సీజన్ లాంటోండిని అంటున్న పవన్ నాయుడు

రెగ్యులర్ రాజకీయ నేతను కాను నేను అంటున్నాడు పవన్ కళ్యాణ్. అందులో అక్షరం కూడా అబద్ధం లేదు. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడో, అవసరం వచ్చినప్పుడో తప్ప పవన్ నాయుడికి రాజకీయాలతో పనుండదు. బాబు స్క్రిప్టుకు పవన్ పర్ఫెక్ట్ యాక్టర్. అసలు పుత్రుడు నటనలో వీక్ అయినా దత్త పుత్రుడు మాత్రం పీక్‌. సినిమాల్లో కంటే రియల్ లైఫ్ లోనే రాణిస్తున్నాడన్న పేరు తెచ్చుకున్నాడు.
పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తే కొన్ని సీన్ల గురించి, అదే సీజన్ల  గురించి చూద్దాం.
ఎన్నికల సమయాల్లో - అయితే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాబుకు మద్దతు ఇవ్వడం కోసం రాజకీయ నేత అవుతాడు.
బాబు గురించి నెగిట్ వార్తలు వస్తున్న సమయాల్లో - ఇలాంటప్పుడు పవన్ వెంటనే స్పందిస్తాడు. బాబు మీద ఈగవాలకుండా విషయాన్ని చక్కగా డైవర్ట్ చేస్తాడు. ట్విట్లర్లో ఊగిపోతూ, ప్రెస్ మీట్లలో రేగిపోతూ, సభల్లో తూగిపోతూ రెచ్చిపోయి పెర్ఫార్మెన్స్ చేస్తాడు.
సీఎం జగన్ కు ప్రజల్లో ఆదరణ  పెరుగుతోందనుకున్నప్పుడు - ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంక్షేమ పథకాలు, ఆయన నిర్ణయాల వల్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది అనుకోగానే పవన్ రంగంలోకి దిగుతాడు. లేదా బాబు దిగగానే వెన్నంటి నడుస్తాడు.
బాబుపై విమర్శలు వచ్చిన సమయంలో - తమ పార్టనర్‌ పై విమర్శల వర్షం పడుతోందనగానే గొడుగేసుకుని తయారౌతాడు ప్యాకేజ్ నాయుడు.
టీడీపీ కష్టకాలంలో - బీజేపీతో పొత్తుకోసం ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్న తరుణంలో బాబును ఆదుకునే ఆపద్భాంధవుడిలా దిల్లీకి పయనమవుతాడు పవన్ నాయుడు. బీజేపీ పెద్దలపట్ల ఎప్పుడూ లేని గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తాడు. పెద్ద నాయుడి ప్రాధేయపూర్వక విజ్ఞప్తులను కేంద్ర పెద్దలకు చేర వేసేందుకు ప్రైవేటు కార్యక్రమాల పేరుతో దేశ రాజధానికి పరుగులు పెడతాడు. 

Read Also: వైయస్‌ జగన్‌ చిటికేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు

 

Back to Top