపదే చెబుతున్నారు. కానీ, ఆయనొక దొంగని.. అనేక కుంభకోణాల్లో, అవినీతికి పాల్పడి వందల, వేల కోట్లు గడించినట్లు ఆధారాలతో సహా దొరికాడన్నది మాత్రం ఆమె చెప్పడంలేదు. రాజకీయాల్లో ఇన్నాళ్లూ చంద్రబాబును మించిన అబద్ధాలకోరు లేడని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన్ను మించిన పెద్ద అబద్ధాలకోరు నారా భువనేశ్వరి అని ఇప్పుడే ప్రజలకు తెలుస్తోంది. వారి కొడుకు లోకేశ్ కూడా తల్లిదండ్రులకు ఏమీ తీసిపోడని.. అబద్ధాలు అల్లి ప్రజల్ని నమ్మించే ప్రయత్నాల్లో ‘నారా’ వారి కుటుంబానికే ‘ఆస్కార్’ అవార్డు ఇవ్వొచ్చు. ఆ రూ.20వేల కోట్ల ఆస్తులెక్కడివి? నారా భువనేశ్వరిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 2016లో నారా చంద్రబాబు కుటుంబ ఆస్తులు రూ.57వేల కోట్లు అని అధికారికంగా చెప్పారు గదా..? మరి, మొన్న భువనేశ్వరి హెరిటేజ్ గురించి మాట్లాడుతూ.. ఆ కంపెనీలో 2 శాతం షేర్ అమ్మితే రూ.400 కోట్లైతే.. మొత్తం కంపెనీ అమ్మితే రూ.20వేల కోట్లు విలువుంది అని ఆమే చెప్పింది. ఇదంతా అవినీతి చేయకుండానే పోగేసుకున్నారా..? పాలమ్మితేనో.. కూరగాయలు అమ్మితేనో రూ.20వేల కోట్లు సంపాదించామని ప్రజలకు సమాధానం చెప్పగలరా...?. హెరిటేజ్ కంపెనీని వేరే వాళ్ల నుంచి తీసుకున్నారు. మీరుంటున్న ఇల్లు లింగమనేని దగ్గర్నుంచి క్విడ్ ప్రోకోగా తీసుకున్నారు.. మీరు నడిపే టీడీపీ ఎన్టీఆర్ గారి నుంచి లాక్కున్న విషయం జగమెరిగిన సత్యమే కదా..? ఈ విషయాలన్నీ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. మీరు నీతిగా బతుకుతున్నామని చెప్పుకుంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజాకోర్టులో దోషిగా బాబు.. వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి తుఫానుకు నేలకొరిగిందన్న చందంగా రాజకీయాల్లో 40 ఏళ్లపాటు అవినీతి చేస్తూ.. వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చిన చంద్రబాబు పాపం ఇన్నాళ్లకు పండింది. కాబట్టే, ఆయన దొంగలా దొరికి జైలుపాలయ్యాడని ప్రజలకు అర్ధమైపోయింది. కనుకే, టీడీపీ నిరసన కార్యక్రమాలకు ప్రజల స్పందన కరువైంది.న్యాయవ్యవస్థల తీర్పు ఎలా ఉన్నప్పటికీ, ఇప్పటికే ప్రజాకోర్టులో చంద్రబాబు దోషిగా నిలబడ్డాడు. చంద్రబాబును ఆదరించే వర్గం కనుచూపుమేరలో కనిపించడంలేదు. రేపటి ఎన్నికల్లో కూడా ఆపార్టీతో పాటు చంద్రబాబుకు మద్ధతిచ్చే ఇతర పార్టీలను సైతం మట్టికరిపించి.. వైఎస్‌ఆర్‌సీపీకి మరోమారు అఖండ మెజార్టీతో అధికారం కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.