మెరుగైన సమాజం అంటూ ఓ కుక్క మొరుగుతుంటుంది. గరుడ పురాణం అంటూ ఓ నక్క ఊళ పెడుతుంటుంది. ఇలాంటి ఇంకొన్ని మేక తోలు కప్పుకున్న జంతువులను ఓ తోడేలు వెనకుండి నడిపిస్తోంది. పచ్చి మోసం చేస్తూ పట్టపగలు పట్టుబడి నడ్డి విరగ్గొట్టించుకుని కరకట్ట కింద తలదాచుకున్న ఆ తోడేలుకు తానా తందానాలడటమే ఈ కుక్క, ఆ నక్క పని. దాన్నే సమాజ సేవ అని ప్రచారం చేసుకోడం ఈ జీవాల విచిత్ర లక్షణం. కాలం ఎన్నడూ ఒకలా ఉండదు కదా. వాస్తవాలను బయటకు తేకుండా మానదు కదా! వేయి గొడ్డలను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకొరిగినట్టు,,, శకునాలు పలికే బల్లి కుడితిలో పడి కొట్టుకు చచ్చినట్టు ఇప్పుడా మొరిగే కుక్కా, ఊళపెట్టే నక్కా ఉచ్చులో చిక్కాయి. కుక్క మొరుగుడంతా మోసమని, నక్క ఊళలన్నీ వేషమని అందరూ గ్రహించారు. విశ్వసంగల జంతువులా సమాజాన్ని కాపలాకాస్తూ దొంగలను పట్టించే కుక్క అని నమ్మిన వాళ్లకు ఆ కుక్కే దొంగలకు దొంగ అని తెలిసిపోయింది. ఊళ వేసే నక్క తన యజమాని ఉనికిని దాచిపెట్టి, విషయాలను పక్కదారి పట్టిస్తోందని తెలుసుకున్నారు. జనాలకు తమ గుట్టు తెలిసిపోయిందని అర్థమైన ఈ రెండు జీవాలు కరకట్ట కిందున్న తోడేలు దగ్గరకు చేరి నక్కాయి. ఇన్నాళ్లూ ఇష్టం వచ్చినట్టు కూసిన నోళ్లు మూతపడ్డాయి. నిజాలు చెప్పమని నిలదీస్తే తడబడ్డాయి. ఇవే కాదు ఇలాంటి ఎన్నో నీతిమాలిన జంతువులు ఇప్పుడు తోడేలు సంరక్షణలో ఉన్నాయి. సమాచారాన్ని తస్కరించిన సన్నాసి కోతి, కోట్లు మింగిన కొండచిలువ, చదువులను చట్టుబండలు చేసిన ఎలుగుబంటి...వీట కథ ముగింపుకు రాబోతోంది. ఈ గుంపును గంప గుత్తిగా పట్టి బంధించే వేట మొదలౌతోంది..సింహంతో ఆటాడిన అరాచకానికి అసలైన జవాబు దొరకబోతోంది. రాజైన సింహం జూలు విదిలిస్తోంది. అడవి ధర్మం తనపని తాను చేసుకుపోతోంది.