చేపలను మింగడానికి దొంగకొంగ మంచి కొంగలా నాటకమాడే కథ మీ అందరికీ తెలుసుకదా! కానీ చంద్రబాబు నోటి వెంట అదే కథ వింటే ఎలా ఉంటుందో తెలుసా? అబద్ధాలకు పసుపు పెయింట్ వేసి సరికొత్తగా ప్రజెంట్ చేయడం చంద్రబాబు స్పెషాలిటి. అలాంటి నేర్పరితనంతో కొత్తగా బాబు చెప్పిన కొంగ కథ ఇదిగో. నల్ల నల్లని కొంగ. రంగు కారు నలుపైనా మనసు కాటుకంత మెత్తన. చెరువులో ఉన్న చిన్ని చేపలను కాపాడేందుకు కొంగ చాలా తపన పడింది. కొల్లేరు కింగు లాంటి కొంగ. కొల్లేటికి ఈ కొంగే దేవుడు. చేపలకు జలబు చేస్తే ఉచితంగా వైద్యం చేసింది. చేపలు వేటగాళ్ల వల బారిన పడకుండా తన ముక్కు అడ్డు పెట్టి కాపాడింది. కొల్లేటి చేపలు బతికున్నాయంటే ఈ కొంగ చలవే. కొల్లేటిలో ఏ చేపనడిగినా చెబుతాయి కొంగ ఘన చరిత్ర. అలాంటి కొంగ దొంగ జపం చేసుకుంటూ ఒంటికాలిమీద నిలబడి ఉండగా కొండ రాయి మీదపడి గుండె పగిలి చనిపోవడం ఏమిటి? ఇది ముమ్మాటికీ వేటగాళ్ల కుట్రే. వాళ్లే ఈ కొంగ కింగును వెంటాడి వేధించి చంపారు. కొల్లేటి కింగ్ లాంటి కొంగ చావుకు కారణమైన ఎవ్వరినీ వదలను. ఇదినా శపథప్రతిజ్ఞఆన.