అమరావతి: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఏనాడు కూడా పర్యావరణం గురించి పట్టించుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నా తనకు పర్యావరణం గురించి పట్టదు. అలాంటి వ్యక్తి పర్యావరణం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. నారా వారి అరాచకాలు ఎన్నెన్నో.. కృష్ణా నది కరకట్ట మీద అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటాడు. ప్రజావేదిక అంటూ ప్రభుత్వ భవనాన్ని కూడా నిబంధనలు అతిక్రమించి అక్రమనిర్మాణం చేసి అందులో పార్టీ కార్యక్రమాలన్నీ చేసుకుంటాడు. కుల అస్మదీయులందరికీ ఆక్రమణలకు పర్మిషన్ ఇచ్చేసాడు. వాటర్ మ్యాన్ రాజేందర్ సింగ్ నదీపరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాలన్నందుకు తన గూండా కార్యకర్తలతో ఆయన కారును వెంటాడి వేధింపులకు గురిచేయించాడు నీరు, మట్టి, ఇసుక అడ్డగోలుగా దోపిడీ చేసాడు ఆ ఇంటికి సమీపంలోనే అడ్డగోలుగా నదీపరివాహక ప్రాంతంలో చేసిన ఇసుక దోపిడీ చేస్తున్నారని గుర్తించిన NGT (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) బాబు ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా విధించింది. సొంత ఎంపీది కనుక అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమ పర్యావరణ ఉల్లంఘనలు చేసినా పట్టించుకోలేదు. పర్యావరణ వైవిధ్యాన్ని నాశనం చేస్తూ, ఆహారధాన్యాల కొరత వచ్చేలా మూడు పంటలు పండే వేలాది ఎకరాల పచ్చటి భూములను దిబ్బచేసి రాజధాని నాటకం ఆడాడు. ప్రజలకు గ్రాఫిక్స్ తో ఆశలు చూపించి పంట భూమిని రియలెస్టేట్ సామ్రాజ్యంగా మార్చాడు ఉద్దానంలో ఏళ్ల తరబడి ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనీసం పట్టించుకోలేదు పట్టిసీమలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి ఇన్ని ఘాతకాలు చేసిన బాబు నేడు రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంటే పర్యావరణానికి ముప్పు అని దాన్ని క్యాన్సిల్ చేయమని లేఖలు రాయిస్తున్నాడు. తెలంగాణలో ఫార్మా కంపెనీలు ఉండగా లేని పర్యావరణ సమస్య ఏపీలో మాత్రమే వస్తుందా? అయినా నిబంధనలకు లోబడి, వ్యర్థాలను సవ్యంగా రీసైకిల్ చేసే వ్యవస్థ ఉంటేనే సదరు కంపెనీలకు అనుమతులు వస్తాయి. అది తెలిసి కూడా రాష్ట్రం అభివృద్ధి చెంద కూడదని, ఆ ఘనత వైయస్ జగన్ కి రాకూడదనే కుత్సిత బుద్ధితో మాత్రమే చంద్రబాబు ఈ నీచమైన కుట్రలకు పాల్పడుతున్నాడు.