రాజ్యాంగాన్ని బలపరుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం

రిపబ్లికే డే శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్‌
 

తాడేపల్లి: భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసే రాజ్యాంగాన్ని బలపరుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం మంటూ  వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా తెలుగు ప్రజలకు ఆయ‌న తెలిపారు. ఈ క్రమంలో దేశంలో రిపబ్లిక్‌ డే వేడుకలు భిన్నత్వంలో ఏకత్వ బలాన్ని చాటి చెప్తాయని తెలిపారు.

వైయ‌స్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..
తెలుగు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌.. ‘రిపబ్లిక్‌ డే వేడుకలు భిన్నత్వంలో ఏకత్వ బలాన్ని చాటి చెబుతాయి. ఈ వేడుకలు సాంస్కృతిక వైవిద్యానికి అద్దం పడుతాయి. భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసే రాజ్యాంగాన్ని బలపరుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం’ అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు. 

Back to Top