తాడేపల్లి: రాష్ట్రంలో విద్యుత్ రంగానికి ఇప్పుడు చీకటి రోజులు అని, చంద్రబాబు హయాంలో ఎప్పుడూ వెలుగులు అనేవి ఉండవని వైయస్ఆర్‌సీపీ నేత, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ తేల్చి చెప్పారు. చంద్రబాబు పేరు వినగానే ఎవరికైనా గుర్రాలతో తొక్కించడం, తుపాకులతో కాల్చడం వంటివి గుర్తొస్తాయని ఆయన తెలిపారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ట్రూఅప్ ఛార్జీలు కూడా రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన చంద్రబాబు, ఇప్పటికే ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో రూ.15 వేల కోట్లకు పైగా భారం మోపారని ఆక్షేపించారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు 50 శాతం పెరిగాయని తెలిపారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ డిస్కమ్‌లు నష్టాలబారిన పడతాయని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అరుణ్‌కుమార్ గుర్తు చేశారు. ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ ఇంకా ఏం మాట్లాడారంటే..: ‘టైమ్ ఆఫ్‌ది డే’ పేరుతో మోసం: విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు, ‘టైమ్ ఆఫ్ ది డే’ పేరుతో వినియోగదారుడికి తెలియకుండా దొడ్డిదారిన బిల్లులు వసూలు చేస్తున్నారు. సా. 6 నుంచి రాత్రి 10 గం. వరకు ఒక రేటు, మిగిలిన సమయంలో మరో రేటుతో వినియోగదారులపై ఛార్జీల భారం మోపుతున్నారు. అలా ప్రతి యూనిట్‌పై దాదాపు 40 పైసల భారం వేస్తున్నారు. ఇక చిరు వ్యాపారుల పరిస్థితి మరీ ఘోరం. వారిపై ట్రూఅప్ ఛార్జీలతో పాటు, ‘టైం ఆఫ్ ది డే’ పేరుతో ప్రతి యూనిట్‌పై 6 పైసల నుంచి రూపాయి వరకు అదనపు భారం పడుతోంది. అలా సర్దుబాటు ఛార్జీలు, ‘టైం ఆఫ్ ది డే’ పేరుతో సుమారు రూ.4వేల కోట్లు విద్యుత్ వినియోగదారుల నుంచి రాబట్టాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. అయితే అది నేరుగా వేస్తే, గుర్తిస్తారు కాబట్టి, బిల్లుని ముక్కలుముక్కలుగా చేసి వాయిదా పద్థతిలో రాబట్టేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. జగన్‌గారి వల్ల రూ.1.10 లక్షల కోట్లు ఆదా: గత ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు చెప్పిందేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి? విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి, తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.15,485.36 కోట్ల భారం మోపారు. 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు, రాష్ట్రానికి తీరని నష్టం చేసేలా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకున్నారు. అప్పుడు మార్కెట్‌లో ఆ స్థాయిలో రేటు లేకున్నా అధిక ధరలతో పీపీఏ చేసుకున్నారు. యూనిట్ విద్యుత్‌కు సగటున రూ.4.84 చొప్పున సోలార్ సెక్టార్‌లో 35 పీపీఏలు, విండ్ పవర్‌లో ఏకంగా 133 పీపీఏలు చేసుకున్నారు. ఆ తర్వాత వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెకీ ద్వారా యూనిట్ విద్యుత్ కేవలం రూ.2.49 కే ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలా ఒక్కో యూనిట్ విద్యుత్‌పై ప్రభుత్వానికి రూ.2.35 ఆదా చేయడం జరిగింది. సెకీతో మా ప్రభుత్వం ఒప్పందం చేసుకోకపోయి ఉంటే, అంతకు ముందు చంద్రబాబు చేసుకున్న ఒప్పందాల వల్ల 25ఏళ్లలో అదనంగా రూ.50 వేల కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడేది. అదే విధంగా సోలార్ సెక్టార్‌లోనూ చంద్రబాబు చేసుకున్న ఒప్పందాల వల్ల మరో రూ.40 వేల కోట్ల మేర అదనపు భారం పడేది. నాడు సీఎం వైయస్ జగన్, ముందుచూపుతో ఆలోచించి సెకీతో ఒప్పందం చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.1.10 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. చంద్రబాబు పాలనలో డిస్కమ్‌ల కష్టాలు: చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్)కు కష్టాలే. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి డిస్కంలకు రూ.29 వేల కోట్ల బకాయిలు ఉంటే, 2019లో ఆయన దిగిపోయే నాటికి డిస్కమ్‌ల బకాయిలు రూ.86 వేల కోట్లకు చేరాయి. 2019లో జగన్‌గారు సీఎం అయ్యాక, రైతుల విద్యుత్‌కు సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిపోయిన రూ.8,845 కోట్ల బకాయిలు చెల్లించింది. మరోవైపు డిస్కమ్‌లకు మా ప్రభుత్వం బాసటగా నిల్చింది. టీడీపీ ప్రభుత్వంలో డిస్కంలకు కేవలం రూ.13 వేల కోట్ల మేర సాయం చేస్తే, జగన్‌గారి పాలనలో దాదాపు రూ.47 వేల కోట్లు సాయం చేయడం జరిగింది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో..: వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వ్యవసాయ అవసరాలకు పెద్ద పీట వేస్తూ 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేశాం. 6,663 వ్యవసాయ విద్యుత్తు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. వివిధ వర్గాల పేదలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందచేసిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, వాడుకున్న దానికన్నా కట్టే బిల్లులు ఎక్కువ అయ్యాయని ఎమ్మెల్సీ ఎం.అరుణ్‌కుమార్ గుర్తు చేశారు. చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్)కు కష్టాలే. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి డిస్కంలకు రూ.29 వేల కోట్ల బకాయిలు ఉంటే, 2019లో ఆయన దిగిపోయే నాటికి డిస్కమ్‌ల బకాయిలు రూ.86 వేల కోట్లకు చేరాయి. 2019లో జగన్‌గారు సీఎం అయ్యాక, రైతుల విద్యుత్‌కు సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిపోయిన రూ.8,845 కోట్ల బకాయిలు చెల్లించింది. మరోవైపు డిస్కమ్‌లకు మా ప్రభుత్వం బాసటగా నిల్చింది. టీడీపీ ప్రభుత్వంలో డిస్కంలకు కేవలం రూ.13 వేల కోట్ల మేర సాయం చేస్తే, జగన్‌గారి పాలనలో దాదాపు రూ.47 వేల కోట్లు సాయం చేయడం జరిగింది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో..: వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వ్యవసాయ అవసరాలకు పెద్ద పీట వేస్తూ 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేశాం. 6,663 వ్యవసాయ విద్యుత్తు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. వివిధ వర్గాల పేదలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందచేసిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, వాడుకున్న దానికన్నా కట్టే బిల్లులు ఎక్కువ అయ్యాయని ఎమ్మెల్సీ ఎం.అరుణ్‌కుమార్ గుర్తు చేశారు.